Godadevi

గోదా కల్యాణం 


సుమారు ఎనిమిదవ శతాబ్దపు కాలంలో శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో రంగనాథస్వామి దేవాలయం ప్రధాన అర్చకుడిగా ఉన్న విష్ణుచిత్తుడికి పూలతోటలో ఒక పసిపాప దొరికిందట. పిల్లలు లేని విష్ణుచిత్తుడు ఆ పసిపాపకు కోదై అనే పేరుతొ పిలుచుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కాలక్రమంలో కోదై గోదా అనే నామంగా వ్యవహారంలోకి వచ్చింది. గోదాదేవి చిన్నతనం నుండే తండ్రి ద్వారా భగవంతుని కథలను విని ఆ భగవంతుడే తన భర్తగా పొందదలచింది. ద్వాపరయుగంలో వ్రజభూమిలో గోపికలు కాత్యాయిని వ్రతం చేసి, కృష్ణుని పొందినట్లుగా తెలుసుకొని, తాను కూడా శ్రీవిల్లిపుత్తూరునే వ్రజభూమిగా తలంచి, తన తోటి చెలికత్తెలను గోపికలుగా భావించి, వటపత్రసాయినే శ్రీకృష్ణునిగా తలచి వటపత్రశాయి ఆలయంలో మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించింది. గోదాదేవి ప్రతిరోజూ విష్ణుచిత్తుడు, రంగనాథున్ని అలంకరించడానికి మాలను చేసి ఉంచేవాడు. గోదాదేవి ఆ మాలను భగవంతుని కంటే ముందే ఆ మాలను ధరించేది. ఒకనాడు విష్ణుదత్తుడు కుమార్తె మాలను ధరించడం చూసి మందలించి, ఆనాడు స్వామివారికి మాలను వేయలేదు.    అదే రోజు రాత్రి శ్రీరంగనాథుడు, విష్ణుచిత్తుడికి కలలో కనిపించి 'గోదాదేవి వేసుకున్న మాల నాకు సమర్పించు. అవి అంటే నాకు అత్యంత ప్రీతికరం. నేనే మీ కుమార్తెను వివాహం చేసుకుంటాను. వివాహమహోత్సవానికి నా ఆజ్ఞ మేరకు తగిన సామాగ్రి సమకూర్చుకుని, పాండ్య మహారాజు ఘనస్వాగతంలో మిమ్ములను దంతపుపల్లకిలో ఆహ్వానిస్తారు. అని చెప్పి అంతర్థానం అయ్యాడు. ఆ మరుసటి రోజునే విష్ణుచిత్తుడు, గోదాదేవిని తీసుకుని శ్రీరంగానికి వెళ్ళాడు. శ్రీరంగంలో అందరూ చూస్తుండగానే పల్లకీ దిగి, గోదాదేవి గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా తిలకించి, స్వామివారి దివ్య పాదపద్మములలో అంతర్థానం అయ్యింది. విగ్రహరూపంలో ఉన్న స్వామిని వివాహమాడి గోదాదేవి భోగాలను అనుభవించింది కాబట్టి ఈ రోజుని 'భోగి' అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వ భోగభాగ్యాలు లభిస్తాయని, భోగభాగ్యాలు కలిగించే పండుగ కాబట్టి భోగిపండుగ అని కూడా అంటారు. 


