Sri Sai Navaguruvaara Vratham

శ్రీ సాయి నవగురువార వ్రతము

పూజకు కావలసిన సామాగ్రి :

శ్రీ సాయినాథుని పటం లేదా ప్రతిమ పసుపు కుంకుమ
తమలపాకులు పోకచెక్ విభూతి
అగరవత్తులు హారతి కర్పూరం కొబ్బరికాయ
పసుపుపచ్చని పువ్వులు  అరటిపళ్ళు - 24 అక్షితలు 
పసుపుపచ్చ పూల దండ పసుపురంగు వస్త్రం  నైవేద్యానికి ప్రసాదము
పంచామృతం (పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార)  శ్రీ షిరిడిసాయి ద్వారకామాయి చిత్రం (ఫోటో) తొమ్మిది నవగురు శ్రీ సాయివ్రత పుస్తకాలు 
పసుపురంగు కలశవస్త్రం

 

వ్రత నియమాలు :

* శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు (వృద్ధులు)అనే భేదం లేకుండా అందరూ చేయవచ్చు. కులమత భేదం లేకుండా ఆచరించాలి

* మహారాష్ట్ర ప్రాంతంలో బాగా ఆచరిస్తున్న వ్రతము చాలా ప్రభావంతమైనది. తొమ్మిది గురువారాలు విధిగా ఆచరిస్తే కోరిన కోరిక సఫలం అవుతుంది.

* ఏ గురువారమైనా నవగురువార వ్రతాన్ని ప్రారంభించవచ్చు.

* ఇంట్లో ఈశాన్యంలో ఒక ఆసనంపై పసుపురంగు వత్రాన్ని వేసి దానిపై ద్వారకామాయి ఫోటో పెట్టి శుభ్రమైన వస్త్రంతో ఫోటో తుడిచి, చందన కుంకుమతో అలంకరించి పసుపురంగు పువ్వులు సమర్పించాలి. రెండు వత్తులతో దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి, శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని ప్రారంభించాలి.

* శ్రీసాయిబాబాను భక్తిశ్రద్ధలతో స్మరించి పాలకోవాను నైవేద్యంగా సమర్పించాలి. పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. వ్రతం పూర్తి కాగానే భోజనం చేయాలి. రాత్రికి తినకూడదు.

* 9 గురువారములు వీలయినంతవరకు సాయంత్రం శ్రీసాయిబాబా మందిరాన్ని దర్శించాలి. ధునిలో పీచు ఉన్న కొబ్బరికాయ సమర్పించాలి.

* నవగురువార వ్రతాన్ని మధ్యలో ఏదైనా ఊరికి వెళ్ళవలసి వస్తే ఆ వారం తరువాత కొనసాగించాలి. అలాగే స్త్రీలకు ఇబ్బంది వస్తే ఆ గురువారం లెక్కలోకి తీసుకోకుండా మళ్ళీ వచ్చే వరం వ్రతాన్ని కొనసాగించవచ్చు.

* ఉద్యాపన రోజు కనీసం 9 మంది పేదలకు అన్నదానం చేయాలి. నవగురువార వ్రతం పుస్తకాలు, పళ్ళు, తాంబూలాలతో కానుకగా తోమ్మిదిమందికి పంచిపెట్టాలి.

* ఉద్యాపన రోజున సాయంత్రం ఖచ్చితంగా శ్రీసాయి మందిరాన్ని దర్శించాలి.

శ్రీ సాయి నవగురువార వ్రతం పుస్తక దాన మహిమ

క్రమ సంఖ్య  దానం చేయవలసిన పుస్తకాల సంఖ్య  ఫలితం
1 9 మనశ్శాంతి 
2 18 గ్రహపీడా నివారణ
3 27 కార్యానుకూలత, ఆరోగ్యం 
4 36 నష్టవస్తులాభం, వివాహం
5 45 దాంపత్య సౌఖ్యం, విద్యా
6 54 సంతానప్రాప్తి
7 63  కన్యావివాహం, ప్రేమ వివాహం 
72 ఉద్యోగాలబ్ది, ఇంక్రిమెంట్ 
 9 81 ఆకస్మిక ధనప్రాప్తి, అభివృద్ధి

 

 శ్రీసాయి నవగురువార వ్రతం ఎందుకు చేయాలి ?

