Ashwini Nakshtram  (Janma Nakshtra Shiva Temple  + Rasi Shiva Temple  + Draksharamam)

Ashwini Nakshtram (Janma Nakshtra Shiva Temple + Rasi Shiva Temple + Draksharamam)

Availability: 100
Product Code: EPS-JNS
Call for Service: +91 7731 88 11 13

Abhishekams are performmed according to Janama Nakshtra shiva temple, Janam Rasi Shive temple and in  Draksharamam


అశ్వనినక్షత్రం – ప్రథమచరణం

శ్రీఅన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి – బ్రహ్మపురి

ఈ క్షేత్రము వృద్ధగౌతమి నదీతీరాన విలసిల్లియున్నది. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో మొట్టమొదటి నక్షత్రము అశ్వని నక్షత్రపు ప్రథమ చరణమునకు చెందినది. ఈ నక్షత్రమున జన్మించిన వ్యక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అర్చన, అభిషేకాదులు నిర్వహించిన ఎడల వారి సమస్త గ్రహపీడలు తొలగి సుఖవంతులగుదరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


                                    For more details Click here 

ఆశ్వనినక్షత్రం – ద్వితీయచరణం

శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత భవానీ శంకరుడు – ఉప్పుమిల్లి

ఈ క్షేత్రమునకు సంబంధించి విశేషమైన స్థలపురాణం కలదు. కలియుగారంభ సమయమున దేవతలకు మునీశ్వరులకు ఋషీశ్వరులకు స్నాన సంధ్యా వందనాది జప తపాదులకు పవిత్ర జలము లేనందున భగీరథుడు అను మహాముని ఆకాశగంగ కొరకై శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేసెను. అందులకు శంకరుడు మెచ్చి ఆకాశగంగను తన శిఖనందు బంధించి జడపాయ ద్వారా కొంత జలమును క్రిందకు వదులసాగెను. ఆ జలమును మానవ క్షేమమునకై సప్తమహాఋషులు ఒక్కొక్కరూ ఒక్కో ప్రదేశమునకు ఆ గంగను తీసుకువెళ్ళెను. ఆ మునులలో ఒకరైన అత్రి మహాముని కొంత జలమును ఈ గ్రామమునకు తూర్పున ఉత్తరముగా ప్రవహింప జేస్తూ లవణసముద్రమున కలిపినందున ఈ గ్రామమునకు ఉప్పుమిల్లి గ్రామముగా పేరువచ్చినది. ఈ నదిని అత్రిమహాముని తీసుకువచ్చినందుకు ఈ నదికి అత్రీయ గోదావరి అనియు ఉత్తరముగా ప్రవహించుటచే ఉత్తర వాహిని అనియు ఈ నదిని గొప్పరేవుగా పిలిచెడివారు. ఇప్పుడు గొప్పిరేవుగా పిలువబడుచున్నది. ఈ ఆత్రేయ గోదావరి సప్తసాగర యాత్రలలో రెండవది. ఈ గ్రామమునకు దక్షిణ భాగమున అఖండ గౌతమీ గోదావరి తూర్పు దిశగా ప్రవహిస్తూ ఆత్రేయ గోదావరిలో కలియుచున్నది.


For more Details  Click Here 

అశ్వని నక్షత్రం – తృతీయచరణం

శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మల్లేశ్వరస్వామి – కుయ్యేరు

ఈ క్షేత్రము అశ్వని నక్షత్రము మూడవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ క్షేత్ర స్థిత శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మల్లేశ్వరస్వామిని దర్శించి అర్చనాభిషేకములు నిర్వర్తించిన శుభ ఫలితములు కలుగునని భక్తుల విశ్వాసము. అత్యంత పురాతన క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం సుమారు రెండువందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు తెలుస్తున్నది. అయితే ఆలయం జీర్ణావస్థలోకి వచ్చిన కారణం చేత గ్రామస్థుల సహకారంతో పునఃనిర్మాణం చేపట్టడం జరుగుచున్నది.

                               


 అశ్వని నక్షత్రం – చతుర్థచరణం

                  శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి – దుగ్గుదూరు


ఈ క్షేత్రాన కోలువైయున్న గణపతికి కామ్య గణపతియని పేరు. దానికి తగ్గట్టుగానే ఈ గణపతి సర్వసిద్దిదాయకుడు. ఏ సంకల్పంతోనయితే స్వామిని నిష్కల్మష భక్తితో త్రికరణశుద్ధిగా సేవిస్తారో ఆ సంకల్పసిద్ధి జరిగినట్లు దృష్టాంతములు గలవు. ఈ ఆలయం సుమారు 250సంవత్సరములకు పూర్వము పిఠాపురం సంస్థానాధీశులు రేచర్ల గోత్రజ్ఞులు రావు గంగాధర రామారావుగారిచే పునర్నిర్మితమయినది. ఆ కారణం చేతనే నేటికిని ఈ ఆలయమున ప్రథమపూజ వారి పేరున జరుగుతుంది. ఇచ్చటి ఈశ్వర రూపం అఘోర రూపంగా చెబుతారు. అంతేకాక పరమేశ్వర స్వరూపమునకు మల్లిఖార్జున నామధేయం కూడా ఆలయ పునఃనిర్మాణం సమయంలో పిఠాపురాధీశులచే స్థిరపరచబడినది.


For more Details Click Here


Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good