వార ఫలాలు 11-02-2024 నుండి 17-02-2024 వరకు

వార ఫలాలు 11-02-2024 నుండి 17-02-2024 వరకు

మేషం: వారికి ఈ  వారం అనుకున్న పనులు అన్ని అయినప్పటికీ కొంత శత్రువర్గం తో కానీ, మిమ్మల్ని విమర్శించే వారి నుండి కానీ కొంత ఇబ్బందులు ఎదురుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు  చేసే వారికి  కష్టం ఫలిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి కోరుకునే వారికి కొంత  సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం కనబడుతుంది. వ్యాపారస్తులకు కూడా మంచి లాభసాటిగా నడుస్తుంది. కార్యానుకూలత ఏర్పడుతుంది.  నూతన పెట్టుబడులకు, ఆలోచనలకు మంచి సమయం అని చెప్పవచ్చు. ఆర్ధిక అభివృద్ధితో పాటు మంచి జనాదరణ కూడా లభిస్తుంది. 

కుటుంబ పరంగా విందులు, వినోదాలకు  ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. భార్యాభర్తల మధ్యన కొంత సఖ్యత లోపిస్తోంది. ఇంట్లో నిశబ్ద వాతావరణం నెలకుంటుంది. నూతన వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఆశించిన ఫలితం రాకున్నా మీరు చేసే ప్రయత్నాలు మీరు శక్తి వంచన లేకుండా చేయడం మంచిది. రాబోయే రోజుల్లో మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి దోహదపడుతుంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. శారీరక శ్రమ  ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత నేర్పుతో కొంత ఒత్తిడిని తగ్గించుకోవడం చెప్పదగ్గ సూచన. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. స్నేహితులతో పరిచయాలు ఎక్కువ అవుతాయి. సాధ్యమైనంత వరకు చదువుపైన దృష్టిని సారించండి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ కొంత విమర్శలు  ఎదుర్కొంటారు.


వృషభం: వారికి  ఈవారం  గతంలో కంటే కొంత   అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు కానీ, గతంలో అనుకుని ఆగిపోయిన వ్యవహారాలు కొంత ఊరటను కలిగించే విధంగా ముందుకు సాగుతాయి. అలాగే కుటుంబ పరంగా పెద్దలపై గౌరవాభిమానాలు, అలాగే వారి అందండలు లభిస్తాయి. ఎంతో కొంత అభివృద్ధి కనబడుతుంది. అయితే ముఖ్యమైన వ్యవహారాల విషయంలో లేనిపోని సంకోచాలతో, అనుమానాలతో పనులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. కొంత చురుకుగా ప్రవర్తించడం మంచిది. లేనిపోని బద్దకంతో అశ్రద్ధ వలన పనులు ముందుకు సాగకపోగా మీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశాలు వున్నాయి. ఉద్యోగస్తులకు  పైఅధికారుల నుండి కొంత ఒత్తిడి ఉన్నట్లైతే  సానుకూలత ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత మిశ్రమ ఫలితములుండె అవకాశాలు ఉన్నాయి. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అవకాశాలు అయితే కనిపిస్తాయి.  ధైర్యంతో ముందుకు సాగండి.  అవకాశాలు వచ్చినప్పుడు అదిమి పట్టుకోవాలి. లేదంటే నష్టపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. 

మీరు చేసే పనిలో మీ ప్రతిభని వేలికితియ్యాలి. మరుగున పడిన మీ ఆలోచన శక్తికి పదును పెడితే మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అంతే కానీ పని పూర్తి చెయ్యాలి అని పని చేయడం వలన మీకు, మీ ప్రతిభకి భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుందని గ్రహించండి. వ్యాపారస్తులకు కూడా ఆర్ధిక పరంగా ఫలితములు  సాధారణంగా ఉన్నప్పటికీ   అభివృద్ధి అనేది అనుకున్నంత  లేకపోవచ్చు,   భవిష్యత్తుపై  నమ్మకంతో  మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికీ బాగుంది, స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఐటీ రంగం వారికీ అనుకూలంగా ఉంటుంది, కస్టనికి ప్రతిఫలం దక్కుతుంది. దూర ప్రయాణాల  విషయంలో కంగారుగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఫలితాలను నిర్ణయించుకుని అంచనాలతో బయలు దేరడం మంచిది. తొందరపాటు తనం, తొందరపాటు నిర్ణయాలు మీకు కొంత ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. రాజకీయ రంగాల్లో వున్నవారికి కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది, అయితే మీ ఆలోచనలతో ముందుకు సాగడం వలన మంచి ఫలితాలుంటాయి, ఎవరో ఎదో చెప్పారని నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రజల్లో మీ ఆత్మవిశ్వాసం పెంచుకోగలుగుతారు. కళా రంగం వారికి సానుకూల ఫలితాలుంటాయి. మీరు ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి.


