Significance and Importance of Vaishakha Masam

వైశాఖమాసం విశిష్టత

పున్నమిచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. మాసాలు అన్నింటి కంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది. వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసిదళాలతో శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించినవారికి ముక్తిదాయకం అని పురాణాలలో తెలుపబడింది.  వైశాఖ మాసం మొదలుకొని మూడునెలలపాటు శ్రీమహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. వైశాఖ మాసం యొక్క మహత్యాన్ని శ్రీమహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ మాసంలో ఒంటిపూట భోజనం, నక్తం ఆయాచితంగా భుజించడంవైశాఖ మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేయాలి. అటువంటి వారు ఉత్తమగతులు పొందుతారు కాబట్టి వైశాఖ మాసం పరమేశ్వరుడికి ధార పాత్ర ద్వారా అభిషేకం చేసినట్లయితే శుభఫలితాలు పొందుతారు. రావిచెట్టు మొదళ్ళను ఎక్కువ మొత్తం నీటితో తడిపి ప్రదక్షిణాలు చేసినవారి పూర్వీకులు అందరూ తరిస్తారు. ఎంతో శ్రేష్ఠమైనదని తెలుపబడింది. వైశాఖ మాసంలో దేవతలతో సహా అందరికీ పూజనీయమైనదని, యజ్ఞాలు, తపస్సులు, పూజలు, దానధర్మాలకు, నదీ స్నానాలకు ఉత్తమమైన మాసం. నదీ స్నానం చేయలేనివారు గంగ, గోదావరి, యమునా మొదలైన పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువలలో, చెరువులలో, బావుల దగ్గర లేకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి ఎందుకంటే నీటిలో సమస్త దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసం మొత్తం స్నానం చేయలేనివారు కనీసం మూడు రోజులు అయినా స్నానం చేయాలి అవి శుక్లపక్ష త్రయోదశి, చతుర్ధశి, పూర్ణిమ తిథులు.  వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఎండలు అధికంగా ఉంటాయి. కాబట్టి వేడినుండి ఉపశమనం కలిగించేవి అంటే నీరు, గొడుగు, విసనకర్ర, చెప్పులు దానం చేయడం అత్యంత శ్రేష్ఠం.  వైశాఖ మాసంలో అక్షయతృతీయ, పరశురామ జయంతి, ఆదిశంకర జయంతి, భగవద్రామానుజ జయంతి, నారసింహ జయంతి, సత్యనారాయణ స్వామి కల్యాణం, మోహిని ఏకాదశి, హనుమత్ జయంతి, బుద్ధపూర్ణిమ, సంపద్ గౌరీ వ్రతం వంటి పర్వదినాలు ఉన్నాయి. వైశాఖ మాసంలో అన్నదానాలు, వస్త్ర దానాలు, బియ్యం, మంచం, మామిడిపళ్ళు, మజ్జిగ, ఆవునెయ్యి, చెరుకురసం, అరటిపళ్ళు దానం చేసిన వారు అనంతమైన పుణ్యఫలాలు పొందుతారు.

 

వైశాఖ మాసంలో ఏవి దానం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది?

మామిడిపళ్ళు               పితృదేవతలు సంతోషిస్తారు, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.

పానకం కుండ                పితృదేవతలకు వంద సార్లు గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది.

దోస, బెల్లం, చెరుకు         సర్వపాపాలు నశిస్తాయి.

మంచం                         సుఖసంతోషాలు అభివృద్ధి చెందుతాయి.

వస్త్రాలు                         ఆయుష్షు వృద్ధి, ముఖ్యంగా తెల్లవస్త్రాన్ని దానం చేస్తే పూర్ణాయుష్షు  పొంది అంత్యంలో  ముక్తిని పొందుతారు.

కుంకుమ                      స్త్రీలకు పూర్ణ ఆయుష్షు కలిగిన భర్త లభిస్తాడు, ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.

గంధం                           తరచుగా ప్రమాదాలకు గురికాకుండా తప్పించుకోగలరు

తాంబూలం                    అధిపతులు అవుతారు.

కొబ్బరికాయ                  ఏడు తరాల పితృదేవతలను నరకభాదల నుండి విముక్తులను చేస్తారు

మజ్జిగ                           సరస్వతీదేవి అనుగ్రహంతో విద్యాప్రాప్తి  కలుగుతుంది.

చెప్పులు                       నరకబాధల నుండి విముక్తి లభిస్తుంది.

గొడుగు                         సమస్త దోషాలు నివారింపబడతాయి, కష్టాల నుండి విముక్తి పొందుతారు, మృత్యుబాధ ఉండదు.

ఫలాలు                         జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

బియ్యం                         అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం ప్రాప్తిస్తుంది.

ఆవునెయ్యి                    అశ్వమేథయాగం చేసిన పుణ్యం లభిస్తుంది, విష్ణు సాయుజ్యం పొందుతారు.  పితృదేవతలకు వదిలినవారికి దారిద్ర్య                                                      బాధ ఉండదు.

అన్నదానం                   విశేష ఫలితం పొందుతారు, సమస్త దేవతల ఆశీస్సులు పొందుతారు, సర్వధర్మాలను                                                                                         ఆచరించిన ఫలితం పొందుతారు.

పెరుగు అన్నం               చేసిన కర్మలు తొలగి పుణ్యం లభిస్తుంది.  

0 Comments To "Significance and Importance of Vaishakha Masam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!