మేషం:  కొత్త వస్తువులు కొనుగోలు యత్నాలు నిదానంగా సాగుతాయి. ప్రముఖులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం కాగలవు. తొందరపాటు మాటలు తగదు. రాజకీయ రంగాలలోని వారికి అనుకూలం .

 

వృషభం: క్రయవిక్రయాలలో కొంత నిదానం అవసరం. అనుభవం నేర్పిన గుణపాఠాలతో జీవితంలో కొన్ని మార్పులను చేర్పులను చేస్తారు. భూములకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకుంటారు.

 

మిథునం: చిన్ననాటి మిత్రుల నుండి సహాయం అందుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. శత్రువుల కుతంత్రాలను తెలుసుకుంటారు. బదిలీయత్నాలు ముమ్మరం చేస్తారు.

 

కర్కాటకం: వ్యాపారాలు అభివృద్ధి బాటలో ఉంటాయి. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంఘసేవ కార్యక్రమాలపై దృష్టిని సారిస్తారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు.

 

సింహం: ఆశ్చర్యకరమైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని సమస్యల నుండి బయటపడతారు.అధిక మొత్తంలో ధనాన్ని బుణ రూపేణా గ్రహిస్తారు. పదవులను సద్వినియోగం చేసుకుంటారు.

కన్య: ఎక్కువగా ఆధిపత్యపు పోరు ప్రతిచోట ఇబ్బంది పెడుతుంది. ఒక వర్గం వారిని సంతోష పెట్టడానికి మరొక వర్గంతో శత్రుత్వం వహించవలసిన అవసరం లేదని గ్రహించండి.మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

 

తుల: నిగూఢమైన మీ మనస్తత్వం వలన లాభనష్టాలు రెండు సరి సమానంగా ఉంటాయి. అనేక అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. అభివృద్ధి పదంలో ముందంజ వేస్తారు.

వృశ్చికం: నిరుద్యోగులకు శుభకాలం. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. కొత్త వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన.

ధనస్సు:  మీరు ఆశించిన రంగంలో మరింతగా పురోభివృద్ధిని సాధించవలసి ఉన్నదని భావిస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకొనడానికి ప్రయత్నిస్తారు. సుదీర్ఘ కాలపు పెట్టుబడుల జోలికి వెళ్ళక పోవడం మంచిది.

మకరం: కీలకమైన నిర్ణయాల వలన మీ జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం మీరు చేస్తున్న కృషికి గాను భవిష్యత్తులో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

కుంభం: మీ ఆలోచనలు, మాటల ద్వారా ఎదుటివారిని నియంత్రించాలని ప్రయత్నిస్తారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపిస్తారు. సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.

 

మీనం: అనుకోని అతిధుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దూరప్రాంతాల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది.



-బ్రహ్మశ్రీ సోమేశ్వర శర్మ సిద్దాంతి  

+91 8466932223,

+91 9014126121