మిథునం: వారికి ఈవారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి, అలాగే అధికారులతో మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఓర్పుతోనే కాకుండా నేర్పుతో కూడా వ్యవహరించడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సాఫ్ట్ వేర్ రంగం వారికీ అలాగే కళా రంగం వారికి మంచి అవకాశాలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి.  ప్రయత్నాలు కొనసాగించండి. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. అయితే ఆర్ధిక పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. కొంత అశాంతికి గురి అయ్యే అవకాశాలుంటాయి. రాబడి ఎంత వచ్చినా దానికి మించిన అధిక ఖర్చులు ఉంటాయి. ఆర్ధిక పరంగా నిలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నాలు చేతికి వచ్చినట్టే ఉంటాయి కానీ అవి అందుకోవడానికి ఒక యుద్దంలా, విశ్వప్రయత్నాలు చెయ్యాలి. పరిస్తితులు ఎలా ఉన్నాకూడా విలాసవంతమైన జీవితం గడుపుతారు. కొద్దిగా అలాంటి వాటిని అదుపులో ఉంచుకుంటే ఆర్ధికపరంగా నిలబడే అవకాశాలు ఉంటాయి.

వ్యాపారస్తులకు కొంత పెట్టుబడుల విషయంలో టెన్సన్స్ ఏర్పడతాయి. నిరాశకు గురి అవ్వకండి. తాత్కాలికమైన నష్టాలు అని గుర్తించండి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లాభాలు వెన్నంటే ఉంటాయి. ఆందోళన చెందవద్దు. మీ తెలివితేటలు, ఆలోచనలకు పదును పెట్టె సమయం గా భావించవచ్చు. విజయావకాశాలు ఎక్కువగా వున్నాయి. షయ వ్యవహారాలు, శుభకార్యాలు గురించి ఆలోచనలు చేస్తారు. విందులు, వినోదాలలో  పాల్గొంటారు. వివాహ  ప్రయత్నాలు చేసే వారికి మంచి  అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. బారసాల, అక్ష్యభాస్యం, అన్నప్రాసనకు ముహుర్తాలు నిర్ణయిస్తారు. కుటుంబ పరంగా,  సంతాన పరంగా  బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో లేనిపోని విషయాల వలన స్వల్ప మాట పట్టింపులు వచ్చే ఆస్కారం ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకు విహార యాత్రలకు దూరంగా ఉండడం చెప్పదగిన, ప్రయాణాలలో జాగర్తలు అవసరం.


కర్కాటకం: వారికి అన్ని విధముల కొంత జాగ్రత్త వహించవలసిన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులుకు   విద్య యందు ఆసక్తి తగ్గడం, లేదా సబ్జెక్టు పై  కొంత భయాందోళనలకు గురి అవ్వడం వంటివి  ఏర్పడవచ్చు.  చదువుపై మంచి పట్టు ఉన్నప్పటికీ పరీక్షా సమయంలో అది మీకు గుర్తు రాక అంతంత మాత్రంగానే పరీక్షలు రాస్తారు. ఈ విషయం మరింత ఆందోళనలకు గురి చేస్తుంది. మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. ఫలితములు నిదానంగా వస్తాయి. ఉద్యోగస్తులకు పని చేసే చోటైన, కార్యాలయాలలో కానీ కొంత శత్రువర్గం పొంచి ఉందనే విషయం తెలుస్తుంది. మీ  ఉద్రేకపూర్వమైన మాటల వలన పైఅధికారులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించండి. పని ఒత్తిడిని తట్టుకోవడం, మీ పనిని మీరు ఒక ప్రణాళిక బద్దంతో  కొనసాగించడం చెప్పదగ్గ సూచన. అలా కాకుండా మీ అభిప్రాయాలు, కోపమును అంతగా నమ్మకం లేని వారితో కానీ, సహా ఉద్యోగస్థులతో కానీ, స్త్రీలతో కానీ చర్చించడం మంచిది కాదు. ఉన్నవిలేనివి ఇంకా చేరి వివాదాలు ముమ్మరంగా  పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సహనమే మీ ఆయుధం, అదే మీకు శ్రీరామ రక్ష  అన్నట్టు ముందుకు సాగండి. 

