Ksheerabdhi Dwadasi

క్షీరాబ్ధి ద్వాదశి :


కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. దీన్నే తులసీవ్రతం అని, క్షీరాబ్ధి శయనవ్రతం అని కూడా అంటారు. కృతయుగంలో ఇదే రోజున దేవతలు-రాక్షసులు అమృతం కోసం మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి, పాల సంముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే దీనికి చిలుకు ద్వాదశీ అని పేరు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగర శయనుడైన శ్రీమహావిష్ణువు మేల్కొని, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు లక్ష్మీ సమేతంగా తులసివనానికి తరలివస్తాడని ప్రతీతి. తులసి పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుని కుమార్తె. ఆమెను జలంధరుడు అనే రాక్షసుడికి ఇచ్చి వివాహం చేశారు. జలంధరుడు ఈశ్వర అంశ సంభూతుడు. సముద్రపుత్రుడు కావడం వలన దేవతలు సముద్రుని నుండి వశపరచుకున్న కౌస్తుభమణి, కామధేనువు, కల్పతరువు మొదలైన వాటిని తనకు ఇవ్వవలసిందిగా ఇంద్రుడిని జలంధరుడు కోరాడు. అందుకు ఇంద్రుడు అంగీకరించకపోవడంతో ఇంద్రుడితో యుద్ధం చేసి స్వర్గలోకాన్ని ఆక్రమించుకున్నాడు జలంధరుడు. జలంధరుడి భార్య ఎవరిని చూసి తన భర్త అని మోసపోతుందో అతని చేతులలోనే సంహరించబడతాడు అని బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందాడు జలంధరుడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవిని, కౌస్తుభమణిని పొందిన శ్రీమహావిష్ణువు, జలంధరుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. అది తెలుసుకున్న జలంధరుడి భార్య శ్రీమహావిష్ణువును శిలగా మారిపొమ్మని శపించింది. అందుకు విష్ణువు తులసికి నీవు ఎప్పటికీ మొక్కగానే ఉంటావు మానుకావని ప్రతిశాపం ఇచ్చాడట. అదే సాలగ్రామ శిల పూజలో ఉండటానికి కారణం అని కథనం.  కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుప్రతిమను తులసికోటలో ఉంచి పూజిస్తే సకల పాపాలు నశించి, విష్ణులోక సాయుధ్యాన్ని పొందుతారు. ద్వాదశి రోజున చేసిన పూజ, ఎంతటి ఘోరమైన పాపాలను కూడా అగ్నిహోత్రంలో వేయబడిన పత్తిని కాల్చివేసినట్లుగా కాల్చివేస్తుందని పురాణ వచనం. ఉసిరిచెట్టు విష్ణు స్వరూపం కాగా, తులసి లక్ష్మీస్వరూపం. ద్వాదశి రోజున తులసి - దామోదర వ్రతం చేస్తారు (ఉసిరి చెట్టుకి - తులసి చెట్టుకి). ఈ కళ్యాణం చేస్తే శ్రీలక్ష్మీనారాయణుల వివాహం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించినవారికి శ్రీమహావిష్ణు కృప కలుగుతుంది. తులసివనంలో శ్రీకృష్ణుని విగ్రహం దగ్గర దీపారాధన చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది, అంత్యంలో వైకుంఠానికి చేరుకుంటారు. తులసి వనంలో విష్ణువును పూజించనివారికి పూర్వపుణ్యాలు నశించి నరకలోకానికి వెళతారు, కోటిజన్మల పాటు పాపిగా పుడతాడు. తులసివనంలో విష్ణువును పూజించినవారు స్వర్గానికి వెళతారని, బ్రహ్మహత్యాపాతకం కంటే మహామహా పాపాలు నశించి పుణ్యాలు పొందుతారని పురాణం చెపుతుంది. తులసివనంలో వెలుగుతున్న దీపాల మధ్య ఉన్న శ్రీమహావిష్ణువు (ఉసిరిచెట్టు)ను దర్శించి నమస్కరిస్తే వారి కోరికలు వెంటనే తీరుతాయి. ఈ రోజున దీప దానం చేయడం అత్యుత్తమం. 

