అంతర్వేది తీర్థం

అంతర్వేది తీర్థం

అంతర్వేది తీర్థం ( రథోత్సవం) :



తూర్పు గోదావరి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అంతర్వేది. అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలో ఉంటుంది. ఇక్కడ నరసింహ స్వామి లక్ష్మీ సమేతుడై కొలువుతీరాడు. ఈ క్షేత్రానికి భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం అని పేరు వచ్చింది. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశిగా పేరుపొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. ప్రతి ఏటా మాఘమాసం శుద్ధ సప్తమి నుంచి బపుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘ శుద్ధ దశమి నాడు స్వామివారి కల్యాణం, ఏకాదశినాడు స్వామివారి రథోత్సవం జరుగుతాయి. వైశాఖమాసంలో శుద్ధ చతుర్దశినాడు లక్ష్మీనృసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని సంతానం లేని వారు స్వామివారిని దర్శిస్తే తమ కోరిక తీరుతుందని నమ్మకం. ఇక్కడ ఉండి, రాత్రి తడి బట్టలతో నిద్రిస్తారు. నిద్రలో పళ్ళు, చిన్నపిల్లల బొమ్మలు కలలో కనిపిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.