శ్రీ పంచమి / మదన పంచమి

 శ్రీ పంచమి / మదన పంచమి

శ్రీ పంచమి / మదన పంచమి 'సందర్భంగా
ప్రార్థనా శ్లోకం -

యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వీతా
యావీణ వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుథిభి: దేవై: సదా వందితా
సామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహా

భావము:-
           
మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.

             
ఈ శ్లోకములో సరస్వతి దేవి ధరించినవన్నీ తెలుపులో వున్నాయి. తెలుపు సాత్విక గుణము. జ్ఞానము. తెల్లపువ్వు వలె, చంద్రునివలె,(తూషార)మంచు వలె, హారధవళ - ముత్యాలహారము. తెల్లని వస్త్రములు ధరించినది. తెల్లని పద్మములో ఆసీనురాలయినది, వీణ ధరించినది. సరస్వతి బొమ్మను పిల్లలకు చూపాలి.
సరస్వతి అనగా = చదువుల తల్లి.
సర+స్వ+తి= జ్ఞానము+మనలోని+ఇచ్చునది.
మనలో ఉన్న ఆ జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేస్తుంది.

పోతన గారి భాగవత పద్యం.!

'
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ"!
.
(
చదువుకోడానికి హాయిగా ఉండే పద్యం )
.
సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు
ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు
అందరూ అనుకునే మాట  సరస్వతీ మాత తెలుపు రంగులో ధగధ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని ఇక తన ఊహలకు పదను పెట్టాడు
శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా లేక శారద చంద్రబింబం లాగా ఉంటుందా కాదు కాదు పచ్చకర్పూరం లాంటి తెలుపేమో మాతది  ఊహకు అందలేదు  తెల్లని పటీరమూ (చందనం) , రాజహంసా , జాజిచెండ్లూ , నీహారాలూ (మంచు తుంపెరలు) , డిండీరం ( నురుగు ) , వెండికొండా , రెల్లుపూలూ , మల్లెలూ , మందారాలూ ,
పుండరీకాలూ ( తెల్ల తామర పూలు ) , ఆదిశేషుడూ , అన్నిటికీ మించి ఆకాశ గంగా ప్రవాహం — తెల్లగా , తేలికైన పసుపురంగుతో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయి
ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు
మాతృమూర్తిని ఆర్తితో అడిగాడు ” అమ్మా భారతీ , స్వచ్ఛమైన తెలుపురంగుతో మిరుమిట్లుగొలిపే నిన్ను మదిలో ఎప్పుడు చూడగలుగుతానో గదా!”

Products related to this article

Saraswathi Devi Brass Idol

Saraswathi Devi Brass Idol

Saraswathi Devi Brass IdolSaraswathi Devi idol is made of Brass.Height of the Idol 5.5 InchsWidth of the Idol3.5 InchsWeight of the Idol 700 GramsTerms and Conditions 1.The Image is of ..

$16.33 $16.33

Sacred Cow Dung Gobbillu (Gobbemmalu)  (5 Pieces)

Sacred Cow Dung Gobbillu (Gobbemmalu) (5 Pieces)

Sacred Cow Dung Gobbillu (Gobbemmalu)  (5 Pieces) Attract health and prosperity during this Maargaseersh and Makara months up to SANKRANTHI by keeping GOBBEMMALU( cow dung balls) on a Rangol..

$4.00