వ్యాపారస్తులకు యధాతధంగా ఉంటుంది, నూతన పెట్టుబడులకు మంచి సమయం కాదు. కొంత ఆలోచించండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ పని చేసినా ఒకటికి పదిసార్లు అలోచించి నిర్ణయాలు చేయడం శ్రేయస్కరం. కుటుంబ పరంగా కూడా జీవిత భాగస్వామితో కానీ, ఇతరులతో కానీ ఉద్రేకపూరకమైన చర్చలు అనవసరం అని గుర్తించండి. తెలిసి తెలియకుండా మాటలను తూలడం వలన కొంత కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో  మనస్పర్ధలు వాటిల్లే అవకాశాలు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీరు చేసే పనులందు దైవానుగ్రహము ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఫలితం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆలా అని ప్రయత్నాలు మానకూడదు.  మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి.  ఆరోగ్య నియమాలు పాటించడం చాలా అవసరం. రాజకీయ రంగాల్లో వున్నవారికి మిశ్రమ ఫలితాలు గోచరిసుతున్నాయి. క్రింది స్తాయివారి అండదండలు మెండుగా ఉన్నా కూడా మీ మీద దృష్పచారం చేసే వారి వలన కొంత నష్టం వాటిల్లుతుంది. అష్టమ శని ప్రభావం వలన దన నష్టం వుంది. జాగర్త వహించాలి. 


సింహం: వారికి ఈవారం  ఉద్యోగ పరంగా కొంత ఇబ్బందులుండవచ్చు. ఋణాలు, లోన్లు వంటివి కొంత మానసిక అశాంతికి కారణమవుతాయి. చిన్నపాటి అవమానాలు, తగాదాలుండే సమయం, జాగ్రత్త వహించండి. అయితే సాఫ్ట్ వేర్ రంగం వారికి టెక్నీకల్ రంగం వారికి సానుకూలత ఏర్పడుతుంది.  రియల్ ఎస్టేట్ రంగం వారికి చురుకుగా పనులు నెరవేరుతాయి. భూములపై పెట్టుబడులు, లావాదేవిల విషయంలో కొంత గోప్యత అవసరం. లేదంటే అనుకున్న పనుల్లో జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ప్రజాదరణ పొందుతారు, మార్కెట్  లో పేరు వచ్చిందనే సంతోషం కలుగుతుంది. ఆర్ధిక పరంగా మిశ్రమ ఫలితములుంటాయి.   నూతన వస్తువులు, యంత్రాంగములు వంటివి కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. చేతిలో ఎలాగ డబ్బు నిలడం లేదు ఏదైనా వస్తువులు అయితే ఉంటాయి అన్న ధోరణితో డబ్బులు లేకపోయినా ఎదో ఒకలాగా ఏర్పాటు చేసుకుని కొంటారు. నూతన వస్తు సేకరణ జరుగుతుంది.  ఎదో ఒక విధంగా  డబ్బు చేతికి  అందడం  వలన అనుకున్న పనులు నెరవేరుతాయి. 

