సత్యనారాయణస్వామి వ్రతం
వ్రత విధానం
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైశాఖ, మాఘ, కార్తీక మాసాలలో ఏ శుభదినం అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా కలతలతో ఉన్నవారు చేయడం మరీ మంచిది, శ్రేష్ఠం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నెలకు ఒకసారిగానీ, సంవత్సరానికి ఒకసారిగానీ చేయవచ్చు. మధ్యాహ్న సమయంలో సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రిని అమర్చుకోవాలి. సాయంకాలం అంటే రాత్రి ప్రారంభం అవుతున్న సమయంలో సత్యనారాయణస్వామి వ్రతం చేయాలి. నేటి రోజులలో ఉపవాసం ఉండలేక ప్రతివారూ ఉదయాన్నే చేసేస్తున్నారు కానీ సాయంత్రం పూజ చేయడం శ్రేష్టమైనది.
సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి :
| పసుపు - 100గ్రా | కుంకుమ - 100గ్రా | గంధం - ఒక డబ్బా | 
| అగరవత్తులు - ఒక ప్యాకెట్ | కర్పూరం - ఒక డబ్బా | తమలపాకులు - 100 | 
| నల్లవక్కలు - 100గ్రా | ఎండుకర్జూరం - 250గ్రా | పసుపుకొమ్ములు - 200గ్రా | 
| రూపాయి బిళ్ళలు - 65 | బియ్యం - 2 ½ కేజీలు | అరటిపళ్ళు - డజను | 
| కొబ్బరికాయలు - ఏడు | ఐదు రకాల పండ్లు - రకానికి ఐదు | తెల్ల కండువాలు పెద్దవి | 
| ఒకటి జాకెట్ ముక్క | ఒకటి స్వామివారి ఫోటో | విడిపువ్వులు - ¼ కేజీ | 
| పూలమాలలు - శక్తి కొలది | వత్తులు | నల్ల నువ్వుల నూనె, అగ్గిపెట్టె | 
| ప్రసాదానికి | ||
| బొంబాయి రావ్వి - 1 1/4కేజీ | పంచదార – 1/4కేజీ | జీడిపప్పు - 50గ్రా | 
| కిస్ మిస్ - 50గ్రా | యాలకుల పొడి - 50గ్రా | పానకం | 
| చలిమిడి | వడపప్పు | మామిడి ఆకులు | 
| కలశం చెంబు | ఏకహారతి పంచపాత్ర (రాగిది) | ఉద్దరిణి (రాగిది) | 
| అరివేణం (రాగిప్లేటు) | స్టీలు పళ్ళాలు - 2 | గ్లాసులు - 3 | 
| కొబ్బరినీళ్ళకు గిన్నె | పీటలు లేదా ఆసనాలు చేతిగుడ్డ | |
| పంచామృతం కోసం | ||
| ఆవుపాలు - ½లీ | ఆవుపెరుగు - 100గ్రా | ఆవునెయ్యి - 200గ్రా | 
| తేనె - 50గ్రా | పంచదార - 100గ్రా | 
సత్యనారాయణస్వామి వ్రత విధానం
శ్రీసత్యనారాయణస్వామి అష్టోత్తర శతనామపూజ
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం 
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం 
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ  చతుర్థ అధ్యాయం
 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం 





 



					
Note: HTML is not translated!