                        తులసి సమేత కార్తీక దామోదర వ్రతకల్పః


(కార్తీకమాసం నెలపొడుగునా ఈ వ్రతం ఆచరించే శక్తిలేనివారు కనీసం కార్తీక శుద్ధ చతుర్థశి నాడు అయినా, ఉద్యానవనంలో ఆచరించడం శ్రేష్ఠం)
తులసిని స్థాపించి, దాని చుట్టూ తోరణాలు - నాలుగు ద్వారాలు - పుష్ప వింజామరలతో ఉన్నటువంటి చక్కటి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నాలుగు దారాలతో - సుశీల, పుణ్యశీల, జయ, విజయులు అనే నాలుగు ద్వారపాలకులని మట్టితో నిర్మించి వాళ్ళని ప్రత్యేకంగా పూజించాలి. ఆయా మండలాలలో పంచలోక పాలకులని, అష్టదిక్పాలకులని, నవగ్రహాలని ఆరాధించాలి. తులసి ముందర సర్వతోభద్రం అనే రంగుల ముగ్గును వేసి, దానిమీద ప్రతిష్ట చెయ్యాలి. తరువాత తులసీధాత్రీ లక్ష్మీ సమేతంగా విష్ణువును ప్రతిష్టించాలి. బంగారు లేదా రజిత విగ్రహాలలో శ్రీహరిని ఆవాహన చేసి ఆరాధించాలి.


ధ్యానం :


శ్లో     దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్మాన్యధాః కరే !
    చక్ర మూర్థ్వకరేవామంగదా తస్యాన్యదః కరే !
    దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితం క్షీరాబ్ధిశయనం ధ్యాయేత్ నారాయణం ప్రభుం !!
    ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయనమః, ధ్యాయామి, 
ధ్యానం సమర్పయామి (పువ్వు ఉంచాలి)


మంత్రం:   ఓం సహస్ర శీర్షాపురుష !! సహా స్రాక్ష, స్సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్యా అత్యతిష్టద్దశాంగుళం !! ఓం తులసీ ... కార్తీకదామోదరాయనమః ఆవాహయామి (పువ్వు ఉంచాలి)


మంత్రం:   పురుషయే వేదగ్ం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నే నాతిరోహితి, ఓం శ్రీ తులసీ ... దామోదరాయనమః, ఆసనం సమర్పయామి (అక్షింతలు ఉంచాలి)


మంత్రం:  ఏకావానస్యమహిమా అతోజ్యా యాగ్ంశ్చపూరుషః పాదోస్య విశ్వాచూతాన త్రిపాదస్యామృతం దివి:! ఓం తులసీ ... నమః పాద్యం సమర్పయామి (నీరు చిలకరించాలి) మః త్రిపాదూద్వై ఉదైత్పురుషః పాదోస్యేహాభావాత్పునః తతోవిశ్వజ్వ్యక్రా మత్ సాశనానశనే అభి!! ఓం శ్రీ తులసి ... నమః, అర్ఘ్యం సమర్పయామి (నీరు చిలకరించాలి)


మంత్రం:     తస్మాద్విరాడజాయత విరాజో ఆధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి మధోపురః! ఓం శ్రీ ... నమః ఆచమనీయం సమర్పయామి (నీరు చిలకరించాలి)


మంత్రం:    ఓం యత్పురుషేన హవిషా దేవాయజ్ఞమతన్వత నసంతో ఆస్యాసీదాజ్యం గ్రీష్మయిధ్మ శరద్ధవి:!! ఓం శ్రీ ... నమః, స్నాపయామి (నీరు చిలకరించాలి)[శక్తిగలవారు పంచామృత స్నానాలు చేసుకోవచ్చు


మంత్రం:    ఓం సప్తాస్యాస స్పరిధయః త్రిస్సప్తసమిదః క్రుతాదేవా యద్యజ్ఞం తన్వానా !! అదిధ్నస్పురుశం పశుం ! ఓం శ్రీ ... నమః వస్త్రయుగ్మం సమర్పయామి (వస్త్రముల సమర్పణ)


మంత్రం:    యజ్ఞం బర్హిషి ప్రోక్షస్ పురుషం జాతమగ్రతః తేనదేవా అయజంత సాధ్యారుషయశ్చయే!! ఓం శ్రీ .. నమః యజ్ఞోపవీతం సమర్పయామి (యజ్ఞోపవీతం సమర్పణ)


మంత్రం:    తస్మాద్యజ్డాత్సర్వ హుతః సంభృతం వృషరాజ్యం పశూగ్ంస్తాగ్ శ్చక్రే వాయవ్యానరణ్యాన్ గ్రామాశ్చయే!! ఓం శ్రీ ... నమః చందనం సమర్పయామి (గంధం చిలకరించాలి) 


