Things to follow to obtain Lakshmi blessings...?

లక్ష్మీ కటాక్షం కోసం పాఠించవలసినవి ...?

లక్ష్మీ సంబంధమైన పూజకు పసుపురంగు బట్టలు వేసుకుని పైన శాలువా కప్పుకోవాలి. పశ్చిమాభిముఖంగా కూర్చుని సాధన చేయాలి. కొన్ని కొన్ని నియమాలు సాధారణ వ్యక్తులు: పాఠించలేరు కాబట్టి వారి కోసం కొన్ని సూచనలు ...

దీపావళి రోజున అఖండమైన రావిచెట్టు ఆకును కోసుకుని వచ్చి ఆ ఆకులు పూజాస్థలంలో కాని, పవిత్రమైన పరిశుభ్రమైన ప్రదేశంలో కాని ఉంచాలి. అలా కోసుకుని వచ్చిన మరుసటి శనివారం ఒక క్రొత్త రావి ఆకును మళ్ళీ  కోసుకునివచ్చి పాత ఆకును పెట్టిన చోటనే దీన్ని కూడా ఉంచాలి. ఇలా ప్రతి శనివారం చేస్తూ పోవాలి. ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక లక్ష్మీ కటాక్షం చాలు అనుకున్న రోజున ఈ విధానాన్ని ఆపివేయవచ్చు. దీపావళి అమావాస్య రోజున ప్రారంభించి ఎన్ని శనివారాలు చేసుకోవాలని సంకల్పం చేసుకుంటారో ఆవిధంగానే చేసుకోవాలి.

ఉదయం నిద్రలేవగానే ఎవరినీ చూడకుండా తమ అరచేతులను కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి, ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి. భోజనానికి ముందు ఎవరూ తాకని మొదటి ముద్దను ఆవుకు తినిపించండి. శనివారం రోజున గోధుమలను పిండి చేసే కార్యక్రమ నియమాన్ని పెట్టుకోవాలి. ఆ పిండిలో పదవభాగం చిన్న సైజు నల్ల శెనగలు కలపాలి. ఇంట్లో చీమలకు వాటికి చెక్కర కలిపిన పిండిని వేసి తినిపించాలి. ఇంట్లో ఉండే దేవీదేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ, చందనం, పువ్వులతో అలంకరించాలి. సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఇళ్ళు శుబ్రం చేసుకోకుండా ఉదయ అల్పాహారం తినకూడదు. సంధ్యాసమయంలో ఇళ్ళు ఊడ్చకూడదు. సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి లేదా కాళ్ళు, ముఖం కడుక్కుని అయినా ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి.

ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి. పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే ఒక స్పూను తీయిని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి. గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఎదో ఒకటి దానం చేయండి, దీన్ని తప్పక ప్రతి గురువారం అనుసరించండి. ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి. తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆర్థికపరమైన పనుల నిమిత్తం బయటకు వెళ్ళేముందు లక్ష్మీ సంబంధమైన యంత్రాలను కాని తాంత్రిక వస్తువులను కాని శ్రీ వినాయకుడిని దర్శించుకుని వెళ్ళాలి. ఆలాగే పువ్వులను దానం చేసి ఒక పువ్వును జేబులో వేసుకుని కాని దగ్గర పెట్టుకుని కాని వెళ్ళాలి.

ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం త్వరగా లభిస్తుంది. కొత్త కార్యం, వ్యవసాయం, ఉద్యోగం తదితర శుభకార్యాల కోసం వెళ్ళేముందు ఇంట్లోని మహిళ ఒక పిడికెడు మినుములు పిడికిటిలో బంధించి, వారికి దిష్టి తీసి పంపించినట్లయితే ఆ పనులలో వారు విజయం సాధిస్తారు. బయటికి వెళ్ళినవారు ఇంట్లోకి ప్రవేశించేముందు ఒట్టి చేతులతో కాకుండా ఏదో ఒక వస్తువును కాని కనీసం ఒక ఆకును అయినా ఇంట్లోకి తీసుకుని వెళ్ళాలి.  లక్ష్మీదేవికి ప్రతీకమైన నల్ల పసుపుకొమ్మును పూజాగదిలో కాని క్యాష్ బ్యాగులో కాని ఉంచుకుంటే మంచిది. కొన్ని తాంత్రిక వస్తువులకు శ్రీమహాలక్ష్మి తమవైపు ఆకర్షించే గుణం కలిగి ఉంటాయి వాటిలో నక్కకొమ్ము, పిల్లనాళము, ఏకముఖీరుద్రాక్ష, దక్షిణామూర్తి శంఖం, హత్తాజోడి, ఏకాక్షీ నారికేళం, శ్రీయంత్రం, కనకధారా యంత్రం వాటిలో ముఖ్యమైనవి. వీటిని ప్రాణప్రతిష్ఠ చేసి మంత్రసిద్ధం చేయాలి ఎందుకంటే ఇవి మామూలు వస్తువులు కావు వీటిని సరైన పద్ధతిలో భద్రపరిస్తే తగిన ఫలితం దక్కుతుంది.

దీపావళి రాత్రి లేదా గ్రహణ సమయాలలో ఒక లవంగం, ఒక యాలక్కాయ (ఇలాయిచీ)లను కాల్చి భస్మాన్ని దేవీదేవతల చిత్రపటాలకు, యంత్రాలకు పెట్టండి. ఏదో ఒక సూర్యనక్షత్రపు సమయంలో గబ్బిలాలు నివశించే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కొమ్మను ఒకదాన్ని విరిచి మీరు పడుకునే దిండు కింద పెట్టుకున్న తరువాత పరిణామాలను పరీక్షించండి.

ఇవే కాకుండా డబ్బులు బ్యాంకులో జమచేసే సమయంలో మనస్ఫూర్తిగా  'ఓం మహాలక్ష్మై నమః' లేదా 'ఓం శ్రీం హ్రీం క్లీం, హ్రీం, శ్రీం మహాలక్ష్మై నమః' అని జపించండి. అలాగే చెక్ బుక్, పాస్ బుక్ లేదా విలువైన కాగితాలు ఉన్న ప్రదేశంలో శ్రీయంత్రాన్ని కానీ కుబేరయంత్రాన్ని కానీ దగ్గరలో ఉంచాలి. శ్రీమహాలక్ష్మీదేవికి తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించాలి. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో ముఖం తూర్పువైపు లేదా పశ్చిమంవైపు ఉండేలా చూసుకోండి. ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రపరచుకోవాలి, సాలెగూళ్ళు, మట్టి, చెత్త విరిగిపోయిన వస్తువులను సర్థుకోవాలి. ఇంటి సింహద్వారం దగ్గర లోపలివైపు శ్రీవినాయకుడి చిత్రపటాన్ని ఉంచండి.

వినాయకుడి ముఖం ఇంటిని చూస్తున్నట్లు ఉండాలి. దిశను గురించిన పట్టింపు లేదు. వినాయకుడికి సూర్యోదయానికి పూర్వమే పచ్చిగడ్డి పరకలను సమర్పించాలి అలాగే మీరు మనస్సులో పదకొండు సార్లు నేను ధనవంతుడిని కావాలన్న దృఢసంకల్పాన్ని అనుకుంటూ ఉండండి ఎదో ఒకరోజు మీ కల తప్పకుండా నెరవేరుతుంది అని వేదపండితులు చెబుతున్నారు.  

Products related to this article

Jandhyam (Vodikinavi)

Jandhyam (Vodikinavi)

Jandhyam(Vodikinavi)Yagnopaveetham paramam pavithramPrajapatheryasahajam purasthadAayushyamagryam prathimuncha shubramYagnopaveetham balamasthu thejahYagnopaveetham is a triple stranded sacrificial fi..

$4.00

Handi craft Decorative Brass  Square Shaped Bowl with Spoon (4 Inch Diameter)

Handi craft Decorative Brass Square Shaped Bowl with Spoon (4 Inch Diameter)

Handi craft Decorative Brass  Square Shaped Bowl with Spoon (4 Inch Diameter)·         Product Dimension : Bowl 4" Diameter ·    &n..

$10.00

0 Comments To "Things to follow to obtain Lakshmi blessings...?"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!