Sharathpurnima Nomu

శరత్పూర్ణిమ నోము 

శరత్ ఋతువు మొదలయిన (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి)నాడు నోము పట్టాలి. ఆరుబయట చంద్రకాంటిలో వెండితో చేసిన అమ్మవారి ప్రతిమను అర్చించి, ఆనాటి చంద్రకళవంటి వెండి ప్రతిమను, బియ్యాన్నీ, తెల్లని వస్త్రన్నీ, ఒక ముత్యాన్నీ, దక్షిణ తాంబూలాలతో ఒక ఆకర్షణీయమైన బ్రాహంన ముత్తైదువకు వాయనం ఇవ్వాలి. ఇలా పౌర్ణమినాటికి మొత్తం పదహారు ముత్యాలు ఇవ్వాలి. ఏ తిథిలో ఉండే చంద్రకళ ప్రతిమను ఆ తిథిరోజున వాయనం ఇవ్వాలి. బహుళ పక్షంలో ఏమీ చేయవలసిన పనిలేదు. తిరిగి కార్తీక శుద్ధపాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ చేయాలి.

ఉద్యాపనం:

ఈ విధంగా మూడు మూడవ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున నోము యథావిధిగా చేసిన తరువాత పదహారుమంది ముత్తైదువులకు పదహారు కళల చంద్ర ప్రతిమలను ఇచ్చి, వచ్చిన వారందరికీ అమ్మవారి ప్రసాదాన్నే భోజనంగా పెట్టి ఒక బ్రాహ్మణ బ్రహ్మచారిని యథాశక్తి సంతృప్తిగా సత్కరించాలి.

వ్రత కథ :

పూర్వం ఒక  దంపతుల దగ్గర ధనదాన్యరాశులు ఉన్నప్పటికీ తమ బిడ్డకు అంగసౌష్టవం మాత్రం అమరినట్లు లేకపోవడం వల్ల వారు నిత్యం బాధపడుతూ ఉండేవారు. అలా బాధపడుతున్న సమయంలో ఒకరోజు వారి ఇంటికి ఒక సిద్ధుడు వచ్చాడు. ఆ సిద్ధుడికి అతిథి మర్యాదలు చేసి పంచభక్ష్యాలతో భోజనం పెట్టి సంతుష్టుడిని చేశారు. తరువాత తమ బిడ్డ గురించి సిద్ధుడికి చెప్పగా, సిద్ధుడు 'దంపతులారా! పూర్వ శాస్త్రాలలో రహస్యంగా వున్నా ఒక నోమును చెబుతాను, మీ అమ్మాయి చేత దాన్ని ఆచరింపచేయండి ఫలితం ఉంటుంది అని చెప్పి శరత్పూర్ణిమ నోమునూ, ఉద్యాపననూ వివరించి చెప్పి వెళ్ళాడు. ఆ దంపతులు సిద్ధుడు చెప్పిన దానికి సంతోషపడి శరదృతువు రాగానే తమ కుమార్తె చేత ఆ నోమును పట్టించి, విధివిధానంగా జరిపించారు, ఆ నోము పుణ్యఫలం కొలదీ ఆ కన్య అమరినట్లు ఉండే అంగ సౌన్దర్యంగో సౌష్టవంగా రూపుదిద్దుకుని పట్టపు రాజుకు భార్యకా పదికాలాలపాటు సౌఖ్యంగా జీవించింది.  

Products related to this article

Tulasi Kota

Tulasi Kota

 Tulasi Kota ..

$8.60

0 Comments To "Sharathpurnima Nomu "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!