Article Search

 కార్తీక పురాణము -  నాలుగవ రోజు పారాయణము

ఈ కార్తీకమాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలంలో కూర్చునే లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్ళలో స్థిరవాసం ఏర్పరచుకుంటుంది. తులసీదళాలతోకానీ, జాజిపువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకమాసంలో భక్తితో పండ్లు దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లలా చెదిరిపోతాయి. ఉసిరిచెట్టు క్రింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తిరిగి చూడడానికి యముడికి కూడా శక్తి చాలదు.

Showing 1 to 1 of 1 (1 Pages)