సకల కార్యసిద్ధికి, విదేశీ ప్రయాణం కోసం, మనశ్శాంతి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, శత్రునివారణ కోసం, మీ మనస్సులో కోరికలు తీరడానికి, పరీక్షలలో ఉత్తీర్ణత కోసం, శీఘ్ర సంతానం కోసం, సంతానాభివృద్ధి కోసం, అధిక సంపాదన కోసం, సంతోషం కోసం.

శ్రీ సాయిబాబా పూజా ప్రారంభః

ధ్యానం : బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం - ద్వంద్వాతీతం గగన సదృశం తత్త్వమస్వాది లక్ష్యం ఏకం నిత్యం అమల మచలం సర్వ దీసాక్షిభూతం - సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ఓం శ్రీ సాయిసమర్థాయ నమః ధ్యానం సమర్పయామి

ఆవాహనం : ఓం సహస్రశీర్షాపురుషః సహస్రాక్షస్సహస్రపాత్ - సభూమిం విశ్వతోవృత్వా అత్యతిష్ఠద్ధశాంగులమ్ ఓకే శ్రీ సాయి సమర్తాయ నమః - ఆవాహయామి. (పుష్పాక్షతలు - ప్రతిమపైగాని, పటంపై కాని ఉంచాలి)

ఆసనం : పురుషఏవేదగ్ం సర్వం యద్భూతం యచ్చభవ్యం - ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి ఓం ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - ఆసనం సమర్పయామి

పాద్యం : ఎతావానస్యమహిమా అతోజ్యాయాగ్ శ్చ పూరుషః - పాదోస్య విశ్వాభూతాని, త్రిపాద స్యామృతం దివిః ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - పాదయోః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం : త్రిపాదూర్ధ్వం, ఉదైత్పురుషః పాదోస్యేహాభవాత్పునః - హస్తయోరర్ఘ్యం సమర్పయామి

ఆచమనం : ఓం తస్మాద్విరా డజాయత విరాజో ఆధిపూరుషః - సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి మథోపురః ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - ముఖే ఆచమనీయం సమర్పయామి.

స్నానం : ఓం యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞ మతన్వత - వసంతో అస్యాసే దాజ్యమ్ గ్రీష్మ ఇద్మశ్శరద్ధవిః ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - శుద్దోదకేన స్సపయామి.

పంచామృత స్నానం

ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - క్షీరేణ స్నపయామి

ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - దద్నా స్సపయామి

ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - ఆజ్యేన స్సపయామి

ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - మధ్వేన స్సపయామి

కొబ్బరికాయ లేదా పళ్ళరసం : ఓం శ్రీ సాయిసమర్థాయ నమః నారికేళోదకేన/ఫలరసేన స్సపయామి.

వస్త్రం : ఓం సప్తాస్యాసన్ పరిధయః త్రిస్సప్రసమిధః కృతాః - దేవాయద్యజ్ఞం తన్వానా అబధ్నన్ పురుషం పశుమ్ ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - శుద్దోదక స్నానం సమర్పయామి

యజ్ఞోపవీతమ్ : ఓం తం యజ్ఞం బర్హిపిప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః - తేనదేవాఅయజంత సాధ్యారుషయశ్చయే ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి

చందనం : ఓం తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం - పశూగ్ం శ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - దివ్య శ్రీచందనం సమర్పయామి

అక్షతలు : ఓం తస్మాద్యజ్ఞాట్ సర్వ హుతః ఋచస్సామానిజిజ్ఞిరే - చాందాగ్ం జిజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయతః ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - సువర్ణక్షతాన్ సమర్పయామి

పుష్పసమర్పణం : ఓం తస్మాదశ్వా అజాయంత యేకేచోభయాదతః - గావోహజిజ్ఞిరే తస్మాత్ తస్మాజ్ఞాతా అజావయః ఓం శ్రీ సాయిసామర్థాయ నమః - పుష్పాణి సమర్పయామి

