Devotional Articles


మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా బంధువర్గములో మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది. శత్రువర్గం వారుకూడా అభినదించేలా నలుగురిలో గుర్తింపబడతారు. వ్యవసాయదారులకు మంచి అనుకూలమైన సమయం. వ్యవసాయ పరంగా కొత్త పనులు ప్రారంభించడానికి, అలాగే నూతన యంత్రాంగములు కొనుగోలు చేయడం వంటివి మంచిది. ఉద్యోగస్తులకు ఈవారం అన్ని విధాలుగా బాగుంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. తలపెట్టిన పనులను ద్విగిజయంగా పూర్తి చేస్తారు. అయితే మీ ముక్కు సూటితనం వల్ల కొన్ని ఇబ్బందులు వుండే అవకాశాలు సూచిస్తుంన్నాయి జాగర్త వహించడం చెప..

శ్రీ
గురుభ్యోన్నమః భాద్రపద
మాసంలో వినాయక చవితి మహాపర్వ
దినమును నవరాత్రుల ఉత్సవంగా
జరుపుకుంటాము కదా!
అలాగే
బహుళ పక్షంలో వచ్చే విశేషములు
గురించి తెలుసుకుందాం.
భాద్రపద
శుక్ల పక్షం శుభకార్యములు,
పండుగలకు
విశేషమైతే !
కృష్ణ
పక్షం పితృ కార్యములకు విశేషంగా
చెప్పవచ్చు.
భాద్రపదమాసంలో
వచ్చే అమావాస్యనే మహాలయ
అమావాస్య అంటారు.
అమావాస్యలు
సంవత్సరమునకు 12
ఉంటాయి
,మరి
భాద్రపద అమావాస్యకు ఇంత
విశిష్టత ఎందుకంటే....
పురాణాల
ప్రకారం మహాభారతం లోని కర్ణుడి
గురించి మనకందరికీ తెలుసు.
అతని
దాన గుణము గురించి చెప్పడానికి
మాటలు సరిపోవు,
అందుకే
అతనిని దానవీరస..

వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడుతారు? సమస్త దేవతలకు ప్రతీక ... పాలవెల్లివినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు...మన పెద్దలు కట్టారని మనమూ కడుతున్నాం... వాళ్ళు ఎందుకు కట్టారో, వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం.....వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి....ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్న..

నేడు వరాహ జయంతిభగవంతుడు దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు అవసరమైనప్పుడు లోకంలో అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలా అవతరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన అవతారాలు పది. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి అనే పేర్లతో దశావతారాలు ప్రాచీన గ్రంథాల్లో కనబడుతున్నాయి.దశావతారాల్లో మూడోదైన వరాహావతారం హిరణ్యాక్షుడి చెర నుంచి భూమిని రక్షించడానికి సంభవించిందని పురాణేతిహాసాలు వివరిస్తున్నాయి. పూర్వం దితి కుమారుడు, హిరణ్యకశిపుడి సోదరుడు అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు అహంకారంతో చెలరేగిపోయి భూమిని పాతాళానికి తోసివేశాడు. తన అన్నను చంపిన విష్ణువు అంటే ఇతడికి ద..
పోలాల అమావాస్య - పోలాంబ వ్రతం - ప్రాముఖ్యత!!పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత...దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుదీరి పూజలందు కుంటూ ఉండడం చూడవచ్చు.ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.పోలాల అమావాస్యవ్రతాలమాసంగా ప్రసిద్ధి చెందినది శ్రావణమాసంలోని వ్రతాలలో “పోలాల అమవాస్య వ్రతం” ఒకటి.దీనిని శ్రావణ మాసంలోని బహుళ పక్ష అమవాస్యనాడు ఆచరిస్తారు. ఈ అమవాస్యకు ‘పోలామావాస్య’ అని పేరు. దీనికే ‘పోలాల అమావాస్య , పోలాలమావాస్య , పోలాంబవ్రతం..

#శ్రీశైలం వృద్ధ మల్లికార్జునుడు...శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది.మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరునిసౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది.ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదల..

మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులుపుట్టినవాడు గిట్టక తప్పదు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి. దైవఋణం తీర్చుకోవడానికి వ్రతాలు, హోమాలు, దీక్షలు, పుణ్యక్షేత్రాల దర్శనం, తీర్థయాత్ర పర్యటనలు చేయడం ద్వారా తీర్చుకోవచ్చు. ఋషి ఋణం తీర్చుకోవడానికి పారంపర్యంగా వస్తున్న సంప్రదాయ పాలన, సద్ధర్మ పాలన. నియతి, గార్హపస్థ్య పాలనతో తీర్చుకోవచ్చు. అలాగే వంశంలోని పెద్దలపట్ల తీర్చుకోవాల్సిన శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, తర్పణాలు ఉంటాయి. ఈ పితృఋణం తీర్చుకోకపోవడం దోషం అని దాన్నే పితృదోషం అ..

దశావతారాలలో సంపూర్ణ అవతారమూర్తి శ్రీ కృష్ణుడు. తల్లిదండ్రుల పన్నెండు వేల సంవత్సరాల తపస్సు ఫలితంగా తనను తాను వారికి జన్మించిన దివ్య మూర్తి. మొదటి జన్మలో పృశ్నిగర్భుడుగా, రెండో జన్మలో వామనుడుగా, మూడవది ఆఖరుదైన జన్మలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. పుట్టిన వెంటనే శంఖం చక్రం గద మొదలైన వానితో దర్శనం ఇచ్చి నా లీలలు మననం చెయ్యండి అని మీకు ఇదే ఆఖరి జన్మ అని అనుగ్రహాన్ని కురిపించాడు. కళ్ళు పూర్తిగా విప్పకుండానే పూతన సంహారం చేసి కంసుడు పంపిన రాక్షస వధ చేసి తాను సామాన్య మానవుడు కాదని తన లీలల ద్వారా ప్రకటించాడు. కంసవధ చేసి, తాత గారికి తిరిగి మధుర రాజ్య పట్టాభిషేకం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు.&..

కృష్ణాష్టమి సందర్భంగా...రోజుకో ఆలయ విశేషం తెలుసుకుందాం....హంసలదీవి పుణ్యక్షేత్ర విశేషాలు...శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం. పులిగడ్డ దగ్గర కృష్ణ చీలి దక్షిణ కాశియని పేరు పొందిన కళ్ళేపల్లి (నాగేశ్వర స్వామి) మీదుగా హంసలదీవికి వచ్చినవైనం గురించి ఒక కధ వుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో వున్నది.పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఒక విష్ణ్వాలయం నిర్మించి అక్కడ వారు పూజాదికాలు నిర్వర్తించాలనుకున్నారు. మరి దేవతలు వచ్చి పూజలు చెయ్యాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా వుండేది. అందుకని దేవతలు ఇక్కడ వేణు గోపాల స్వామి ఆలయ..

కృష్ణుడి గురించి అందరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.....పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడుపరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. త్రేతా యుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపరంలో మహావిష్ణువు ఎత్తి..

Introduction
Arulmigu
Papanasanathar Temple is
situated in Papanasam
village in Tirunelveli
district, Tamil
Nadu,
and this temple is dedicated to Lord Shiva.
Here Lord Shiva is worshipped as Papanasanathar (The one who removes
our sins) and his consort Ma Parvathi is
worshipped as Ulagammai (The Universal Mother Goddess).The
temple was built by a Pandya King, and it was subsequently repaired,
renovated and extended by the Vijayanagar and
Nayak Kings during 16th century AD. The temple contains nice
sculptures which represents the..

అష్టలక్ష్మీ స్తోత్ర విశేషం.. మహత్యం అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత, అది పఠించడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతుంటే అష్టకష్టాలు పడుతున్నాం అని, ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నాం అని అనుకోవడం పరిపాటి. మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్ళీంచగలిగే శక్తి ఆ ఆదిమాత కే ఉంది. అష్టకష్టాలు నుంచి అష్టైశ్వర్యాలు ప్రసాదించు అద్భుత స్తోత్రమే " అష్టలక్ష్మీ స్తోత్రం "! అష్ట అంటే యెనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎన్మిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం...

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వావారి అపూర్వమైన దర్శనం.స్వామివారి విభూతి మహిమ.స్వామివారి లీల.కోట్లజన్మల పాపరాశులను భస్మం చేసే మహామహిమాన్వితమైన శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం.ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్ కుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి. ప్రస్తుతం మనం తిరుచెందూర్ గురించి తెలుసుకుందాము.Shop Now For Srava..

శ్రీవారి నిజపాద దర్శనం వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు. ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు.ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు. శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాల..