Sri Krishnashtami

శ్రీకృష్ణాష్టమి

 

శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో దేవకీ వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా, కలియుగ సంధికాలంలో శ్రీముఖ నామ సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ అష్టమి రోజు అర్థరాత్రి రోహిణి నక్షత్రంలో కంసుడి చెరసాలలో జన్మించాడు. ఇదే రోజున రోహిణి నక్షత్రం కొంతసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. శ్రీకృష్ణుడు చిన్నితనంలో గోకులంలో పెరిగాడు అందుకే గోకులాష్టమి అయ్యింది.
 

కొన్ని ప్రదేశాలలో కృష్ణజయంతి అని, శ్రీ జయంతి, ఉట్ల పండుగ అని కూడా పిలుస్తారు. కృష్ణాష్టమిని నిర్ణయించే సమయంలో కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తారు, మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యతను ఇస్తారు. తిథి మాత్రమే ఉన్నట్లయితే కృష్ణాష్టమి అని నక్షత్రం కూడా కలిస్తే శ్రీకృష్ణజయంతి అని వ్యవహరించాలని మన ధర్మశాస్త్రగ్రంథాలు వెల్లడిస్తున్నాయి.
 

కృష్ణాష్టమి రోజున సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని, తలస్నానం చేసి, పసుపురంగు బట్టలు వేసుకోవాలి. ఇంటిని శుభ్రపరచుకుని అవుపేడతో అలికి అందమైన రంగవల్లులు తీర్చిదిద్దాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్టుగా పాదాలు చిత్రించుకోవాలి.
 

కృష్ణాష్టమి వేళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పూజ చేయడం మంచిది. పూజా స్థలంలో బియ్యం రాశిగా పోసి కొత్త వస్త్రాన్ని దానిపై వేసి మంటపం ఏర్పాటు చేసుకుని కొత్త కుండను గంధం, పువ్వులు, అక్షతలతో అలంకరించి మంటపంపై పెట్టుకోవాలి. ఆ కుండకు వస్త్రం చుట్టి దానిపై బాలకృష్ణుని ప్రతిమను పెట్టుకోవాలి. ఈ సమయంలో కంచు దీపంలో కొబ్బరినూనె పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి. నుదుటిన బొట్టు పెట్టుకుని, తూర్పు దిక్కుకు తిరిగి "ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః'’ అనే మంత్రాన్ని 108సార్లు జపించాలి.
 

బాలకృష్ణా స్తోత్రం, శ్రీకృష్ణ సహస్రనామాలు, శ్రీ శ్రీమద్భాగవతములతో శ్రీకృష్ణుడిని స్తుతించాలి. తరువాత శ్రీకృష్ణుడికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ నివేదించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి, రాత్రి శ్రీకృష్ణుడి లీలలు, కథలతో జాగరణ చేసి మరుసటి రోజున భోజనం చేయాలి.
 

కృష్ణాష్టమి రోజున ఆలయాలలో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించినవారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అని పండితులు, పురోహితులు తెలియజేస్తున్నారు. స్కాందపురాణం ప్రకారం కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని అర్చిస్తే సకల పాపాలు తొలగిపోతాయని, ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతాయి. కృష్ణాష్టమి రోజున బంగారంతో కాని, వెండితో కాని చంద్రబింబాన్ని చేసుకుని వెండి, బంగారు పాత్రలలో దాన్ని ఉంచి పూజించి అర్ఘ్యం యిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది. అలాగే ఈ రోజున భీష్మాచార్యులను అర్చించి పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని మహర్షులు తెలిపారు.
 

శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి :

 

ఓం శ్రీకృష్ణాయ నమః

ఓం కమలనాథాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం సనాతనాయ నమః

ఓం వసుదేవాత్మజాయ నమః

ఓం పుణ్యాయై నమః

ఓం లీలామానుషవిగ్రహాయ నమః

ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః

ఓం యశోదావత్సలాయ నమః

ఓం హరయే నమః 10

ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాంభుజాయుధాయ నమః

ఓం దేవకీనందనాయ నమః

ఓం శ్రీశాయ నమః

ఓం నందగోపాప్రియాత్మజాయ నమః

ఓం యమునావేగాసంహారిణే నమః

ఓం బలభద్రప్రియనుజాయ నమః

ఓం పూతనాజీవితహరణాయ నమః

ఓం శకటాసురభంజనాయ నమః

ఓం నందప్రజజనానందినే నమః

ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః 20

ఓం నవనీతవిలిప్తాంగాయ నమః

ఓం నవనీతనటాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం నవనీతనవాహారాయ నమః

ఓం ముచుకుందప్రసాడకాయ నమః

ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః

ఓం త్రిభంగినే నమః

ఓం మధురాకృతయే నమః

ఓం శుకవాగామృతాబ్దిందనే నమః

ఓం గోవిందాయ నమః 30

ఓం యోగినాంపతయే నమః

ఓం వత్సవాటచరాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం దేనుకసురభంజనాయ నమః

ఓం తరుణీకృతతృణావర్తాయ నమః

ఓం యమళార్జునభంజనాయ నమః

ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః

ఓం తమలాశ్యామలాకృతయే నమః

ఓం గోపగోపీశ్వరాయ నమః

ఓం యోగినే నమః 40

ఓం కోటిసూర్యసమప్రభాయ నమః

ఓం ఇళాపతయే నమః

ఓం పరంజ్యోతిషే నమః

ఓం యాదవేంద్రాయ నమః

ఓం యాడూద్వహాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం పీతవాససే నమః

ఓం పారిజాతాపహరకాయ నమః

ఓం గోవర్తనాచలోద్ధర్త్రే నమః

ఓం గోపాలాయ నమః 50

 

ఓం సర్వపాలకాయ నమః

ఓం అజాయ నమః

ఓం నిరంజనాయ నమః

ఓం కామజనకాయ నమః

ఓం కంజలోచనాయ నమః

ఓం మధురానాథాయ నమః

ఓం ద్వారకానాయకాయ నమః

ఓం బలినే నమః

ఓం బృందాదావనాంతసంచారిణే నమః

ఓం తులసీదామభూషణాయ నమః 60

ఓం శ్యమంతమణివార్త్రే నమః

ఓం నారనారాయణాత్మకాయ నమః

ఓం కుబ్జాక్రిష్ణాంబధరాయ నమః

ఓం మాయినే నమః

ఓం పరమపురుషాయ నమః

ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః

ఓం సంసారవైరిణే నమః

ఓం మురారినే నమః

ఓం నరకాంతకాయ నమః

ఓం అనాదిబ్రహ్మచారిణే నమః 70

ఓం కృష్ణావ్యాసానకర్మకాయ నమః

ఓం శిశిపాలశిరచ్చేత్రే నమః

ఓం దుర్యోధనకులాంతకృతే నమః

ఓం విడురాక్రూరవరదాయ నమః

ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః

ఓం సత్యవాచయే నమః

ఓం సత్యసంకల్పాయ నమః

ఓం సత్యభామారతాయ నమః

ఓం జయినే నమః

ఓం సుభద్రాపూర్వజాయ నమః 80

ఓం విష్ణవే నమః

ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః

ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః

ఓం వేణునాదవిశారదాయ నమః