మేషం:  మీరు అందరిలోనూ ప్రత్యేకంగా ఉండడం కొందరి అసూయకు కారణం అవుతుంది. మొండికి పడిన పనులు సానుకూల పడతాయి. సహోదర సహోదరి వర్గంతో బాంధవ్యాలు బాగుంటాయి.

వృషభం: కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించి మంచి ఉపకారం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. మానసికంగా ఆనందం కలిగి ఉంటారు.

మిథునం: కొన్ని సందర్భాలలో ఇతరులను ఆదర్శంగా తీసుకుని వినూత్న ప్రయోగాలు చేసి నామ మాత్రం ప్రయోజనాలు పొందుతారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి.

కర్కాటకం: మీరు అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తిస్తారు. మీరు నమ్మిన స్నేహితుల పనితీరు మీకు నచ్చదు. అర్థం లేని తగాదాలకు పరిష్కారం కనిపించదు. ఇది మీకు ఇబ్బందికర పరిణామంగా ఉండును.

సింహం: కుటుంబ ఖర్చులు వ్యక్తిగతమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. అందుకు తగ్గట్టుగానే ఆదాయం కూడా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: ఎవరు ఏ సహాయం అడిగినా కాదు అనకుండా సహకరిస్తారు. విజయాలు కార్య రూపంలో కనిపించిన అసహనంగా ఉంటారు. సామాజికపరమైన సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల: ఇంటర్వ్యూలు పోటీ పరీక్షలలో పాల్గొంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయాలలో బంధువుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

వృశ్చికం: సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది. ప్రజ్ఞపాటవాలను కనబరిచి పనులను సానుకూల పరుచుకోగలుగుతారు. పరపతి కలిగిన వారితోటి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ధనస్సు:  వృత్తి ఉద్యోగాల పరంగా అధిక శ్రద్ధను కనబరుస్తారు. అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని లాభపడతారు. ప్రజా సంబంధాలను విస్తృతపరచుకుంటారు.

మకరం: మీ ఉన్నతికి ఉపకరించే ప్రతి అంశం పట్ల జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక పురోభివృద్ధిని కొంతవరకైనా సాధించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో సలహాలను సంప్రదింపులను సాగిస్తారు.

కుంభం: సకాలంలో అనుకున్న విధంగా పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైన చిక్కుల నుండి పూర్తిగా కాకపోయినా ఒత్తిడి నుండి మాత్రం బయటపడతారు.

మీనం: మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి - ఉద్యోగాలపరంగా శ్రమ అధికంగా ఉండే వర్గాలకు మిమ్మల్ని బదిలీ చేసే సూచనలు ఉన్నాయి.



-బ్రహ్మశ్రీ సోమేశ్వర శర్మ సిద్దాంతి  

+91 8466932223,

+91 9014126121