Do you know how many benefits are there if you burn Dhoop sticks with those two?

Do you know how many benefits  are there if you burn Dhoop sticks  with those two?



ఏదో ఒక సందర్భంలో ప్రతి ఇంటిలోనూ ధూపం వేయటం సహజమే.. అయితే వారి సంప్రదాయాలను అనుసరించి ధూపాలను వేస్తూ ఉంటారు.ధూపం వేయటం వలన ఇంటిలోని ప్రతికూల శక్తి బయటకు పోయి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మానసిక ఉల్లాసం కలగటంతో చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఇప్పుడు చెప్పే విధంగా ధూపం వేస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.


ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కర్పూరం, లవంగం కాల్చి ఆ ధూపాన్ని ఇళ్లంతా చూపించాలి. ఆ తర్వాత పూజ చేసి కర్పూర హారతి తీసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన వాస్తు దోషాలు పోవటమే కాకుండా ఇంటిలో ధన నష్టం కూడా ఉండదు. అలాగే ఇంట్లో నిప్పులు కాల్చి వాటిపైన గుగ్గులు పెట్టాలి. గుగ్గులు సువాసన కారణంగా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.


ఇంట్లో ఎవరైనా మానసిక రోగులు ఉంటే వారికి కూడా నయం అవుతుంది. గుగ్గులు అనేది మార్కెట్లో సులభంగా దొరుకుతుంది.ఆవు పిడకలను కాల్చి దాని మీద పసుపురంగు ఆవాలు వేసి, ఆ ధూపాన్ని ఇళ్లంతా చూపిస్తే ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంపాదించిన ధనం చేతిలో నిలవకపోతే అగర్బత్తీ ధూపం వేయాలి.


ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్ళి పూజ చేసి అగరబత్తీలను వెలిగించాలి

ఈ విధంగా చేస్తే ధన వృద్ధి కలుగుతుంది

వేపాకుతో ధూపం వేస్తే ఇంకా చాలా మంచిది

వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి..స్వస్తి..