మంగళ ద్రవ్యాదికం : ఓం సాయిసమర్థాయ నమః - సమస్త విధ మంగళద్రవ్య ఆభరణాదీన్ సమర్పయామి

అథాంగ పూజ

ఓం శ్రీ షిరిడీనివాసాయ నమః - పాదౌ పూజయామి ఓం భక్తహృదయావాసితాయ నమః - గుల్ఫౌ పూజయామి
ఓం సర్వాపన్నివారకాయ నమః - జంఘే పూజయామి  ఓం సర్వ శుభప్రదాతాయ నమః - జానునీ పూజయామి
 ఓం సర్వ భూత హితరతాయ నమః - ఊరూ పూజయామి  ఓం ప్రేమమూర్తయే నమః - కటిం పూజయామి
 ఓం సర్వమతసారభూతాయ నమః - ఉదరం పూజయామి ఓం ఆపద్భాందవాయ నమః - వక్షస్థలం పూజయామి
ఓం మహాద్భుత ప్రదర్శకాయ నమః - బాహున్ పూజయామి  ఓం దీపప్రియాయ నమః - కంఠం పూజయామి 
ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః - వక్త్రం పూజయామి ఓం అనాధనాథ దీనబంధవే నమః - దంతాన్పూజయామి
ఓం సర్వాభీష్టప్రదాయ నమః - నాసికాం పూజయామి  ఓం సర్వమంగళరాయ నమః - నేత్రౌ పూజయామి
ఓం త్రికాలజ్ఞాయ నమః - శిరః పూజయామి 

ఓం సత్యతత్త్వభోధకాయ నమః - శ్రీ సాయిసమర్థాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

(ఇప్పుడు అష్టోత్తర శతనామాలతో కానీ పసుపురంగు పూవులతో కాని, అక్షతలతో కాని పూజించాలి)

శ్రీసాయి గాయిత్రి

జ్ఞానరూపాయ విద్మహే అవధూతాయ

ధీమహి తన్నోస్సాయీ ప్రచోదయాత్న

నవగురువార వ్రతము

శ్రీసాయి గురిచి తెలియని వారెవరూ ఉండరు. కలియుగంలో సద్గురు అవతారం. నేటికీ సమస్త జనులకూ హితం కలిగిస్తూ ఉంటారు. పదహారేళ్ళ వయస్సులో షిర్డీలోని వేపచెట్టు కింద కూర్చుని గ్రామస్తులకు కనిపించారు. మళ్ళీ చాంద్ భాయీ పాటిల్ తో పెళ్ళి ఊరేగింపులో వచ్చి షిర్డీలో కనిపించారు. అప్పటినుంచి చివరి శ్వాస దాకా షిర్డీలోనే ఉన్నారు. దాదాపు అరవై ఏళ్ళు సాయిబాబా అక్కడ నివసించారు.

తన జన్మము గురించి చివరిదాకా ఎవరికీ ఏమీ చెప్పలేదు. షిర్డీలో భక్తులు స్థానికుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి తగిన సలహాలిస్తూండే వారు. అప్పుడప్పుడు కొన్ని వింతలు, విచిత్రాలు చేసేవారు. అవి చూసిన జనం బాబా మహిమను గుర్తించక తప్పలేదు. శ్రీసాయిబాబా సాధారణ వ్యక్తికాదని, మానవాతీత దివ్యశక్తి అని గ్రహించారు.

నేటికీ బాబాను దర్శించాటానికి లక్షలాదిగా భక్తులు షిర్డీకి వెళ్తుంటారు. వారి కోరికలూ తీరుతుంటాయి. ప్రత్యక్షంగా బాబా సన్నిధికి వెళ్ళి తమ కోరికలు తెలుపుకోవడానికి ఆశక్తులైనవారు - శ్రీసాయిని శ్రద్ధాభక్తులతో స్మరించి నవగురువార వ్రతం ఆచరించి, తమ దుఃఖాలు పోగొట్టమని కోరికలు తీర్చమని ప్రార్థించి సఫలీకృతులవుతారు. బాబా తన భక్తులబాధలను దూరం చేసి, మనశ్శాంతి ప్రసాదిస్తారు. మీ కష్టాల విముక్తికీ షిర్డీసాయిబాబా నవగురువార వ్రతం ఆచరించి సుఖశాంతులు పొందవచ్చును.

శ్రీసాయి నవగురువార వ్రత కథ

పూణా పట్టణంలో రుక్మిణి, విఠల్ అనే దంపతులు నివశించేవారు. విఠల్ కోపిష్టి, అందువలన అతనితో పరిచయమున్నవారు ఇబ్బంది పడేవారు, రుక్మిణి చాలా నెమ్మదస్తురాలు. శ్రీసాయిబాబాను నమ్ముకొని ఉన్నది. కొంత కాలానికి విఠల్ వస్త్రవ్యాపారంలో నష్టం వచ్చి, వ్యాపారం మూతపడే స్థితి వచ్చింది. దీనితో విఠల్ కు కోపం ఇంకా పెరిగి, ప్రతిదానికి రుక్మిణిని విసుక్కోవడం చేసేవాడు. ఇళ్ళు నరకంలా మారింది. ఒక గురువారం మధ్యాహ్నం హారతి సమయంలో రుక్మిణి ఇంటికి ఒక ఫకీరు వచ్చి, భిక్ష కోసం యాచించాడు.

