Procedure Of Sphatika Linga Sadhana In Telugu

 CLICK HERE TO VIEW TELUGU VERSION

 

స్ఫటికలింగ సాధన ఎలా ఆచరించాలి

 

స్ఫటిక లింగ మారాధ్యాం సర్వసౌభాగ్యదాయకం !

దానం ధాన్యం ప్రతిష్ఠామ్ ఆరోగ్యం ప్రదదాతి సః !!

స్ఫటికలింగం ఆరాధన, పూజ సర్వ సౌభాగ్యాలను ఇస్తుంది. ధన, ధాన్యం, ప్రతిష్ఠ, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయి.

 

స్ఫటిక లింగం ప్రతిష్ఠాప్య యాజాతి యో పుమాన్ !

రోగం శోకం చ దారిద్ర్యం సర్వ నశ్చతి తద్ గృహాత్ !!

ఎవరైతే ఇంట్లోని పూజగదిలో స్ఫటిక లింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేసి నిత్య పూజ చేస్తారో, ఆ ఇంటినుండి రోగం, శోకం, దారిద్ర్యం సమసిపోయి, శ్రీలక్ష్మీదేవి స్థిరనివాసం చేస్తుంది.

 

పూజనాదస్య లింగస్య అభ్యర్చనాత్ సశ్రద్ధయా !

సర్వపాప వినిర్ముక్తః శివ సాయుజ్యమాప్నుయాత్ !!

సాధకుడు శ్రద్ధగా ప్రతిరోజూ శివలింగానికి అర్చన, పూజ చేస్తాడో వారు అన్ని పాపాలనుండి విముక్తి పొంది శివ సాన్నిధ్యాన్ని పొందుతారు.

 

స్ఫటికలింగ సాధన - విధి

 

* స్ఫటికలింగ ప్రయోగం మాసశివరాత్రి లేదా శివరాత్రి రోజున చేయాలి లేకపోతే ఏదైనా సోమవారం రోజైనా చేయవచ్చు.

* శుభ ముహూర్తంలో దక్షిణ దిశవైపు ముఖంపెట్టి, ప్రశాంతంగా గదిలో లేకపోతే గుడిలో కూర్చోవచ్చు.

* సాధకుడు తన ఎదుట ఒక పీట వేసుకుని దానిపైన తెల్లని వస్త్రం పరచాలి.

* దానిపై ఒక పళ్ళెం లేదా పాత్ర పెట్టాలి.

* పళ్ళెంలో కుంకుమ లేదా కేసరి కలిపిన బియ్యం రాశిగా పోయాలి.

* బియ్యపు రాశిపై ప్రాణప్రతిష్ఠత చేతనాయుక్తమైన ... మంచి ముహూర్తంలో శుద్ధిపరిచిన స్ఫటికలింగం స్థాపించాలి.

* తరువాత శివలింగాన్ని పంచామృతంతో స్నానం చేయించి ఈ మంత్రాన్ని చదువుతూ స్నానం చేయించాలి ....

ఓం శం సద్యోజాతాయ నమః దుగ్థ స్నానం సమర్పయామి

ఓం వం వాసుదేవాయ నమః దధి స్నానం సమర్పయామి

ఓం యమ అఘోరాయ నమః ఘృత స్నానం సమర్పయామి

ఓం తత్పురుషాయ నమః మధు స్నానం సమర్పయామి

ఓం మం ఈశానంద నమః శర్కరాస్నానం సమర్పయామి

* పంచామృత స్నానం తరువాత శుద్ధ జలంతో స్నానం చేయించి, స్ఫటికలింగాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడవాలి

* ధూప, దీప, పుష్ప, నైవేద్యాలతో 'ఓం నమః శివాయ' అంటూ పూజ చేయాలి.

* పాలతో చేసిన నైవేద్యం సమర్పించాలి

* పాలు కలిపిన నీళ్ళతో స్ఫటిక లింగానికి అభిషేకం చేయాలి. 'ఓం శం శంకరాయ స్ఫటిక ప్రభాయ ఓం నమః' అంటూ 108 సార్లు జపం చేయాలి

* అభిషేకం చేసిన నీళ్ళను ప్రసాదంగా స్వీకరించాలి. పూజ పూర్తయిన తరువాత తమ కుటుంబ సభ్యులు అందరూ సంపూర్ణ ఆరోగ్యం, సుఖం, ఐశ్వర్యం ప్రసాదించమని శివున్ని ప్రార్థించాలి. నియమిత రూపంతో, నియమిత కాలంలో సాధనను ఏడు రోజులు ఆచరించాలి. పూజ అనంతరం స్ఫటిక శివలింగాన్ని పూజామందిరంలో పెట్టాలి. మిగిలిన పూజా సామాగ్రిని వస్తంలో మూటకట్టి పారే నీటిలో విడిచిపెట్టాలి.

.

 

 

Products related to this article

Simhasanam (Red Colour)

Simhasanam (Red Colour)

Simhasanam..

$25.00

0 Comments To "Procedure Of Sphatika Linga Sadhana In Telugu"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!