మేషం:  గత అనుభవం వలన కొన్ని సమస్యల నుండి మీరు నేర్పుతో బయటపడతారు. కళా, సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలను అందుకుంటారు.


వృషభం: సంతానం యొక్క విద్యా విషయమై దృష్టిని కేంద్రీకరిస్తారు. నిర్మాణ పనులలో వేగం కనబడుతుంది. మీ ఆధ్వర్యంలో నడిచే కొన్ని సంస్థలకు కొన్ని అవార్డులు లభించవచ్చు.


మిథునం: మీరు చేసే దర్యాప్తులో కొన్ని ముఖ్య రహస్యాలు తెలుస్తాయి. తీర్థయాత్రలు చేసే సూచనలు ఉన్నాయి. గృహ, శుభకార్యల సంబందమైన విషయాలకు గాను ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది.


కర్కాటకం: విదేశీ ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. జనాకర్షణ ఏర్పడుతుంది.చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం వలన గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటారు.


సింహం: సేవ కార్యక్రమాలకు గాను చందాలని పోగు చేస్తారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. మంచి వ్యక్తిగా మధ్యవర్తిగా పేరును గడిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో కొత్త కార్యక్రమాలను చేపడతారు.


కన్య: ఆర్థిక పరిస్థితి ఆశావహంగా ఉంటుంది. వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇంటాబయట మీదే పైచేయిగా ఉంటుంది.


తుల: ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.


వృశ్చికం: క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు.దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.మానసిక ఆనందం కలిగి ఉంటారు.


ధనస్సు:  గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూరప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. అనుకొని అతిధుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మానసిక ఆనందం కలుగుతుంది.


మకరం: భూముల విషయంలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు.రుణాలు తీరుస్తారు. కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


కుంభం: వివాదాస్పదమైన అంశాలలో తలదూర్చకండి.అనుకూల వాతావరణం కొత్త ఆశలకు దారితీస్తుంది అధికారులు సహుద్యోగులతో సామరస్యంగా మెలిగే లాభపడతారు. శుభవార్తలు వింటారు.


మీనం: స్పష్టమైన విధానాలను అవలంబిస్తారు. పోటీ తత్వాన్ని పెంచుకుంటారు. ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు బాధించే సూచనలు ఉన్నాయి.చాలా వరకు విషయాలలో సమర్థవంతంగా నిర్మొహమాటంగా ప్రవర్తిస్తారు.- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121