రుక్మిణి అతనికి భిక్ష అందజేస్తూ ఫకీరు ముఖంలో ప్రసన్నతను చూసింది. ఆ ఫకీరు శ్రీసాయి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడు ఉంటాయి. చింతించవలదు అని ఆశీర్వదించాడు. ఈ మాటాలు వినగానే రుక్మిణి కన్నీరు పెట్టుకుంది. ఆమె బాధను గ్రహించిన ఫకీరు అమ్మా నీవు తొమ్మిది గురువారాలు శ్రీసాయిని పూజించు. పూజా మహత్యం వల్ల నీ ఇంటి పరిస్థితులన్నీ చక్కబడతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి గురువారం నుండి రుక్మిణి తొమ్మిది గురువారాల సాయివ్రతం ప్రారంభించింది. అత్యంత భక్తిశ్రద్ధలతో తొమ్మిది గురువారాలు పూజ చేసి, చివరివారం ఉద్యాపన చేసి, తోమ్మిదిమందికి భోజనం పెట్టి, తొమ్మిది సాయివ్రత పుస్తకాలను బంధువులకు, స్నేహితులకు పంచి పెట్టింది. క్రమంగా విఠల్ స్నేహితుడి ధనసహాయం వల్ల అతనికి వ్యాపారం అభివృద్ధి చెందింది. వారి ఇంట సుఖసంతోషాలు తిరిగి వచ్చాయి.

వ్రతం ఆచరిస్తున్న సమయంలో రుక్మిణి ఇంటికి బొంబాయి నుండి తోడికోడలు, బావగారు వచ్చారు. తోటికోడలు రుక్మిణితో మాట్లాడుతూ తన పిల్లలు ఈ మధ్య చదువులో వెనుకబడ్డారని బాధపడింది. రుక్మిణి శ్రీసాయి నవగురువార వ్రతం ఆచరించమని చెప్పి వ్రతవిధానం మరియు ఉద్యాపన చెప్పింది.

కొన్నాళ్ళ తరువాత రుక్మిణితో తన తోడికోడలి నుండి శ్రీసాయి నవగురువారవ్రతం ఆచరించడం వలన పిల్లలు బాగా శ్రద్ధగా చదువుతున్నారని, ఈ విధానము తన స్నేహితురాలు కూడా ఆచరించడం వలన ఇష్టమైన వ్యక్తితో వివాహం జరిగిందని, తన ఎదురింట్లో ఒక నగ కనిపించకుండా పోయినందుకు ఈ వ్రతం ఆచరించగానే నగ మళ్ళీ తిరిగి దొరకినది అని, వ్రతమహత్యం చాలా గొప్పదనీ సమాచారం అందజేసింది.

నవగురువార శ్రీసాయి వ్రతఫల మహత్యాలు

* బొంబాయిలో ఒక చిన్న నటుడికి కుటుంబం గడపడం చాలా కష్టంగా ఉండేది. అతని భార్య నవ గురువార వ్రతం పూర్తి చేయగానే అతనికి టీ.వీ. సేరియల్స్ లో, చలనచిత్రాలలో అవకాశాలు రావడం ప్రారంభించాయి.

* ఎమ్.సి.ఎ. చదివిన ఒక యువకుడు పూణా నగరానికి ఉద్యోగం కోసం వచ్చి, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతనికి ఉద్యోగం మాత్రం లభించలేదు. బాధతో ఈ విషయాన్ని తల్లి తెలుపగా, ఆమె బాబాకు మ్రోక్కుకుని నవగురువార వ్రతం ప్రారంభించింది, వ్రత ఉద్యాపన రోజున ఆమె కుమారుడికి ఉద్యోగం వచినట్లుగా తెలియవచ్చింది.