స్థిరాస్తి వ్యవహారాలు, వారసత్వ తగాదాలు ఉన్నవారికి కొంత సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యవహారముల  విషయంలో కార్య జయం, అనుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు చేయండి. ఆరోగ్య పరంగా బాగుంటుంది.  గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కొంత ఊరట లభిస్తుంది. అయితే దీర్ఘ కాలిక  వ్యాధులతో బాధ పడేవారు కొంత జాగ్రత వహించండి. ఆహార నియమాలు పాటించడం అవసరం. కళా, రాజకీయ సంబంధించిన వారికి అనుకోని అవకాశాలు వస్తాయి. సమయానుకూలంగా మీరు వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి ఉన్నతికి, ప్రతిష్ట లభిస్తుంది. ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు కాపాడుకుంటారో మీ నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్ధులకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అని చెప్పవచ్చు. అంగట్లో అన్నీ ఉన్నా కొనలేని పరిస్తితి అన్నట్టు. మీకు ప్రతిభ ఉన్నప్పటికీ అది సానుకూలంగా అక్కరకు రాదు. నలుగురిలో పలచన అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కావున ప్రశాంత వాతావరణం ఏర్పరుచుకోండి. ఏకాగ్రత చాలా అవసరం. ఇతర విషయాలపై ఆలోచన తగ్గించుకుంటే మంచి ఫలితాలు మీ సొంతం. ముత్యపు గణపతి లాకెట్ ధరించండి మంచి ఫలితాలుంటాయి.


కన్య: వారికి స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వారి నుండి మీరు అనుకున్న విధంగా సహాయ సహకారాలు అందుతాయి.  పెద్దవారితో మీరు  చెప్పాలనుకున్న విషయాలు, మాట్లాడాలనుకున్న విషయ వ్యవహారాలు చక్కబడతాయి. అలాగే కుటుంబంలో మాత్రం సంతానంతో , ముఖ్యంగా కుమారులతో కొంత మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కష్టనష్టాలకు ఓర్చి బయట ఇంత పేరు ప్రతిష్టలు,  గౌరవం సంపాదించుకున్నాం ఇంటిలో ప్రశాంతత కొరవడుతోందనే  భావన ఏర్పడుతుంది.  ఈ ఆలోచనలతో మీరు పని చేసే చోట, కార్యాలయాలలో వర్క్ మీద అశ్రద్ధ వహించినట్లైతే కొంత ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగం పట్ల, పని పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ తగాదాలకు, ఆఫీస్ విషయాలకు ముడి పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన, దేనికదే అన్నట్టు ప్రవర్తించడం మంచిది.

కుటుంబ సభ్యులు ఎప్పటికైనా అర్ధం చేసుకుంటారు. పనిచేసే చోట పరువు పోకుండా స్థిరంగా ప్రవర్తించడం మంచిది. లేదంటి ఇన్నాళ్ళు మీరు సంపాదించుకున్న గుడ్ విల్ ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటే బయటకు వెళ్ళినా, కార్యాలయంలో అయినా ప్రశాంతంగా ఉండటానికి దోహదపడుతుంది. వ్యాపారస్తులకు సాధారణంగా నడుస్తుంది. నష్టాలులు ఉండవు, అలాగని లాభాలు ఉండవు. మధ్యస్థంగా ఉంటుంది. రాబోయే రోజులలో సానుకూలత ఏర్పడుతుందనే నమ్మకం ఏర్పడుతుంది. మీ నమ్మకమే మీకు కొండంత ధైర్యాని ఇస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికీ బాగుంది, స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఐటీ రంగం వారికీ కొంత ఇబ్బంది ఎరపడవచ్చు, కస్టనికి ప్రతిఫలం దక్కుతుంది. నూతన విద్యా విధానాలు అభ్యసించడానికి,  విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పాస్ పోర్టులు వంటి పనులు అయినప్పటికీ వీసాలు  విషయంలో కొంత ఒడిదుడుకులు తప్పవు. ఆందోళన చెందకండి. ప్రయత్నాలు ఆపకండి. ఎటువంటి అపోహలు లేకుండా నమ్మకంతో, ముందుకు వెళ్ళండి తప్పకుండా సానుకూల ఫలితాలు ఏర్పడతాయి.


