సోమవారం శివపూజ ...శివానుగ్రహం

సోమవారం శివపూజ ...శివానుగ్రహం

సోమవారం శివపూజ …శివానుగ్రహం

శివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం, శివానుగ్రహానికి నెలవైందని సంప్రదాయం చెబుతోంది..!

రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది, సాధుస్వభావులను కాపాడుతుంది, శివార్చనలో శివలింగం ప్రధానం, లింగం శివుడికి ప్రతిరూపం, శివుడు అభిషేక ప్రియుడు, అందుకే నెత్తిమీద గంగను ధరించి గంగాధరుడయ్యాడు... పంచభూతాల్లో భక్తుడు శివుణ్ని దర్శిస్తాడు...

మట్టితో శివలింగాన్ని రూపొందించుకొని స్వయంభూలింగంగా భావించి పూజిస్తారు...జలబిందువుల రూపంలో లింగాలెన్నో , జ్వలిస్తున్న విస్ఫులింగం భక్తుడికి శివలింగంలా కనిపిస్తుంది, అందుకే అగ్నికి నమస్కరిస్తాడు, ఆకాశం అంతా శివలింగ రూపమే.

శబ్దం ఆకాశానికి ప్రాణం, శబ్దంలోనే కదా నటరాజు ధ్వనించేది! డమరుక నాదంలో వినిపించే మాహేశ్వర సూత్రాలన్నీ శివస్వరూపాలే...శివపూజకు ఏ ఆడంబరాలూ అవసరం లేదు... ప్రకృతి నుంచి లభించే పత్రి, పుష్పం, పండు, నీళ్లు... ఇవే శివుడికి ప్రీతిదాయకాలు.

హరహరా’ అంటూ నీటితో అభిషేకిస్తే చాలు, ఎంతో తృప్తిచెంది పాపాలను హరిస్తాడు...
బిల్వదళాలనే పట్టువస్త్రాలుగా భావిస్తాడు, పువ్వులను అలంకరిస్తే చాలు, మనసును ఇచ్చినంతగా సంతోషపడతాడు...

ఒక్క పండు ఇస్తే జీవితాన్నే సఫలం చేస్తాడు, అందుకే అతణ్ని బోళాశంకరుడంటారు...రుద్రాభిషేకాలు పుణ్యదాయకాలు, యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలో ఈ ప్రపంచం అంతా రుద్ర గణాలతో నిండి ఉందనే వర్ణనలున్నాయి...

ఆ రుద్రగణాలన్నింటికీ అధిపతి శివుడు, అందుకే అతడు రుద్రుడు...రుద్రాధ్యాయంలో రెండు భాగాలున్నాయి, ఒకటి నమకం. రెండోది చమకం...

నమః’ అనే పదంతో రుద్రుణ్ని స్తుతించేది కనుక ఇది నమకం...

చ’ కారంతో శివుడి విశ్వరూపాన్ని స్తుతించిన భాగం కనుక అది చమకం.

ఒక్కొక్క భాగంలో పదకొండు అనువాకాలు (మంత్ర సముదాయాలు) ఉంటాయి...
అందుకే ఏకాదశరుద్రులు అనే ప్రసిద్ధి, శివుడి పూజలో పదకొండు సంఖ్య ఎంతో విశిష్టం...

శివుడి పూజకు నిర్మలమైన మనసు ఉంటే చాలు, మానసపూజకే శివుడు ప్రసన్నుడవుతాడు. మనసు ఏర్పడాలంటే భక్తి ఉండాలి, భక్తి అంటే మానసికంగా దగ్గర కావడమే..
శివుణ్ని పూజిస్తున్నంతసేపూ శివసంకీర్తనంతో ‘సారూప్యముక్తి’ లభిస్తుంది.

శివభక్తులు చేసే పూజల్లో పాల్గొంటూ వాళ్లతో సంభాషిస్తుంటే ‘సామీప్యముక్తి’ వస్తుంది...శివస్వరూపం అయిన ఈ చరాచరప్రకృతిలో జీవిస్తున్నందువల్ల మనిషికి ‘సాలోక్యముక్తి’ సాధ్యం.

శివుణ్ని వీడకుండా ఉండే మనసు వల్ల ‘సాయుజ్యముక్తి’ సంప్రాప్తించినట్లే...!మనిషి మోహం అనే అడవిలో దారీతెన్నూ తెలియక తిరుగుతుంటాడు. అతణ్ని బాల్యంలో, కౌమారంలో, యౌవనంలో, వార్ధక్యంలో వ్యామోహాలు వెంటాడుతుంటాయి.

వాటినుంచి తప్పించుకోవడం అతడికి అంత సులభం కాదు, శివతత్త్వాన్ని చక్కగా తెలుసుకుంటే మోహం తొలగిపోతుంది, యథార్థం తెలుస్తుంది...సోమవారం చంద్రుడికి నెలవు...!!!
కనుక ప్రతీ సోమవారం చంద్రకళాధరుడి పూజ ఐహికాముష్మిక ఫలదాయకం...
.           

Products related to this article

999 Silver Lingashtakam

999 Silver Lingashtakam

Experience the divine energy of the 999 silver Lingashtakam, a sacred symbol of Lord Shiva. This spiritual is a manifestation of devotion and inner connection. Enhance your spiritual practice with thi..

$4.00