Vaishaka Masam

Vaishaka Masam 

అక్షయ తృతీయ

వైశాఖ శుద్ధ తదియను అక్షయతృతీయ అని అంటారు. అక్షయము అంటే క్షయం లేనిది, లేక్కలేనిది అని అర్థాలు ఉన్నాయి. ఈ రోజునే కృతయుగం ప్రారంభం అయింది అని పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టే కృతయుగాదే అక్షయతృతీయగా వ్యవహారంలోకి వచ్చిందని పండితులు చెబుతున్నారు. అక్షయతృతీయ రోజునే శ్రీమన్నారాయణుడి ఆరవతారం పరశురాముడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి.

బుద్ధ పూర్ణిమ

సిద్ధార్థ గౌతముడు నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు, బుద్ధ ధర్మానికి మూల కారకులు. బుద్దుడు 20వ శతాబ్దపు చారిత్రకారులు క్రీ.పూ. 563 నుండి 483 మధ్యలో జననం, 410-400  మధ్యలో పరమపదించి ఉండవచ్చు అని భావిస్తున్నారు కానీ ఎవరూ దానిని ఆమోదించలేదు. సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. గౌతమ అనేది సిద్ధార్థుడి ఇంటిపేరు

శ్రీ హనుమాన్ జయంతి

'కలౌ కపి వినాయకౌ' అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు అని అర్థం. శ్రీ రామచంద్రుని పరమభక్తుడైన శ్రీ హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారం రోజు పూర్వాభాద్రా నక్షత్రంలో, నైరుతి యోగాన మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో కౌండిన్యస గోత్రంలో జన్మించాడు అని శ్రీ హనుమత్కధకు పరాశర సంహిత ప్రామాణిక

నారసింహ జయంతి

శ్రీ మహావిష్ణువు సాధు పరిరక్షణ, దుష్టశిఖన కోసం యుగయుగాన వివిధ అవతారాలలో అవతరించాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అని అంటారు. వాటిలో ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అని అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారమే నారసింహ అవతారము. నరసింహస్వామి వైశాఖ శుద్ధ చతుర్థశి రోజున ఉద్భవించాడు ఈ రోజునే విష్ణు భక్తులు నృశింహ జయంతి, నారసింహ జయంతిగా ఉత్సవాలు జరుపుకుంటారు. స్వామివారు వైశాఖ మాస శుక్ల పక్షంలో పూర్ణిమ 

మోహిని ఏకాదశి

వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్య పురాణంలో వివరించబడింది. ఒకసారి పాండవాగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు. “ఓ జనార్ధనా! వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని ఆచరించే పధ్ధతి ఏమిటి? దానిని ఆచరించడం వలన కలిగే ఫలితాలు ఏమిటి?''

భగవద్రామానుజ జయంతి

'ఇళయ పెరుమాళ్' పింగళ వర్షం, చైత్రమాసం, తిరువాదిరై రాశి (ఆరుద్ర నక్షత్రం), శుక్లపక్ష పంచమి, శుక్రవారం, క్రీ. శ. 1017, ఏప్రిల్ 13న మదరాసు పట్టణానికి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరుంబుదూర్ లో కేశవా సోమయాజి దీక్షితార్, కాంతిమతి అనే పుణ్యదంపతులకు జన్మించాడు. సోమయాజి దీక్షితార్, కాంతిమతిలకు ఎంత కాలానికీ సంతానం కలగకపోవడంతో వీరిద్దరూ కలిసి తిరుళ్ళిక్కేణి ఒడ్డున ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాల ద్వారా ఆ స్వామిని మెప్పించి సంతానం పొందే ఉద్దేశ్యంతో శ్రీపెరుంబుదూర్ ను వదిలి

ఆది శంకరాచార్య జయంతి

శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతంపై ఉన్న శివుడిని ప్రార్థించగా ప్రసన్నుడైన పరమేశ్వరుడు పుత్ర సంతానాన్ని

పరశురామ జయంతి

పరశురాముడు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఆరవ అవతారం, పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ రోజున అవతరించాడని స్కంద, బ్రహ్మాండ పురాణాలలో తెలుపబడ్డాయి. పరశురాముడిని భార్గవరామ, జమదగ్ని అని కూడా పిలుస్తారు.

గాధి కుశ వంశపు రాజు, భృగు వంశపు చెందినా ఋచీక మహర్షి ఒకసారి గాధి వద్దకు వెళ్ళి గాధి కుమార్తె అయిన సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. అందుకు గాధి తనకు

వైశాఖమాసం విశిష్టత

పున్నమిచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. మాసాలు అన్నింటి కంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది. వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసిదళాలతో శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించినవారికి ముక్తిదాయకం అని పురాణాలలో తెలుపబడింది.  వైశాఖ మాసం మొదలుకొని మూడునెలలపాటు శ్రీమహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. వైశాఖ మాసం యొక్క 

.owntable span, .owntable a{ background-color:#9C490A; border-radius: 5px; color: #ffffff; display: block; font-size: 26px; padding: 0 10px; text-align:center; } .owntable td{ border:none;} .owntable span:hover, .owntable a:hover{ background-color:#AA4201;} table.owntable { float: left; margin-top: 20px; } వైశాఖమాసం విశిష్టత అక్షయ తృతీయ పరశురామ జయంతి ఆది శంకరాచార్య జయంతి భగవద్రామానుజ జయంతి మోహిని ఏకాదశి నారసింహ జయంతి బుద్ధపూర్ణిమ శ్రీ హనుమా..
Showing 1 to 10 of 10 (1 Pages)