Karthika Suddha Ekadashi

కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టత?

తోలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) రోజున శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుండి మేల్కొనే రోజు అందుకే ఇది ఉత్థాన ఏకాదశిగా పేరుపొందింది. దీనినే హరిబోధిని ఏకాదశి, దేవప్రబోధిని అని కూడా పిలుస్తారు. చాతుర్మాస వ్రతం ప్రారంబించిన తొలి ఏకాదశి, కార్తీకశుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. భీష్మపితామహుడు మహాభారత యుద్ధంలో ఈ ఏకాదశి రోజునే అస్త్రసన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈ రోజునే జన్మించాడు. కార్తీకశుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు. యోగులు, సిద్ధులు మొదలైన వారు విష్ణులోకం చేరుకొని కీర్తనలతో, భజనలతో, కర్పూరహారతులతో శ్రీమహావిష్ణువును మేల్కొలుపుతారు. విష్ణువుకి హారతి ఇవ్వడం వల్ల అకాలమృత్యు దోషం తోలిగిపోతుంది. విష్ణుమూర్తికి హారతి ఇవ్వడం కుదరని పక్షంలో దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ఇచ్చే హారతిని చూడండి, స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. బ్రహ్మదేవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన ఏకాదశి మహత్యాన్ని గురించిన విశేషాలు స్కాందపురాణంలో వివరించబడింది. 'ఈ ఏకాదశి సర్వపాపాలను హరిస్తుంది. వెయ్యి అశ్వమేథ యాగాలు, వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జీవుడు వేలజన్మాలలో చేసిన పాపాలను కాల్చేస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేసి, ఒక చిన్న మంచిపని చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు సర్వపాపపరిహారం కలుగుతుంది, పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞాలు, యాగాలు, వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది' అని బ్రహ్మదేవుడు నారదమహర్షికి తెలిపాడు. ఏకాదశి వ్రతం చేసినవారు ఒకరికి అన్నదానం చేయడం వలన సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. వస్త్రం, పళ్ళు, దక్షిణ తాంబూలాన్ని పండితులను దానం చేయడం వల్ల ఈ లోకంలోనే కాకుండా మరణం తరువాత కూడా స్వర్గసుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువుని పూజించి, రాత్రి జాగరణ చేసి, ద్వాదశి ఘడియలు ఉండగానే శ్రీమహావిష్ణుపూజ చేసి, భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీకశుద్ధ ఏకాదశి రోజున 'గోపద్మ వ్రతం చేయడం ఎంతో విశిష్టమైనది. గోమాత విరాట్ పురుషునితో పోల్చబడింది. గోవు ముఖంలో వేదాలు, కొమ్ములలో హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు. ఫాలభాగంలో ఈశ్వరుడు, చెవులలో అశ్వినీదేవతలు, కన్నులలో సూర్యచంద్రులు, దంతాలలో గరుడ, నాలుకలో సరస్వతి, ఉదరంలో స్కందుడు, రోమకూపంలో ఋషులు, పూర్వభాగంలో యముడు, పశ్చిమ భాగంలో అగ్ని, దక్షిణ భాగంలో వరుణకుబేరులు, వామభాగంలో యక్షులు, ముఖంలో గంధర్వులు, నాసాగ్రంలో పన్నగలు, అపానంలో సరస్వతి, గంగాతీర్థం, గోమయంలో లక్ష్మీ, పాదాగ్రంలో ఖేచరులు, అంబా అంటూ అరిచే అరుపులో ప్రజాపతి, స్తనంలో నాలుగు సాగరాలు ఉన్నట్లుగా వర్ణింపబడింది. అందుకే గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే అని, సమస్త తీర్థాలలో పుణ్యస్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఇటువంటి గోమాత నివశించే గోశాలను కార్తీకశుద్ధ ఏకాదశి రోజున శుభ్రంచేసి అలికి ముత్యాలముగ్గులతో రంగావల్లికలు తీర్చిదిద్ది గోశాల మధ్యభాగంలో బియ్యపు పిండితో ముప్పై మూడు పద్మాల ముగ్గులను వేసి, శ్రీమహాలక్ష్మీదేవి సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమలను పద్మములపై ఉంచి, వారిని శాస్త్రోక్తంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క అప్పడాన్ని వాటిపై పెట్టి ఆ అప్పడాలను, వాయనాలను, దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడిని సంతృప్తిపరచి, గోమాతను పూజించే వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయి.

Products related to this article

Designed  Bowl (Brass)

Designed Bowl (Brass)

Designed  Bowl (Brass)This bowl is made of bross which is used for decoartion prupose.The length of the bowl is : 15 Inchs Width of the Bowl : 7 Inchs Height of the Bowl : 9 Inchs ..

$8.46

Lava Bracelet

Lava Bracelet

Lava Braceletit is used for calming the emotions. Note : For this bracelet pour 2 drops of essential oil on this bracelet leave it for overnight and then use it...

$14.60

Ashtadala Padmam Vattulu

Ashtadala Padmam Vattulu

Ashtadala Padmam Vattulu..

$1.00

0 Comments To "Karthika Suddha Ekadashi "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!