వివాహబంధం అందమైన అనుబంధం.

వివాహబంధం అందమైన అనుబంధం.

వివాహబంధం అందమైన అనుబంధం.సంసారం 7 జన్మల బంధం.

జీవితం అనేది జాతకాన్ని కొంత వరకు చూస్తాము తరువాత మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మన లైఫ్ ఒక యాంత్రిక జీవితం లా సాగుతోంది,. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా బిజీ బిజీ అయిపోయింది. ఈ లైఫ్ ని బిజీ చేసుకుంటే ప్రతి విషయానికి ఆందోళనలు పడుతూ లేనిదానికి ఉన్నదానికి గందరగోళం సృష్టించుకుంటూ, మన చుట్టూ ఉన్నవాళ్ళని పట్టించుకోకుండా గడిపేస్తున్నారు జీవితాన్ని. భార్యభర్తల మధ్య ఉన్న బంధాన్ని కూడా జీవితంలో ఒక చిన్న భాగం అని అనుకుంటారు. కానీ అదే మన జీవితం అని మరచిపోతుంటారు.

ఈ జనరేషన్ వారిలో ఉండవలసిన పరస్పరం నమ్మకం, ప్రేమ, గౌరవం, ఉండటం లేదు. దేవునిపై ఎంత శ్రద్ద భక్తి ఉంటుందో అదే విధంగా మన భవిష్యత్తు పై ఆశతో ఒకరికి ఒకరు నమ్మకం, ప్రేమ, తోడు నీడగా, చేదోడు వాదోడుగా ఉంటే, ఆ సంసారమే స్వర్గం. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటూ రెండు వైపులా ఉండాలి. ఆలా ఉంటే ఎప్పుడు మనస్పర్థలకు తావు ఉండదు. చిన్న చిన్న సంఘటనలు జరిగినా ఆ విషయాలను భూతద్దంలో చూడకుండా సర్దుకుపోతుంటే ఆ సంసారం స్వర్గ సీమ అవుతుంది.

పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరు ఆనందంగా కలసి మెలిసి ఉండేవారు, కానీ ఇప్పుడు ఎవరు వద్దు ఇద్దరమే ఉందాము అనే సంప్రదాయాలకు వస్తున్నారు. ఉన్న ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరికి గౌరవం లేదు, భయం, భక్తి లేదు. భార్యభర్తల మధ్య సఖ్యత కూడా ఉండటం లేదు. కుటుంబంలో ఒకరంటే ఒకరికి అప్యాయతలు లేనే లేవు ఇప్పుడు ఉన్నదంతా ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు తయారైంది. ఉదాహరణకు ఒక వంద రూపాయలు నలిపి పారేయమంటే ఆమ్మో ధన లక్ష్మి, లక్ష్మి దేవి ఆలా చేయకూడదు తప్పు అంటూ నీతులు చెపుతాము.

అలాంటిది మహా లక్ష్మి లాంటి భార్యకు గౌరవం ఇవ్వకపోతే సంసారం సజావుగా ఎలా సాగుతుంది. అలాగే భర్త విష్ణు మూర్తితో సమానంగా చూస్తాము అలంటి భర్తకు గౌరవం ఇవ్వకపోతే ఎలాగ. భార్యభర్తలు ఇద్దరు సమానం అని తెలుసుకుని అన్యోన్యంగా ఉన్న రోజున వారి బంధం బలంగా ఉంటుంది. భార్యా భర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, సమస్యలు వచ్చినా సర్దుకుపోవాలి తప్పా దూరాన్ని పెంచుకోకూడదు.

Products related to this article

Sravanamasam Pooja Kits - 1

Sravanamasam Pooja Kits - 1

Celebrate the holy month of Sravana with our specially curated Pooja Kits. Buy online and perform traditional rituals with ease. Limited stock available. Order now!Available Ites list:1. Stone Face2. ..

$40.00 $45.00

 Ayodhya Ram Lala Padukalu

Ayodhya Ram Lala Padukalu

Explore the divine craftsmanship with Pure Silver 999 Ayodhya Ram Lala Padukalu. These intricately designed silver padukalu are crafted with purity and devotion, symbolizing the divine presence of Lor..

$18.00