తుల: వారికీ ఈవారం  కుటుంబ పరంగా, మిత్ర బృందం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబంలో జరిగే శుభ కార్యాలు ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలుగ చేస్తాయి. సంతాన విషయంలో సంతృప్తి లభిస్తుంది. వారి అభివృద్ధి, ఆనందమే ముఖ్యమని భావిస్తారు. వారి ఉన్నతిని చూసి ఆనంద డోలికలో తేలుతారు. అయితే ఆర్ధిక  పరంగా కొంత మానసిక ఆందోళనలు ఉండే అవకాశాలు ఉన్నాయి.  ఖర్చులు అధికం అవుతాయి. సంతానం సాధించిన విజయం మీ ఆర్ధిక ఇబ్బందులు పెద్దగా తెలియవు. కుటుంబ పరంగా సంతోషంగా గడిపినప్పటికీ బంధువర్గంలో విమర్శలు, అంతర్గత కలహాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువుల మాటలు, విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. కుటుంబ పరంగా, సంతానంతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు కొంత ఉద్యోగ స్థిరత్వ విషయంలో ఆందోళనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన చెందకండి. దైవాను గ్రహము వలన ఇబ్బందులు ఎలా వచ్చాయో అలాగే తొలగిపోతాయి. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 

వ్యాపారస్తులకు పెట్టుబడిగా పెట్టె కన్సల్టేషన్స్ వ్యాపారస్తులకు మంచి గిరాకీ ఏర్పడుతుంది. సుగంధ ద్రవ్యాలు, విలాసవంతమైన వస్తువులు, ఫుడ్ వ్యాపారస్తులకు, సాఫ్ట్ వేర్ రంగాల వారికి మంచి సానుకూలమైన  ఫలితములు ఉండే అవకాశాలు ఉన్నాయి. శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికీ మానసిక ఆందోళనలు, వాటి వల్ల  వచ్చే రుగ్మతలు ఎక్కువగా బాదిస్తాయి. ఉదరము, కళ్ళు, తలనొప్పిలు వంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. సినీ, టీవీ రంగాల వారికి ఆశించినంత అవకాశాలు, అభివృద్ధి ఉండకపోవచ్చు. అనుకోని కొన్ని పొరపాట్లు వలన ఇటువంటి జరిగాయని ఆలస్యంగా తెలుసుకుంటారు. విద్యార్ధులకు పరీక్షా సమయం దగ్గర పడుతున్నందున లేనిపోని ఆందోళనలకు గురవుతారు. మానసిక ప్రశాంతత ఏర్పరుచుకోండి. మీరు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు,  పక్కవారి మాటలు పట్టించుకోవద్దు. మీకున్న శక్తి సామర్ద్యలు తలచుకుని ముందుకు సాగండి.


వృశ్చికం: వారికి స్థిరాస్తి విషయాలలో,  ఎప్పటి నుండో వాయిదాలు పడుతున్న తగాదాల విషయంలో ఒక నిర్ణయం వలన పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాలు ప్రయత్నిస్తే ఒక కొలిక్కి వస్తాయి.  అయితే ఆర్ధిక పరంగా అప్పుల విషయంలో కానీ గతంలో హామీలు ఇవ్వడం వలన కానీ  కొంత చికాకులు ఏర్పడతాయి. అయితే  మీకు ఎదురుకుండా మర్యాద ఇచ్చిన వారి దగ్గర, కొంత సన్నిహితంగా ఉన్నవారి దగ్గర మీ ఆవేదనను, యధార్ధాలు వాదించడం, చర్చించడం మంచిది కాదు. ఎందుకంటే మీ ఎదురుగా మీ మాట విన్నప్పటికీ మీ వెనుక వారు చెప్పే విషయాలు మిమ్మల్ని మీ బంధు వర్గానికి, సన్నిహితుల దగ్గర విరోధులుగా చిత్రీకరిస్తారు. మన మాట చెలామణి అవుతోంది. పలుకుబడి ఉంది, శత్రువులు మనకెందుకు ఉంటారు అని ఎప్పుడు అనుకోవడం శ్రేయస్కరం కాదు.  మీ ఆలోచనలను, అభిప్రాయాలను  గుట్టుగా దాచుకోవడం మంచిది. 

