మేషం:  ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. అనవసరమైన వివాదాలు చోటు చేసుకుంటాయి. మిమ్మల్ని మీరు ఒంటరివారుగా భావిస్తారు.


వృషభం: బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. కలలు నిజమవుతున్నట్టుగా బ్రాంతి కలుగుతుంది. ఇంటి నిర్మాణానికి ఇల్లు మారడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.


మిథునం: మీకు సంబంధం లేని సమస్యలలో చిక్కుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి నుండి బయట పడతారు. ఇంట్లో శుభకార్యాలు ప్రస్తావన ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.


కర్కాటకం: మొండికి పడిన పనులలో కదలిక ఏర్పడుతుంది. ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని నేర్పుగా అందుపుచ్చుకోండి. శుభకార్య చర్చలు శుభకార్య ప్రసంగాలు సాగిస్తారు.


సింహం: ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చెప్పదగినది. కంప్యూటర్ వంటి సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి.


కన్య: ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహ స్థితి సూచిస్తున్నప్పటికీ నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. ప్రతి విషయానికి ఆచితూచి వ్యవహరిస్తారు.


తుల: ప్రయాణాలు లాభిస్తాయి. కొంతమందిని నమ్మి భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. మీ ఈ నిర్ణయంతో ఎవరు ఏకీభవించరు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు.


వృశ్చికం: విందు వినోదాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు ఉపకరిస్తాయి కూడా. స్వల్పకాలిక వ్యాపారాలను ప్రారంభిస్తారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.


ధనస్సు:  వైరి వర్గంతో అప్రమత్తంగా మెలగడం మంచిది.రుణాల మీద వడ్డీలు తగ్గించుకోవడానికి చేసే యత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూలపడుతుంది. స్వల్పంగా ధన లాభం.


మకరం: మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి. సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. మీ నిర్ణయాలతో విభేదించే వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా గమనిస్తారు.


కుంభం: ఎవరు మిమ్మల్ని మనసుకు తీసుకోవట్లేదు పైపై మాటలతో మోసగిస్తున్నారు అని భావిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇతరులు ఇచ్చే సలహాలను మాత్రం మీరు పాటించరు. శుభవార్తలు వింటారు.


మీనం: అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. వృత్తిలో పురోగతి సాధిస్తారు. వ్యాపార పరంగా అనుకున్న విధంగా మార్పులు చేర్పులు చేయగలుగుతారు. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. ప్రయాణాలు లభిస్తాయి.



- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121