గణపతి అలంకారాలు..నామాలు..

గణపతి అలంకారాలు..నామాలు..

గణపతి అలంకారాలు..నామాలు..


సంకట హర చతుర్థి సందర్భంగా ..


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.


భావం:

శ్వేత వస్త్రధారి,

సర్వవ్యాపి చంద్రకాంతితో శోభించువాడు,

నాలుగు భుజములు గలవాడు,

ప్రశాంత పదనంతో రంజిల్లువాడు

అగు గణపతి దేవుని సర్వ విఘ్నములు తొలుగుటకై ధ్యానించుచున్నాను.


వినాయకుని అలంకారాలు.......

స్వర్ణాభరణాలంకృత గణపతి

విశ్వరూప గణపతి

సింధూరాలంకృత గణపతి

హరిద్రా (పసుపు) గణపతి

రక్తవర్ణ గణపతి

పుష్పాలంకృత గణపతి

చందనాలంకృత గణపతి

రజతాలంకృత గణపతి

భస్మాలంకృత గణపతి

మూల గణపతి.

ఇవి గణపతి నవరాత్రులలో..చేసే అలంకారాలు.!


వినాయకుని నామాలు......

1.తెలుగు భారతం ప్రకారం :

హేరంబ, గణనాయక, గణేశ


2. పద్మపురాణం ప్రకారం :

ద్వైమాతుర, లంబోదర, గణాధిపతి,

వక్రతుండ, కపిల, చింతామణి, డుంఠి


  1. వేదాల ప్రకారం :

  2. బ్రహ్మణస్పతి, కవి, జ్యేష్ఠరాజు, కవీనాం కవి.


4. సంగీత శాస్త్రం ప్రకారం :

పిళ్ళారి, శ్రీ గణనాథ, కరివదన, లకుమికర (లక్ష్మీకరుజడు), అంబాసుత, సిద్ధి వినాయక.


5. పూజప్రకారం :

సుముఖ, ఏకదంత, గణకర్ణిక, వికట, విఘ్నరాజ, గణాధిప, ధూమకేతు, గణాధ్యక్ష, పాలచంద్ర, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ, స్కందపూర్వజ (లంబోదర, వక్రతుండ, కపిల, హేరంబ అనేవి కూడా ఉన్నా ఇవి పద్మ పురాణం, తెలుగు భారతం అనే వాటిలో ఉన్నాయి).