ఉద్యోగ పరంగా కొంత పని ఒత్తిడి కానీ, మానసిక ఒత్తిడి కానీ ఏర్పడవచ్చు. ధైర్యంగా ముందుకు సాగండి. పని భారం పెరిగినా మీ పరిధిని దాటి ప్రయత్నించకండి. మీ పరిధిలో నిదానంగా అయినా పనులు సానుకూల పడతాయి. సంతాన పరంగా కొంత అలసట, నిరాశ ఏర్పడుతుంది, వారికి కలిగే చిన్న చిన్న కష్టాలు, నష్టాలూ కూడా మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. వారి ప్రవర్తన ధోరణి మీకు ఆందోళనలు కలిగించే విధంగా ఉంటాయి. వారి నడవడికను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాల్సిన సమయం అని గ్రహించండి. విద్యార్థిని విద్యార్థులకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. కష్టానికి, శ్రమకు తగిన ఫలితం మాత్రమే లభిస్తుంది. మీ ఆశయ సాధన వృధా కాదు. విదేశీ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటినుండో పెండింగులో ఉన్న h1b వీసా వస్తుంది.


ధనస్సు: వారికి ఈవారం గతంలో ఏర్పడిన చికాకులు, ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంత చిన్న చిన్న విషయాలకు అనవసరంగా నిస్పృహ, ఆందోళన చెందామా అన్న ఆలోచన వస్తుంది. అవతలివారే  కాదు  మనం కూడా పోటీగా సమాధానం చెప్పాము  కదా! మనమేమి ఎందులోనూ తగ్గలేదు కదా ఎందుకు అనవసరమైన ఆలోచనలు అన్న విషయం అర్ధం అవుతుంది.  ఏది ఏమైనప్పటికీ కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే మీరు కూడా కొంత కఠినమైన  నిర్ణయాలు, కఠినమైన  మాటలు మాట్లాడడం తగ్గించుకుంటే మంచిది. మరింత ప్రశాంతంగా ఉంటారనేది గ్రహించండి. తన కోపమే తనకు శత్రువన్న విషయాన్ని మరచిపోకండి.  కుటుంబంలో శుభ కార్యక్రమాలకు, ఆర్ధిక పరమైన  ఖర్చులకు ప్రణాళికలు జరుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ పరంగా, సన్నిహితుల పరంగా కానీ అనుకోని విధంగా బహుమానాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు గాని ఉండవచ్చు. వచ్చే అవకాశాలను ఆస్వాదిస్తూ సద్వినియోగ పరుచుకొండి.

ఉద్యోగస్తులకు కూడా కొంత పని ఒత్తిడి తగ్గే అవకాశాలు, అలాగే అధికారులతో సానుకూలమైన వాతావరణం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా కొంత ఒడిదుడుకులు ఉన్నవారికి, సమస్యలు ఎదుర్కునే వారికీ మంచి పరిష్కారం దొరుకుతుంది.  గతంలో ఉద్యోగ పరంగా ఏర్పడిన ఒడిదుడుకులు అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఖర్చులు ఉంటాయి. అంతర్గత విమర్శలు తప్పవు. జాగ్రత్త వహించండి. మీలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగిస్తే, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మ కూడదు అనే ప్రశ్న, విషయ రహస్యం సమాధాన పరుస్తుంది. సావధానముగా ఆలోచించండి. అనుకూలమైన ఫలితాలుంటాయి. ఆర్ధికపరంగా అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి ధనం అందుతుంది. కానీ మీ చేతిలో అధిక మొత్తంలో ఉన్నా కూడా మీరు సరైన నిర్ణయాలు చేయక పొదుపు చేయకపోగా మంచినీళ్ళ ప్రాయంగా వృధా చేస్తారు. యువకులు ఈ వారం అనవసరమైన విషయ వ్యవహారాలలో తలదూర్చి లేనిపోని చిక్కులు నెత్తికి తెచ్చుకుంటారు. సాధ్యమైనంత వరకు విందు వినోదాలకు దూరంగా ఉండుట మంచిది. విద్యార్దులు కొన్ని విషయాలలో మెలకువ అవసరం. ఆదమరిస్తే అవకాశాలు చేజారి పోయే సమయం అని చెప్పవచ్చు.


