ఓం గం గణపతయే నమః

 ఓం గం గణపతయే నమః

 ఓం గం గణపతయే నమః 

గణపతిని తొలిగా పూజిస్తాం మనం అనుసరించే ఆరాధనా విధానాలు అన్నిటిలోనూ గణపతికి ప్రథమ ప్రాధాన్యం ఆ సేతు హిమాచలం శివారాధనకు ఎంత ప్రాధాన్యం ఉందో శివపుత్రుడు గణపతి పూజకు అంతే ప్రాధాన్యం ఉంది కార్యనిర్వహణ లోని విఘ్నాలను దాటిన వారికే అంతిమ విజయం లభిస్తుంది ఆ విజయాన్ని అందుకోవడానికి ప్రతిపాదిక గణపతి ఆరాధన .ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ 

దీనిని గణేశ గాయత్రి అంటారు వక్రతుండుడైన తత్పురుషుని ధ్యానిద్దాం ఆ దంతి మన బుద్ధి శక్తులను పెంచుతాడు అని దీనికి స్థూలమైన అర్థం ,గణేష్ అధర్వ శిర్షోపనిషత్తు గణేశ రూపాలను గుర్తించి విస్తృతంగా చర్చించింది గణేషుడు భూమి వాయువు సూర్యుడు చంద్రుడు ఇలా ప్రకృతిలోని సమస్త శక్తులకు ప్రతీకగా రూపొందాడు నువ్వే బ్రహ్మ ఇంద్రుడు శివుడవు... వారందరూ నీలోనే నెల కొన్నారు అని ఉపనిషత్తు గణేశుణ్ను కిర్తిస్తుంది.

         

                  Worship Lord Ganesha on Sankatahara Chaturthi and Remove all obstacles in life

                                                              https://shorturl.at/dsSU5

శుక్లాంబరధరం అంటూ మనం చదువుకునే గణేశ స్తోత్రం లో ఆయన పేరు కనిపించను శుక్లాంబరధరుడు అంటే తెల్లని వస్త్రాలు ధరించినవాడూ పరిశుద్ధుడు అని అర్థం విష్ణు అనే పదానికి ఆయన మనందరికీ సమీపంలోనే ఉండే వాడనే  అని అర్థం ఉంది శశివర్ణం అంటే చంద్రునివలె తెల్లనైన వాడు చల్లనైన వాడు అని అర్ధాలున్నాయి చంద్రకిరణాలు చల్లగా ఉంటాయి సూర్యకిరణాలు మన చూపును దెబ్బతీస్తాయి అదే చంద్రుని అయితే తదేకంగా చూస్తూ ఉండవచ్చు వినాయకుడు అటువంటి వాడు 


 చతుర్భుజం అనే పదానికి ఆయన సమస్త విశ్వాన్ని సునాయాసంగా మోయగల వాడినిఅర్థం ,ప్రసన్న వదనం ధ్యాయేత్ అన్నప్పుడు ఆయన ప్రశాంతత కరుణాత్మక వదనం గుర్తుకు వస్తుంది

వెను వెంటనే మనలో ఉద్ధరణ పొందిన అనుభూతి కలుగుతుంది ,సర్వ విగ్నోపశాంతయే అన్నప్పుడుమన మనస్సులో ఏర్పడే ఆటంకాలను తొలగిస్తాడని అర్థం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ శ్లోకం గణపతికే కాకుండా అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను ఉద్దేశించి పెద్దలు చెప్పారు .


మన అన్ని కార్యాలకు అడ్డంకులు లేకుండా ఆశీర్వదించాలని ఆ మహాగణపతిని కోరుకుంటూ


 ఓం గం గణపతయే నమః