మంత్రం:   తస్మాద్యజ్ఞస్త స్మదపాయత !! ఓం శ్రీ ... నమః ఆభరణాన్ సమర్పయామి (ఆభరణాలు (అలంకారములు) సమర్పించాలి)


మంత్రం:     తసాదశ్వా అజాయంత యేకే జోభయాదతః గావోహిజిజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాతా అజావయః !! ఓం శ్రీ ... నమః పుష్పాణి సమర్పయామి (పువ్వు ఉంచాలి)


అథాంగపూజ :


ఓం సాదావంత కేశాయనమః - పాదౌ పూజయామి, నివృత్తనిమేషాది కాలాత్మనే జంఘే, విశ్వరూపాయ నమః జామనీ, జగన్నాథాయనమః గుహ్యం, పద్మనాభాయనమః నాభిం కుక్షిస్థాభిలనిష్పపాయనమః కుక్షిం, లక్ష్మీవిలసద్వక్షసేనమః వక్షం, చక్రాది హస్తాయనమః హాస్తౌన్, కంబుకంఠాయనమః కంఠం, చంద్రాముజాయనమః ముఖం, వాచస్వత్ యేనమః వక్త్రం, కేశవాయనమః నాసికం నారాయణాయనమః నేత్రౌ, గోవిందాయనమః శ్రోత్రే, నిగమశి రోగమ్యాయనమః శిరః, సర్వేశ్వరాయనమః సర్వాణ్యంగాని, ఓం శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయనమః అథాంగపూజాం సమర్పయామి 


శ్రీ దామోదర అష్టోత్తర శతనామావళీ


ఓం విష్ణవే నమః 
ఓం లక్ష్మీపతయే నమః

ఓం కృష్ణాయ నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం గరుడధ్వజాయ నమః
ఓం పరబ్రాహ్మణే నమః
ఓం జగన్నాథాయ నమః 
ఓం వాసుదేవాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హంసాయ నమః
ఓం శుభప్రదాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం పద్మనాభాయనమః
ఓం హృషీకేశాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మధురాపతయే నమః
ఓం తార్ క్ష్య వాహనాయ నమః
ఓం దైత్యాంతకాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం స్థితికర్త్రే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం యజ్ఞరూపాయనమః 
ఓం చక్రరూపాయ నమః
ఓం గధాధరాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం భూతలవాసాయ నమః
ఓం సముద్ర మధనాయ నమః
ఓం హరయే నమః
ఓం గోవిందాయ నమః
ఓం బ్రహ్మజనకాయ నమః
ఓం కైటభాసురమర్దనాయ నమః
ఓం శ్రీకారాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం చతుర్భుజాయనమః 
ఓం పాంచజన్యాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం పాజ్గిశార్ ణ యే నమః
ఓం జనార్థనాయ నమః
ఓం పీతాంభరధరాయ నమః
ఓం టేవాయ నమః
ఓం సూర్యచంద్రలోచనాయ నమః
ఓం లోచనాయ నమః
ఓం మత్స్యరూపాయ నమః
ఓం కూర్మతనవే నమః
ఓం క్రోఢరూపాయ నమః
ఓం హృకేశాయ నమః
ఓం వాఘనాయ నమః
ఓం భార్గవాయ నమః
ఓం రామాయ నమః
ఓం హాలినే నమః
ఓం కలికినే నమః

ఓం హర్యాననాయ నమః
ఓం విశ్వంభరాయ నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం దేవదేవాయ నమః

ఓం శ్రీధరాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం ధ్రువాయ నమః
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం రథవాహనాయ నమః
ఓం ధన్వంతరయే నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం ప్రద్నుమ్నాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం వక్సాకౌస్తుభధరాయ నమః
ఓం మురారాతయే నమః
ఓం అథోక్ష్జాయా నమః
ఓం ఋషిభాయ నమః
ఓం మొహినీరూపధరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం పృదివ్యే నమః
ఓం క్షీరాబ్ధిశాయినే నమః
ఓం భూతాత్మనే నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం గజేంద్రవరదాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం ప్రహ్లాద పరిపాలనాయ నమః
ఓం శ్వేతద్వీపవాసినే నమః
ఓం అనసూయ నమః
ఓం సూర్యమండల మధ్యగాయ నమః
ఓం అనాదిమధ్యాంత నమః
ఓం భగవతే నమః
ఓం రహితాయ నమః
ఓం శంకర ప్రియాయ నమః