మకరం: వారికి మిగిలిన అన్ని విషయములలో కొంత నిరాశ నిస్పృహలు ఏర్పడినప్పటికీ కుటుంబ పరంగా అండదండలు ఉంటాయి అన్న ధైర్యం కలుగుతుంది. నూతన వస్తువుల కొరకు ఆరాటపడతారు. బంధువర్గం లో కూడా చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి నుండి, కుటుంబం నుండి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు లభిస్తాయి. వారి ప్రేమాభిమానాలకు మనం ఋణ పడిపోతున్నామన్న భావన వస్తుంది. కాబట్టి ఏ చిన్న సమస్యలకు ఆందోళన చెందకండి. సమస్యలు వస్తాయి, పోతాయి, కానీ కుటుంబంలో మంచితనం, వారి అండదండలు  శాశ్వతం అనే విషయాన్నీ  గ్రహించండి.  జీవిత భాస్వామితో లేనిపోని విషయాలకు అపోహలు పెట్టుకొని కుటుంబంలో అగాధాన్ని సృష్టించుకోకండి. ఉద్యోగస్తులకు   పైఅధికారులతో నిరాదరణ ఏర్పడవచ్చు. మీతోమంచిగా మాట్లాడే వారు  మీ వెనుక చేసే  దుష్ప్రచారాలు మిమ్మల్ని ఇబ్బంది  పెడతాయి. 

నమ్మిన వారి వలన వంచనకు గురి అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్తవ హించండి.  ఆర్ధిక పరంగా కూడా అనుకున్న  ఫలితాలు ఉండకపోవచ్చు. దమ్మిడి ఆదాయం లేకున్నా ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకు సాధారణంగా  ఉంటుంది.  చంచలత్వంతో నిర్ణయాలు తీసుకోకండి. నష్టాలు కొనితెచ్చుకున్న వారు అవుతారు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నూతన ప్రణాళికల విషయంలో కుటుంబ సభ్యుల, సన్నిహితుల సహాయ సహకారాలు తీసుకోండి. జీవిత భాస్వామి సలహాలు మీకు కొంత వరకు ఊరటని కలుగచేస్తాయి. యువత వ్యసన పరులతో, విలాసవంతమైన జీవితం గడిపేవారితో స్నేహాలు తక్కువ చేయడం మంచిది. మన బంగారం మంచిదైతే సరిపోదు కంసాలి కూడా మంచివాడు కావాలి కదా! అన్నట్టు స్నేహాల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. లేదంటే రాబోవు పర్యవసానానికి బాధ్యులు మీరే అవుతారు.


కుంభం: వారికి  ఈవారం  అనుకున్న ఫలితాల విషయంలో కొంత తాత్కాలిక అభివృద్ధి గోచరిస్తున్నది.  అయితే  చేపట్టిన పనుల యందు నిదానం పనికి రాదు. బద్దకాన్ని విడనాడి పనులలో చురుకుదనం ఉంటే చాకచక్యంగా కార్యక్రమాలు పూర్తి అయ్యి అభివృద్ధి కానవస్తుంది. కుటుంబ పరంగా కూడా చిన్న పాటి మాట పట్టింపులు, తగాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తతో పాటు  మాట విషయంలో లోపం ఉండకుండా జాగ్రత్త వహించండి. ఎటువంటి సంధర్బంలో అయిన మాట తూలితే కుటుంబ సఖ్యత దెబ్బతింటుంది. అప్రమత్తతోమెలగండి. ఉద్యోగస్తులకు కొంత వృధా ప్రయాస, అనుకోని టెన్సన్స్ ఉంటాయి. యధావిధిగా మీ పనులను చేసుకోవడం  మంచిది. కొత్త కొత్త  ప్రణాళికలకు, మార్పులకు, ఇది అంత అనుకూలమైన సమయం కాదు. లేనిపోని ఆందోళనలను పెంచుకోవద్దు.  గ్రహ గతులు అనుకూలంగా లేనందున కొంత ఫలితములు ఆలస్యంగా గోచరిస్తున్నాయి. అంతే కానీ మానసిక ధైర్యం కోల్పోవద్దు. మీ యొక్క మాటకారి తనం వలన శత్రువర్గం ఉన్నట్లైతే మిమ్మల్ని చెడుగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి.

