మేషం:  ప్రతి విషయాన్ని సూక్ష్మదృష్టితో పరిశీలిస్తారు. విజ్ఞాన పరమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. విహారయాత్రలకు గాను తేదీలను ఖరారు చేసుకుంటారు. సానుకుల ధ్రుక్పధంతో మెలగుతారు.

వృషభం: స్నేహితులతో కలిసి నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమాలోచనలు సాగిస్తారు. అయితే ఈ ఆలోచనలు వెంటనే కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి గోచరించడం లేదు.

మిథునం: మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారికి దూరంగా ఉంటారు. నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది. పొదుపు పథకాలకు గండి ఏర్పడుతుంది.

కర్కాటకం: ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. మీపై ప్రచారంలో ఉన్న అపవాదులను రూపుమాపకునే ప్రయత్నాలకు గాను శ్రీకారం చుడుతారు.

సింహం: మీ ఆలోచనలు సవ్యమైన దారిలో ఉండటం వలన ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

కన్య: మిమ్మల్ని అభివృద్ధి చేసుకోవడానికి గాను ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఎంతసేపు ఎదుటివారు మీకు హితవు చెప్పడమే గాని కనీసం మీరు చెప్పేది ఆసాంతం వినని వ్యక్తుల వలన చికాకు కలుగుతుంది.

తుల: సుదూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. గతంలో కాదని తిరస్కరించిన కొన్ని వ్యవహారాలను తిరిగి పునః పరిశీలన చేస్తారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి.

వృశ్చికం: కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు కొంత సందిగ్ధత తదుపరి సానుకూల పడతాయి. మీ ఆలోచనలు సవ్యమైన దారిలో ఉండటం వలన ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

ధనస్సు:  ప్రియ భాషిత్వాన్ని అలవర్చుకోగలిగితే అనేక అంశాలను సులువుగా సానుకూల పరచుకోగలిగిన వారవుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్వల్పమైన ధన లాభం.

మకరం: ప్రతి విషయాన్ని కీడేంచి మేలేంచమన్న విధంగా ఆలోచిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీలో చురుకుదనం, వేగము లేవని భావిస్తారు. నూతనమైన బ్యాంక్ అకౌంట్ లను ప్రారంభిస్తారు.

కుంభం: ఉపయుక్తమైన సమాచారాన్ని సకాలంలో తెలుసుకోవడం వలన మీరు అధికంగా లాభపడే సూచనలు ఉన్నాయి. ధన వ్యయం అధికంగా ఉంటుంది.

మీనం: మీలో మొండితనం పట్టుదల అధికమవుతున్నట్లుగా గుర్తిస్తారు. కార్య విజయాన్ని సాధించాలంటే ఇటువంటి లక్షణాలు అవసరమే అని మీకు మీరే సర్ది చెప్పుకుంటారు. ఆరోగ్యం కొంత నలతగా ఉంటుంది.



-బ్రహ్మశ్రీ సోమేశ్వర శర్మ సిద్దాంతి  

+91 8466932223,

+91 9014126121