ఓం నీలతనవే నమః
ఓం ధరామరాయ నమః
ఓం వేదత్మనే నమః
ఓం బాదరాయణాయ నమః
ఓం భాగీరథీజన్మభూమినే నమః
ఓం పాదపద్మాయ నమః
ఓం సతాం ప్రభవే నమః
ఓం సంభవే నమః
ఓం విభవే నమః
ఓం ఘనశ్యామాయ నమః
ఓం జగత్కారణాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం దశావతారాయ నమః
ఓం శాంతాత్మనే నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం విరాడ్రూపాయ నమః
ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః
ఓం శ్రీతులసీధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః


                    అథ అష్టోత్తర శతనామ పూజా సమాప్తం


మంత్రం:    ఓం యత్పురుషం వ్యాదధు: కథితావ్యకల్పయన్, ముఖం కిమస్యకౌలాహుకాపూరూపాడా ఉచ్చతే !! ఓం శ్రీ ... నమః దూపమాఘ్రాపయా!!


మంత్రం:    బ్రాహ్మణోస్యముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరూతదన్యయ ద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రోరజాయతః !! ఓం శ్రీ ... నమః! దీపం దర్శయామి


మంత్రం:    ఓం చంద్రనూమససోజాతః చక్షోనూర్యోరాజాయతః ముఖాదింద్రా శ్చాగ్నిశ్చ ప్రాణాద్వా యురజాయతః ఓం శ్రీ ... నమః నైవేద్యం సమర్పయామి!!


మంత్రం:     ఓం నాభాద్యాసీదంతరిక్షం శిర్శోణదౌస్యమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథాలోకాగ్ం అకల్పయన్ !! ఓం శ్రీ నమః ... తాంబూలం సమర్పయామి !!


మంత్రం:    వేదాహవమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తూ పారే సర్వాణిరూపిణి విచిత్యదీరః నామనిగృత్వాభి వదన్ యదాస్తే! ఓం శ్రీ ... మనం నీరాజనం సమర్పయామి (హారతిని ఇవ్వాలి)


మంత్రం:     ఓం ధాతా పురస్తాద్యముదా హార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ త స్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నానఃపంథా ఆయనాయ విద్యతే!! రాజాధిరాజాయ ప్రసహ్య సాహిణే నమోవయంవై శ్రవణాయ కుర్మహే సమేలమాన్ కామకామాయ మహ్యం కామేశ్వరోవై శ్రవణోదదాతు, కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః !! ఆకాశ తృలితంతోయం యధాగచ్చతి సాగరం, సర్వదేవనమస్కారం ప్రతిగచ్చతి !! ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ నమః, మంత్రపుష్పం సమర్పయామి!!


మంత్రం:    యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాకె ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!! ప్రదక్షిణం కరిష్యామి సర్వ భ్రమ నివారణం సంసారాన్మాంత్వ ముద్ధరస్వ మహాప్రభో!! శ్రీ కార్తీక దామోదరాయనమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి!! ఛత్రం సమర్పయామి, గామారం సమర్పయామి!! నృత్యం దర్శయామి, గీతం శ్రానయామి, సమస్త రాజోపచార-దేవోపగారాన్ సమర్పయామి,


శ్లో     యస్యస్మృత్యాచ నామోక్త్యా తపోపూజా వ్రతాదిషున్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే త ముచ్యుతమ్!!
ఓం తులసీధాత్రీ సమేత కార్తీక దామోదర ప్రసాదం శిరసాగృహ్ణామి!! స్వామివారి దగ్గరి అక్షతలు తీసుకుని తలపై చల్లుకోవాలి. అనంతరం స్థూపదీపం పెట్టి, స్వామికి చూపించి, పురాణకాలక్షేపం చేయాలి.


                    ఓం తత్సత్  

Products related to this article

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)..

$27.69

Designed  Bowl (Brass)

Designed Bowl (Brass)

Designed  Bowl (Brass)This bowl is made of bross which is used for decoartion prupose.The length of the bowl is : 15 Inchs Width of the Bowl : 7 Inchs Height of the Bowl : 9 Inchs ..

$8.46

0 Comments To "Ksheerabdhi Dwadasi "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!