లాయరు వృత్తి చేయుచున్న ఒక యువతికి, ఎన్ని సంబంధాలు చూసినా వివాహం జరగడం లేదు. ఆమె ఒక రోజు బాబా గుడికి వెళ్ళినప్పుడు నవగురువర వ్రతం గురించి వింది. తరువాత ఆమె స్వయంగా ఆ వ్రతం ఆచరించింది. తరువాత ఆమెకు సౌమ్యుడు మంచివాడు అయిన యువకుడితో వివాహ జరిగింది.

అహ్మద్ నగర్ నివాసి అయిన నీలాదేవి అనే ప్రభుత్వ ఉదోగినికి ఒకసారి బదలీపై ఒక మారుమూల గ్రామానికి వేశారు. ఆమె తన తల్లిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచవలసి ఉండడం వల్ల ఆమె తన బదలీని ఆపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేదు సరికదా 15 రోజులలో వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరాలి అని ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు వచ్చింది. ఆమె నవగురువర వ్రతం ఆచరించడం ప్రారంభించింది. రెండవ వారం చేయగానే ఆమెకు అహ్మద్ నగర్ లోని వేరొక కార్యాలయానికి మార్చబడినట్లుగా ఉత్తర్వులు వచ్చాయి. ఆమె ఎంతో కృతజ్ఞతతో నవగురువార వ్రతం పూర్తికాగానే షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంది.

వైద్యవిద్య అభ్యసిస్తున్న కుమారి రూప అనే ఆమె మొదటి రెండు సంవత్సరాలు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలు అయింది. మూడవ సంవత్సరం వచ్చేసరికి శారీరక అనారోగ్య కారణాల వలన జ్ఞాపకశక్తి తగ్గి చదువులో వెనుకబడసాగింది. ఆమె దిగులుతో తన తల్లిదండ్రులతో తెలపగా వారు ఆమెను తొమ్మిది గురువారాలు బాబా పూజ చేయమని, తరువాత బాగా చదవగలవని ధైర్యం ఇచ్చారు. తరువాత ఆమె తన తల్లిదండ్రులు తెలిపిన విధంగా చేయగా, ఆమె బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలు అయింది.

నివాస్, చందన్ లకు వివాహం అయి పది సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు. చందన్ అత్తవారింట సూటీపోటీ మాటలతో చాలా బాధపడేది. ఒకరోజు నివాస్ తన సహోద్యోగి కార్యాలయంలో స్వీట్లు పంచి పెడుతుండగా కారణం అడిగింది. అతను తనకు చాలా సంవత్సరాల తరువాత నవగురువార వ్రతం ఆచరించగా సంతానం కలిగింది అని తెలిపాడు. నివాస్ ఆ వివరాలు అన్నీ తెలుసుకొని చందన్ కు తెలుపగా, ఆమె కూడా ఆ వ్రతాన్ని చేసింది. కొన్ని రోజులకు ఆమె గర్భం దాల్చి, ఆడపిల్లను ప్రసవించింది.

లాల్ అనే వ్యక్తి వ్యాపార నిమిత్తమై వెళుతుండగా వెనుకనుండి ట్రాక్టరు వచ్చి తగిలి మొకాలిలో దెబ్బ తగిలింది. వైద్యుడికి చూపించగా ఆపరేషను చేయాలని చెప్పాడు. కాని భయంతో ఆపరేషను చేయించుకోలేదు. విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని భావించి, నెలరోజులు విశ్రాంతి తీసుకున్నా కానీ కాలినొప్పి తగ్గలేదు. కాని తన బంధుమిత్రులతో నాలుగు నెలలలో షిరిడీ, కేదారానాథ్ యాత్ర నిర్ణయించబడింది. తనకు యాత్రకు వెళ్ళే అదృష్టం లేదేమో అని బాధపడుతూ, ఓపిక చేసుకుని బాబా గుడికి వెళ్ళి బాబాను దుఃఖంతో ప్రార్థిస్తుండగా , పూజారి వచ్చి నవగురువార వ్రత పుస్తకాన్ని ఇచ్చి ఆ వ్రతం చేసినట్లయితే దుఃఖాలు అన్నీ తొలిగిపోతాయి అని తెలిపాడు. లాల్ వెంటనే నవగురువార వ్రతం ఆచరించాడు. వ్రతం పూర్తి అయ్యే రోజుకి కాలినొప్పి తగ్గి, తన వారితో యాత్ర సుఖవంతంగా సాగించాడు.

