మేషం: చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
వృషభం: నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.
మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కర్కాటకం: ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
సింహం: ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చర్చిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
తుల: ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన ఋణయత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృశ్చికం: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.
ధనస్సు: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
మకరం: కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
కుంభం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.
మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేరుతాయి.

-బ్రహ్మశ్రీ సోమేశ్వర శర్మ సిద్దాంతి
+91 8466932223,
+91 9014126121