కార్యదక్షతతో ముందుకు సాగండి. విజయాలు వెన్నంటే వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత తక్కువ జీతంతో తాత్కాలిక ఉద్యోగం అయినా లభించే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన దానిని వదులు కోకండి. ముందు ఒక్క అడుగు అంటూ పడితే దానంతట పది అడుగులు పడతాయి. అభివృద్ధి తొందరలోనే ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి దగ్గరదాకా వచ్చి సంబంధాలు కుదరకపోవడం, రెస్పాండ్  లేకపోవడం వంటివి జరుగవచ్చు. ప్రయత్న లోపం లేకుండా  చేయండి. శనికి తైలాభిషేకం చేయించండి. అనుకున్న ఫలితాలు సకాలంలో పూర్తీ అయ్యే అవకాశాలున్నాయి . యువత కూడా కొంత ప్రయాణాలలో, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి.  వ్యసనముల  జోలికి వెళ్ళవద్దు. ఆధునిక పోకడకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గ్రహించండి. వ్యాపారస్తులకు కొంత ఊరటనిచ్చే కాలం అని చెప్పవచ్చు. మరీ ఉన్నతంగా కాకుండా మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి  సలహాలు, సంప్రదింపులు లాభిస్తాయి. బాగస్వామ్య వ్యాపారస్తులు అన్నీ దగ్గర ఉండి చూసుకోవడం మంచిదని సూచన. అతిగా ఎవర్నీ నమ్మవద్దు.


మీనం: వారికి ఈవారం అన్ని విధముల బాగుంటుంది. కుటుంబ పరంగా, బంధువర్గంలో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. మిమ్మల్ని పట్టించుకోని వారు,  ఒకప్పుడు తక్కువగా  చూసేవారు కూడా మీ సహాయం కొరకు లేక మీ అభివృద్ధి చూసి మీకు విలువను ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఏది ఏమైతేనేం ఒక స్థాయికి వచ్చాం అనే ఆనందం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో మార్పులకు ఇది అంత మంచి సమయం  కాదు.  అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సాఫ్ట్ వేర్ రంగమునకు, టెక్నీకల్ రంగానికి వెళ్లే వారికి మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి వృద్ధి చేయాలనే వారికి, నూతన గృహ తీసుకోవాలి అనుకునే  వారికి  మంచి అనుకూలము సమయం. అయితే కొద్దిపాటి శ్రమ తప్పదు. సంతాన పరంగా అభివృద్ధి  బాగుంటుంది. వారి అభివృద్ధి మీకు సంతృప్తిని కలగచేస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో జరిగే సంఘటనలు ఇతరులపై అసహనాన్ని ప్రదర్శించకండి. మీపై ఉన్న మంచి అభిప్రాయం పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఆర్ధిక పరంగా రాబడి ఎంతున్నా ఇంకా అభివృద్ధి లేదనే భావన కలిగి ఉంటారు. మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నా కలిసిరాని సమయం అని సరిపెట్టుకోవలసి వస్తుంది. ఆర్ధిక పరంగా ఖర్చులు అధికమవుతాయి. అయితే మీరు దీనిని పట్టించుకోక పోయినప్పటికీ మీ కుటుంబ సభ్యులకు కొంత ఆందోళన కరంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలతో వివాహాది శుభకార్యాలను జరిపించుకోవడం మంచిది. ఆడంబరాలకు పొతే మొదటికే మోసం అన్న చందనం వర్తిస్తుంది. మీ స్థితిని మెరుగు పరుచుకోవడానికి పరుగులు పెట్టె క్రమంలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి . ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న పాటి జ్వరం వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విషయ వ్యవహారాలలో క్రమశిక్షణ పాటిస్తే కొంత వరకు ఇబ్బంది కరమైన వాతావరణం ఉండదు. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితములు ఉండే సమయం. మంచి ఉత్తీర్ణత సాధిస్తారు.  మంచి చెడు గ్రహిస్తే మునుముందు మంచి ఫలితాలు మీ కైవసం అవుతాయి. అలసత్వం దరిచేరనియ్యకండి.


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121