విష్ణునారాయణ ఆలయం చెంగు.

 విష్ణునారాయణ ఆలయం చెంగు.

నేపాల్ దేశమందు భక్తపూర్ తాలూకాలో మనోహరనదీ తీరాన డోలగిరిపై చంపక వృక్షాల వనంలో నిర్మించిన 400 సంవత్సరాలనాటి అతి ప్రాచీన ఆలయమిది . రాగిరేకుల వాలు పైకప్పు, రెండంచెలుగా శిఖరము, నాలుగు వాకిళ్ళకు అందమైన శిలాతోరణాలతో , శ్రీ మహావిష్ణువు రూపం స్తంభాలపై శంఖు, చక్ర, గదా, పద్మములు ధరించిన రూపములు గర్భాలయమున విశ్వరూప విష్ణువుగా  లక్ష్మీదేవితో చక్కని విగ్రహములు కలవు.


ఆలయనిర్మాణమునకు భిన్నకథనాలుకలవు .కాశ్మీరరాజు తన కుమార్తె చంపకను భక్తపూర్  యువరాజు తో వివాహానంతరం ఆమె పేరున ఈ ఆలయము నిర్మించ బడిన దందురు.

చంగుడను మల్లుడు ప్రాంజలుడను వానిని మల్లయుద్ధములో ఓడించుటచే వాని పేరు మీద ఈ ఆలయం నిర్మించారందురు .

మరొక కథనం ప్రకారం ఒకబాలుడు రోజూ మధ్యాహ్నం గోవుపాలు తాగి చంపక వృక్షంకింద విశ్రమించిన చూచిన ఒక బ్రాహ్మణుడు గొల్లవాడు కలసి ఆచెట్టును నరికివేయ నెత్తురు స్రవించి శ్రీ మహావిష్ణువు  ప్రత్యక్షమై తన తల తొలగించి  పాపవిమోచనము చేసిరి అనిరి . వారు తమ పాపపరిహారానికి  ఈ ఆలయాన్ని నిర్మించారనంటారు . ఆషాఢమాస శయనఏకాదశి మొదలు కార్తీకమందలి హరిబోధినీ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్షలు 

ఇతర అన్ని పూజలు యథావిధిగా జరుగును

విష్ణువాహనమైన గరుడుడు 

మానవరూపంలో రెక్కలతో ఉండును.