Article Search

తిరుప్పావై పాశురము - 20

 

ముప్పైమూడుకోట్ల దేవతలకు భయాలు కలగడానికి ముందే వారి దగ్గరకు వెళ్ళి వారి ఆపదలను తొలగించే ఓ గోపాలకృష్ణా! ఇక నిద్దుర మేలుకొనవయ్యా! (కృష్ణయ్య పలుకనందువల్ల) స్వర్గ కలశాలవంటి వక్షోజాలు, పగడాలవంటి ఎఱ్ఱని పెదవులు, సొంపైన సన్నని నడుమూ గలిగి శ్రీమహాలక్ష్మి వంటి సౌందర్యంగల ఓ నీలాదేవీ!

తిరుప్పావై పాశురము - 19

 

నాలుగుమూలల్లో దీపపు సెమ్మెలు వెలుగుతుండగా, దంతపుకోళ్ళ మంచమ్మీద సుతిమెత్తని దూదిపరుపుపై, జడలో గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులను పెట్టుకొన్న, నీలాదేవి కౌగిలిలో నిద్రిస్తున్న శ్రీకృష్ణదేవా! నోరు తెరచి ఒక్కమాటైనా మాటాడరాదా!

తిరుప్పావై పాశురము - 18

 

మదగజాలను అణచునట్టి మహాబలశాలి, శత్రువులను చూసి వెనుకంజవేయని భుజబలశాలి అయిన నందగోపరాయని ముద్దులకోడలా! ఓ నీలాసుందరీదేవీ! నిద్ర మేలుకోవమ్మా! కమ్మనైన పువ్వులతో సుగంధాలు వెదజల్లే కురులుగల రమణీమణీ! నిద్దురలేచి తలుపు తెరువు! అంతటా కోళ్ళు కూస్తున్నవి. గురువిందతీగెల పందిళ్ళపైన కోయిలగుంపులు కూతలు పెడుతున్నాయి.

తిరుప్పావై పాశురము - 17  

 

సంతృప్తిగా నీళ్ళు, అన్నవస్త్రాలనిచ్చి, ఆదరంగా మమ్ము ఆదుకొంటున్న నాయకశిరోమణీ! ఓ నందగోపస్వామీ! నిద్దురమేలుకొనవయ్యా! మానినీ మణులందరిలోను మిన్నయై వన్నె తెస్తూ కులదీపమై ప్రకాశిస్తూవున్న ఓ యశోదమ్మా! నిద్దుర మేలుకోవమ్మా!!

తిరుప్పావై పాశురము - 16

 

మా నాయకుడైన నందగోపుని భవనానికి కావలివున్న ద్వారపాలకస్వామీ! మకరతోరణాదులు చెక్కబడి పతాకాలతో అందంగా కనపడుతున్న రతనాల వాకిలి గడియతీసి తలుపులు తెరచిపెట్టు. మేము యదువంశంలో పుట్టిన అమాయకమైన భామలం! విచిత్రమైన మాయగాడు, నీలమణుల వంటి శరీరచ్చాయగలిగిన ఆ నల్లని కన్నయ్య, మాకు ఓకే వాద్యాన్ని (వరాన్ని) 

తిరుప్పావై పాశురము - 15  

 

 చెలికత్తెలు ఓసీ! చిలుకపలుకుదానా! ఇంటను నిద్రిస్తూ వున్నావా! కీరవాణి - ష్, ఒళ్ళు ఆదరేట్లు ఏమిటా అరుపు! ఇదే లేచి వస్తున్నా. చెలికత్తెలు చతురవాక్కులు కలదానా! నీ నోరు మాకు తెలియదా! కీరవాణి - సరే కానీ, నేను రాలేదని అంటున్నారు కాని, అందరూ వచ్చినారా! చెలికత్తెలు అందరూ వచ్చినారు.

తిరుప్పావై పాశురము - 14 

 

కన్యకామణి! మమ్ము మేల్కొలుపుతానని బీరాలు పలికి నీవే ఆదమరచి నిద్రిస్తున్నావా! ఏమిటి? ఇంకా తెల్లవారలేదని బుకాయింపు మాటలు సిగ్గులేకుండా పలుకుతున్నావా? అటు చూడు మీ ఇంటి పెరడు కొలనులోని ఎర్రతామరాలు వికసించాయి! నల్లకలువలు ముడుచుకొన్నాయి! అటు వీథిలో కాషాయాంబరధారులైన సన్యాసులు దేవాలయం తలుపులు తెరచుటకై తాళాల గుత్తులను తీసుకొనిపోతున్నారు.