కౌశిక్ అనే వ్యక్తి గుండె నొప్పితో బాధపడుతూ డాక్టరుకు చూపించగా ఆపరేషన్ చేయవలసి ఉంది అని తెలిపాడు. అతను వెంటనే షిరిడీ వెళ్ళి తన బాధను తొలగించమని బాబాను వేడుకుంటుండగా, ఒక ఫకీరు వచ్చి నవగురువార వ్రత పుస్తకాన్ని ఇచ్చి ఆచరించమని, అంతా మంచే జరుగుతుందని తెలిపాడు. కౌశిక్ వెంటనే షిరిడీ నుండి వచ్చి, నవగురువార వ్రతం పూర్తయ్యాక మాత్రమే ఆపరేషన్ చేయించుకుంటాను అని తెలిపి వ్రతం ఆరంభించాడు. వ్రతం పూర్తయ్యాక డాక్టరు దగ్గరికి వెళ్ళగా ఆపరేషన్ అవసరం లేదనీ మందులతో తగ్గిపోతుందని తెలిపాడు.

* నాసిక్ జిల్లా లక్ష్మీబాయి అనే ఆమెకు కుమారుడు కలిగాడు. వారి ఇంటి పురోహితుడు బాబును చూసి బాలారిష్ట దోషం ఉందని తెలిపాడు. ఆమె వారు చెప్పిన పూజలు అన్నీ చేసింది. మరియు బాబా నవగురువార వ్రతం ఆరంభించింది. వ్రతం చివరి రోజున బాబు ఊయల నుండి క్రిందపడగా, పరుగెత్తికుంటూ వెళ్ళి బాబును తీసుకుని సవరించగా బాబులో కదలిక వచ్చి ఏడ్చాడు. ఆనందంతో బాబా దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తూ బాబా విగ్రహం చూడగా, బాబా విగ్రహం కాలు విరిగి కనిపించింది. ఆమె ఆర్థ్రమైన హృదయంతో పదేపదే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ విధంగా బాబా, ఆ బాలుడి దోషాన్ని తాను స్వీకరించాడు.

శ్రీసాయి గాయత్రి

భక్తరక్షాయ విద్మహే దయాశీలాయ !

ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్ !!

నవగురువర వ్రతము చేయువారు నిత్యం పఠించాల్సిన శ్లోకం

శ్లో రక్తం శ్వేతం హరిద్వర్ణం పాండు చిత్రారుణాన్ క్రమాత్ - పిశంగ పింగాళౌ వధృ కర్బురాఋణ ధూమ్రకాన్ నక్షత్ర గ్రహ సంబద్ధాన్ నానాభావ సమంవితాన్ - మేషాదికాన్ సమేన్నిత్యం కళచక్రానుసారిణః

శ్రీసాయిబాబా దండకము

శ్రీ సాయిబాబా! దయాసాంద్ర! త్రిమూర్త్యాత్మకా! శ్రీదత్తశివ రామ, కృష్ణ మారుత్యాది దివ్యావతార స్వరూప! ఈ ధరిత్రిన్ భక్తులను రక్షింప లీలతో దేహమున్ దాల్చి, నీ పూజలన్, నీసేవలన్, నీ నామ సంకీర్తనల్ జేయు, భక్తాళి కిన్ భక్తియున్, భుక్తియున్ ముక్తియున్ గూర్చి యాపత్తులను బాపి, యోగంబు క్షేమంబు చేగూర్చి రక్షించు దివ్య స్వభావా, నమస్కారమర్పింతు, లోకంబులో జాతి భేదాలు గల్పించుకొన్నాట్టివేగాని సత్యంబు గాలేవు లేవంచు భక్తాళి కిన్ విశ్వప్రేమంబుచాటు చందంబునన్ ప్రతి గ్రామంబులో విప్రగే హంబులో జన్మమున్ గాంచి బాలుండ వైయుండ నీ తల్లిదండ్రుల్ ఫకీరోకరికిన్ విన్నిచ్చివేయంగ, ఐదేండ్లు అసాధు పోష్యంబులోనుండి, యా పిమ్మటన్, వెంకుసాపేరుతో నొప్పు నాదేశి ముఖ్యుండు, గోపాలరాయండు, నిను చెంతకున్ జేర్చి సద్భోధనల్ జేసి, జ్ఞానోపదేశంబుగావించి, నిన్నంపి వేయంగ, నీ సంగతుల్ దేశమందెవ్వరున్ గాంచ కుండగ సంచారమున్ జేసి,యష్టాదశాబ్దంబులున్ బ్రాయమొప్పారగా, పూర్వపుణ్యంబు పక్వంబునొప్పు గోదావరీ తీరప్రాంతంబులోనున్న షిర్డీయనే గ్రామమున్ జొచ్చి యచ్చోట నున్నట్టి యావేపవృక్షంబు క్రిందన్ మహాప్రీతితోనిల్చి, నీవచ్చటణ్ క్రింద కూర్చున్నయా కొమ్మకున్ చాలా మాదుర్వ యుక్తంబులౌ యాకులం గూర్చి యాచెంతనున్ పాడు బడ్డట్టి చోటన్ మసీదొక్కటిన్ గాంచి, యచ్చోతనే సుస్థిరం బైన వాసంబు జేయంగ కాంక్షించి, యుద్ధానికిన్ ద్వారకామాయి నామంబు గల్పించి నీ చెంతకున్ కర్మ శేషంబుతో జేరునా మానవాళీ మహాదుఃఖముల్ బాపి రక్షించు లీలా విశేషంబు లెన్నంగ నాశక్యమే! యాకాశ భాగంబునన్ పక్షి బృందంబు పైపైకి రాబోవునేగాని యంతంబునుంగాంచగా నోపునే! యట్లు నీ దివ్యమౌ వైభవంబెల్లనే నెన్నంగ నేరీతి వీలౌను! ప్రాపంచి కార్థంబులన్ గోరునవ్యారికిన్ గొప్ప ఉద్యోగముల్ ద్రవ్యలాభంబులన్ సత్సంతానమున్ జేకూర్చచున్ కొందరిన్ సర్వలోకాది నాథుండు సర్వేశ్వరుండైన యాదేవుపై భక్తి భావంబు సూచింపుచున్, కొందరిన్ ముక్తి మార్గంబు కాక్షించు మర్త్యావళిన్ జేరి దృశ్యంబు నశ్యంబు జీవేశ్వరుల్ వేరు గారంచు నాత్మానుసంధానుభావంబు భోధించుచున్, కొందరిన్ బ్రోచి పరాప్రదేశంబులన్ దెచ్చుకొన్నట్టి భిక్షాన్న మున్ దినుచు రోజుంత యున్ పుష్కలంబైనట్టి ద్రవ్యంబు తోడన్ మహా వైభవోపేతుడై యుండి, సాయంత్ర మౌవేళకున్, సర్వమున్ సాధులోకాళికిన్ ఖర్చు గావించి పూర్వంబు రీతిన్ ఫకీరై, మదిన్ భేదభావంబు లేకుండగా నందరిన్ జేర్చి, నేపైన భారంబు సర్వంబునున్ వైచి సద్గురుండంచునున్ నిన్నే సదా నమ్మి సేవించు జేవాళి కార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీర్చుచున్ కొంగు బంగారమై వారిరక్షించు సద్భక్త చింతామణీ! నేడు నీ దివుయపాదాబ్జముల్ గాక, గత్యం తరంబెమి లేదంచు, నీవే శరణ్యంబంచు నీ చెంతకున్, జేరు మమ్మెల్లరన్ గాపాడు, దీనబంధూ, మహాదేవ! దయాసింధు! శ్రీసాయినాథ! నమస్తే నమస్తే నమః

Click Here To View శ్రీసాయిబాబా పంచాక్షరి, శ్రీసాయి ఊదీధారణ , శ్రీ సాయిబాబా సుప్రభాతం సాయి మంత్రాలు

శ్రీసాయిబాబా అష్టకం

స్వామి సాయినాథాయ - షిరిడీక్షేత్ర వాసాయ

మమాకాభీష్టదయ - మహిత మంగళం !!స్వామి!! లోకనాథాయ భక్తి - లోక సంరక్షకాయ నాగలోకస్తుత్యాయ - నవ్యమంగళం !!స్వామి!! భక్తబృంద వందితాయ - బ్రహ్మ స్వరూపాయ ముక్తిమార్గ బోధకాయ – పూజ్య మంగళం సత్యతత్త్వ బోధకాయ - సాధువేష నిత్యమంగళ దాయకాయ - నిత్య మంగళం !!స్వామి!!

Click Here To View ద్వాదశ రాశులకూ సాయి మంత్రాలు

0 Comments To "Sri Sai Navaguruvaara Vratham"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!