శ్రీగోదా అష్టోత్తర శతనామావళి  


ఓం శ్రీరంగనాయక్యై నమః 
ఓం గోదాయై నమః
ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
ఓం సత్యై నమః 
ఓం గోపీవేషధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భూసుతాయై నమః
ఓం భోగశాలిన్యై నమః
ఓం తులసీకాననోద్భుతాయై నమః
ఓం శ్రీయై నమః                 10
 ఓం ధన్విపురవాసిన్యై నమః
ఓం భట్టనాధ ప్రియకర్యై నమః
ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః
ఓం ఆమూక్త మాల్యదాయై నమః
ఓం బాలాయై నమః
ఓం రంగనాథ ప్రియాయై నమః
ఓం పరాయై నమః
ఓం విశ్వంభరాయై నమః
ఓం కలాలాపాయై నమః
ఓం యతిరాజసహోదర్యై నమః            20
ఓం క్రిష్ణానురక్తాయై నమః
ఓం సుభాగాయై నమః
ఓం సులభశ్రియై నమః
ఓం సలక్షణాయై నమః
ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
ఓం శ్యామాయై నమః
ఓం దయాంచిత దృగంచలాయై నమః
ఓం ఫల్గున్యావిర్భవాయై నమః
ఓం రామ్యాయై నమః
ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః        30
ఓం చంపకాశోకపున్నాగామాలతీవిలసత్కచాయై నమః
ఓం ఆకారత్రయసంపన్నాయై నమః
ఓం నారాయణసమాశ్రితాయై నమః
ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై నమః
ఓం మోక్షప్రదానానిపుణాయై నమః
ఓం మంత్రంరత్నాధిదేవతాయై నమః 
ఓం బ్రహ్మణ్యాయై నమః 
ఓం లోకజనన్యై నమః
ఓం లీలామానుషరూపిణై నమః
ఓం బ్రహ్మజ్ఞాయై నమః                40
ఓం అనుగ్రహాయై నమః
ఓం మాయాయై నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః
ఓం మహాపతివ్రతాయై నమః
ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః
ఓం ప్రపన్నార్తిహరయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం వేదసౌధవిహారిణై నమః
ఓం శ్రీరంగనాథమాణిక్యమంజర్యై నమః
ఓం మంజుభాషిణై నమః                50
ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః 
ఓం రంగమంగళ దీపికాయై నమః
ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంమృదుపాదతలాంచితాయై నమః
ఓం తారకాకారనఖరాయై నమః
ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః
ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః
ఓం శోభనపార్షికాయై నమః
ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః
ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః
ఓం పరమాయై నమః                60
ఓం అణుకాయై నమః
ఓం తెజశ్శ్రియోజ్ఞ్వళధృతపాదాంగుళి సుభూషితాయై నమః
ఓం మీనా కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః
ఓం కకుద్వాజ్ఞానుయుగ్మాడ్యాయై నమః
ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః
ఓం విశాలజఘనాయై నమః
ఓం పీనసుశ్రోణై నమః 
ఓం మణిమేఖలాయై నమః
ఓం ఆనంద సాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః
ఓం భాస్వద్వళిత్రికాయై నమః            70
ఓం చారుజగాత్పూర్ణమహోదర్యై నమః
ఓం నవమల్లీరోమరాజ్యై నమః
ఓం సుధాకుంభాయితస్తన్యై నమః
ఓం కల్పమాలనిభభుజాయై నమః
ఓం చంద్రఖండనఖాంచితాయై నమః
ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః
ఓం నవారుణ ప్రవాళాభాపాణిదేశ సమంచితాయై నమః
ఓం కంబుకంట్యై నమః
ఓం సుచుబుకాయై నమః
ఓం బింబోష్ట్యై నమః                 80
ఓం కుందదంతయుజే నమః
ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః
ఓం ముక్తాశుచిస్మితాయై నమః 
ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః
ఓం దర్పణాకర విపుల కపోల ద్వితయాంచితాయై నమః
ఓం అనంతార్క ప్రకాశోద్యస్మణితాటంకశోభితాయై నమః
ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః
ఓం సుగంధ వదనాయై నమః
ఓం సుభ్రువే నమః
ఓం అర్థచంద్రలలాటికాయై నమః
ఓం పూర్ణచంద్రాననాయై నమః
ఓం నీలకుటిలాలక శోభితాయై నమః
ఓం సౌందర్యసీమాయై నమః
ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
ఓం ధగ\త్దగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః
ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః
ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః
ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకదారిన్యై నమః
ఓం నిగన్నిగద్రత్నపంజా ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః
ఓం సద్రత్నాచింతవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః    100
 ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః
ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః
ఓం స్వోచితౌజ్జ్వల వివిధ విచిత్ర మణిహారిన్యై నమః
ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః
ఓం శ్రీరంగనిలయాయై నమః
ఓం పూజ్యాయై నమః
ఓం దివ్యదేశ సుశోభితాయై నమః        108      


ఓం శ్రీరంగనాయక్యై నమః
ఓం శ్రీమహాలక్ష్మై నమః
ఓం శ్రీభూదేవ్యై నమః
ఓం శ్రీనీళాదేవ్యై నమః
ఓం శ్రీగోదాదేవ్యై నమః
ఓం అనంతాయ నమః
ఓం శ్రీగరుడాయ నమః
ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః
ఓం శ్రీపరాంకుశాయ నమః
ఓం శ్రీమతే రామానుజాయ నమః
ఓం శ్రీమద్వరవరమునయే నమః  
శ్రీ స్వాచార్యేభ్యో నమః
ఓం పూర్వాచార్యేభ్యో నమః
              

 ఓం సమస్తపరివార సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః 

 

                                      
 

Products related to this article

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

$7.00

Seven Chakras Bracelet

Seven Chakras Bracelet

There are seven energy points in the body that are known as chakras. Seven Chakras bracelets are used for balancing of your seven chakras.         ..

$22.00

Golden Obsidian Bracelet

Golden Obsidian Bracelet

It can help in all issues related to the will, such as clearing the negative effects of abuse of power, clarifying your true motivations...

$22.00

Sruk Sruvalu

Sruk Sruvalu

Sruk Sruvalu ..

$8.46

0 Comments To "Godadevi"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!