తిరుప్పావై పాశురము - 13

 

ఓ గోపికా! బకరాక్షసుణ్ణి చెండాడిన శ్రీ కృష్ణభగవానుని, రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుని కళ్యాణగుణలీలలను ప్రకటించే పాటలను పాడుకుంటూ మనకంటే చిన్న వయసుగల కన్యకలు అందరూ నోము నోచే చోటికి వెళ్ళి చేరారు. తెలతెలవారుతూవుంది. శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించాడు.

తిరుప్పావై పాశురము - 12

 

ఓ గోపికామణీ! తాళ్ళతో కట్టివేసిన దూడల అరుపువిని, వాటిమీద వాత్సల్యంచేత పొదుగులు చేపి, వాటినుండి పాలు కారిపోవడం వల్ల ఇంటి ముంగిట బురద బురదగా అయిన పశుసంపద వృద్ధిపొందిన గోపకునికి చెల్లెలైనదానా! తలలపై కురిసే మంచువల్ల తడుస్తూ నీ ఇంటిముంగిట కాచుకొనివున్నాం.

తిరుప్పావై పాశురము - 11 

 

ఓ గోపికామణీ! ఒకవైపు దూడలతో గూడియుండు ఆవుల బరువైన పోదుగులనుండి పాలుపితుకుతూ, మరోవైపు శత్రువుల బలాన్ని నశింపచేసే ధైర్యసాహసాలతో విలసిల్లుతూ, దోషరహితులైన యదువీరుల ఇంటిలో పుట్టిన బంగారుతీగవు నీవు ! పుట్టనుండి వెడలు పాముపడగవంటి జఘనభాగము కలిగిన అందాలభరణివే నీవు!

తిరుప్పావై పాశురము - 10

 

ఓ చెలీ! మంచి నోము నోచి స్వర్గసుఖాలు అనుభవించుచున్నదానా! తలుపు బిగించి పడుకొంటివేమే? తలుపు తీయవే? పోనీలే తలుపు తియ్యకున్నా ఫరవాలేదు. ఒక్క మాటైనా నోటితో పలుకరాదా! నీతోడి ఒక్కమాటకైనా మేము నోచుకోలేదా! కుంభకర్ణుడు నీతో ఓడిపోయి తన నిద్రను నీకిచ్చి వెళ్ళాడేమోకదా!

తిరుప్పావై పాశురము - 9

 

ఓ మామ కూతురా! నిదురలేవమ్మా! మాణిక్య భవనంలో మాణిక్య దీపాల వింతవింత కాంతుల్లో కమ్మని ధూపసువాసనలమధ్య సుతిమెత్తని పడకపై నిద్రిస్తున్నదానా! నిద్ర లేవరాదటే! మణిగాకిలి గడియ తియ్యరాదాటే! అత్తా! నీ బిడ్డను నీవైనా నిద్రలేపు. మా మాటలు వినబడినట్లులేదు. చెవిటిదా? ఏమి మాట్లాడటం లేదు మూగదా?

తిరుప్పావై పాశురము - 8

 

ఓ యువతీ! మేల్కొనవే! తూర్పున ఆకాశం తెల్లబడింది. పచ్చికబయళ్ళలో మంచుచే కప్పబడిన పచ్చికను మేస్తూ పశువులు స్వేచ్చగా తిరుగాడుతున్నాయి. స్వామివారిని దర్శించే కోరికతో నిన్ను లేపకుండానే వెళ్ళేవారిని దారిలోనే ఆపివుంచి నిన్ను పిలుచుటకై మేము వచ్చి నిలిచివున్నాము. శ్రీ కృష్ణుని సేవయందు ఆసక్తికల ఓ సుందరాంగీ మేలుకో! మేలుకొని మాతో కలిసి పూజకు రావలసినది. దాణూర ముష్టికులనే పేరుగల మల్లవీరులను మట్టుపెట్టి విలసిల్లు విష్ణుమూర్తిని

తిరుప్పావై పాశురము - 7

 

ఓ యువతీ! మాకు నాయకివై, నోము నోచు విషయం అంతా తెలిసీ ఇంకా నిద్రిస్తున్నావా? ఎంత విడ్డూరం! ఇంకా తెల్లవారనే లేదంటావా! భలేదానివే! అదిగో భరద్వాజ జంటపక్షులు రాత్రి అంతా కలిసివుండి ఆహారం కొరకు విడిపోతూ కీచుకీచుమని రోదచేయడం నీకు వినపడలేదా! పోనీలే, ఓ చిన్నదానా! గోపికలు వేకువనే లేచి పెరుగు చిలుకుట

Showing 15 to 28 of 34 (3 Pages)