Benefits of Amla Lamps Offered to Goddess Lakshmi Devi ?

Benefits of Amla lamps offered to Goddess Laxmi Devi?

 

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజిస్తే ?

 

శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు, అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం.

శంకరాచార్యులవారు విరచించిన కనకధారా స్తోత్రం పఠించిన తరువాత ఉసిరికాయ బొబ్బట్టు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించడం వల్ల శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.

ఉసిరికాయ దీపంతో శ్రీమహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం నివారింపబడుతుంది.

అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీకమాసంలో ధాత్రి హవనం తరువాత ఉసిరికాయను హోమం పూర్ణాహుతికి సమర్పించండి.

అప్పుల బాధనుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీమహాలక్ష్మీదేవి చక్రానికి ఎనిమిది దిక్కులలో పెట్టి చక్రపూజ చేయాలి.

ఉసిరికాయ గుజ్జు, ఉసిరికాయ పచ్చడి శ్రీమహాలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించిన తరువాత ముత్తైదువులకు వాయనం ఇస్తే మొండి బకాయిలు వసూలు అవుతాయి.

ఉసిరికాయను శ్రీలక్ష్మీదేవి 'శ్రీ' చక్రానికి నైవేద్యంగా నివేదించిన తరువాత దాన్ని అందరికీ పంచితే ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.

శ్రీమహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తరువాత ఉసిరికాయను దానం చేస్తే నిత్య దారిద్ర్యం నుండి విముక్తి పొంది లక్ష్మీ కటాక్షానికి నోచుకుంటారు.

శ్రీసూక్తం పఠించిన తరువాత శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ, పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది.

ఉసిరికాయ చెట్టుకి ప్రతిరోజూ పూజ చేసిన తరువాత నీళ్ళు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.

ప్రతిరోజూ రోజూ పూజా చేసే  ప్రదేశంలో శంఖం ప్రక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయని పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతత, శాంతి కలిగిస్తుంది.

ఉసిరికాయ ఊరగాయ పక్కన నివశిస్తున్నవారికి లేదా బంధువుల ఇళ్ళకి పంచితే ఇంట్లోని కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి చేకూరి ప్రశాంతవంతమైన జీవనాన్ని సాగిస్తారు.

ఉసిరికాయను చేతపట్టుకుని సంగమ తీరాలలో రెండు లేదా ఎక్కువ నదులు సంగమించే స్థలంలో ప్రాయశ్చిత్త సంకల్పం చెప్పుకున్న తరువాత శివాలయంలో అర్చకులకు దానం ఇస్తే గత కర్మదోషాల నుండి విముక్తి పొందుతారు.

ఉసిరికాయను కాలితో తొక్కిన వారు నిత్య దారిద్ర్యం అనుభవిస్తారు.

ఉసిరికాయను డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్లయితే ధనం స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది.

ఉసిరికాయ దీపాలను తులసికోట ముందు వెలిగించినట్లయితే దైవ భక్తి వృద్ధి చెందడంతో పాటు అపమృత్యువు నివారింపబడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

కన్యలు ఉసిరికాయను శుక్రవారం ముత్తైదువులకు పంచిపెట్టినట్లయితే ఇష్టమైన కోరుకున్న కోరికలు ఫలిస్తాయి.

శ్రీ గణపతి హోమంలో శక్తిగణపతిని ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేస్తె అన్ని కార్యాలలో జయం మరియు వ్యాపారాలలో అధిక లాభాలు సిద్ధిస్తాయి.

కమలాక్షి మణితో శ్రీమహాలక్ష్మీదేవి జపాన్ని చేసిన తరువాత పండు ముత్తైదువుకి (60 సంవత్సరాలు పైబడిన) తాంబూలంలో పెట్టి దానం చేస్తే శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. 

0 Comments To "Benefits of Amla Lamps Offered to Goddess Lakshmi Devi ?"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!