వార ఫలాలు 10-03-2024 నుండి 16-03-2024 వరకు

వార ఫలాలు 10-03-2024 నుండి 16-03-2024 వరకు

మేషం: వారికి ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు గోచరిస్తున్నాయి. రుణాలు తీసుకోవడం, ఇవ్వడం రెండూ కలిసిరావు. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఖర్చుల విషయంలో జాగర్త వహించాలి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. మీ ఎదుగుదల అభివృద్ధి కొందరికి కంటకంగా మారుతుంది. సినీ కల రంగం వారికీ ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు. గృహనిర్మాణ పనులలో అవరోధాలు ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు చాలా అవసరం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం లభిస్తుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. మీరు ప్రయత్నం చేస్తున్న అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది.  సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. 

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు, మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రతి విషయంలో ఎదుటివారిని అంచనా వేయడంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని చాలా మంది అనుకుంటారు‌ చేస్తారు. అదేవిధంగా కార్యాలయంలో మీ సహా ఉద్యోగులకు  సహాయం చేయగలుగుతారు. ప్రతి కోణంలోనూ మీకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఏమీ ఇబ్బందపడాల్సిన అవసరం లేదు. వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. పిల్లల విషయంలో మీరు పెట్టుకున్న ఆశలు నూటికి ఎనబై శాతం అనుకూలిస్తాయి. ఏది ఏమైన సంతాన సంబంధ విషయంలో బాగుంది చెప్పవచ్చు.


వృషభం: వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా నూతన అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తోంది.  ఉద్యోగంలో ప్రొమోషన్స్ వస్తుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవదర్శనాలు చేయనుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా మారతాయి. వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో తోటి ఉద్యోగుల ప్రవర్తన ఇబ్బందులకు గురిచేస్తుంది. బ్యూటీ పార్లర్, అలంకార సామాగ్రి అమ్మే వారికి, టీవీలలో, సినిమాలలో ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. 

వ్యాపార రంగంలో వారికి వ్యాపార పురోగతి బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులకు  కాలం చాలా అనుకూలంగా ఉంటుంది.  జీవితంలో పైకి రావాలనుకున్న మీ ఆశయం నెరవేరుతుంది. వ్యాపారం మంచిదిశలో నడుస్తుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. రావాల్సిన ధనం చేతికందుతుంది,  దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ రంగాలలో వారికీ ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు సభలలో, సమావేశాలలో పాల్గొంటారు. రాజకీయంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆదరణ పెరుగుతుంది.


మిథునం: వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాదాల నుండి బయటపడతారు. అప్రయత్న కార్యసిద్ధిని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు.  వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అయితే  చేపట్టిన కొన్ని పనులు కొంత మందకొడిగా సాగుతాయి. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి.  వృత్తి ఉద్యోగాలలో మీ స్థాయి, స్థానం పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దానికంటే బాగుండడం ఒకింత మీ సంతోషానికి కారణం అవుతుంది. వ్యాపార విస్తరణకు  చేసే ప్రయత్నాలు ఈవారం  వాయిదా వేయడం మంచిది. నూతన బుణాలు విషయంలో జాగర్తలు తీసుకోండి. కుటుంబంలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. చేతిలో ఉన్న డబ్బుల్ని భూమి మీద పెట్టుబడి పెడతారు. 

ఇంట్లోవాళ్ళు బంగారం మీద పెట్టుబడి పెట్టమని ఒత్తిడి తెచ్చినా, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, అని భూమి మీదనే పెట్టుబడి పెడతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మీ మీద ఉన్న బాధ్యతలను నెరవేర్చుకో గలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతికోణంలోనూ మిమ్మల్ని మీరు హైప్‌ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ శక్తి సామర్ధ్యాలు  అందరికీ తెలిసేవిధంగా మీరు కష్టపడి తెలియజేస్తారు. ఎందుకంటే మన బయోడేటా ఏంటో, మన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో ఎవరూ చెప్పనప్పుడు మనమే చెప్పుకోవాలని మీరు భావిస్తారు, ఆ విధంగా చేసి అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో వున్నవారు  మీరు అనుకున్నటువంటి వాలంటిరి రిటైర్‌మెంట్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోవాలా ? వద్దా? అని ఆలోచన చేస్తారు. అయితే ఇలాంటి విషయంలో అన్ని అలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో వున్నవారికి నామినేటేడ్‌ పోస్ట్‌ లభిస్తుంది. ప్రజల యొక్క ఆధరణ, మరిచిపోలేని విధంగా ఉందని భావిస్తారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు.


కర్కాటకం: వారికి అన్ని విధాలా కొంత జాగ్రత్త వహించవలసిన సమయం గా చెప్పవచ్చు. ఆర్ధిక పరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశములు వున్నాయి . ఋణములు, లోన్లు వంటి వాటి  విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఉండవచ్చు. నిర్ణయాలను నిదానంగా ఆలోచించి తీసుకోవాలి. కుటుంబ పరంగా  జీవిత భాగస్వామితో  స్వల్ప విరోధములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. కొన్ని శుభకార్యాల బాధ్యత మీదే అవుతుంది. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, రియల్ ఈస్టేట్, గృహనిర్మాణ సామాగ్రి వ్యాపారం ఇవన్నీ కూడా మీకు కలిసొచ్చే విధంగా ఉంటుంది ఈ వారం.

వ్యాపారస్తులకు వ్యవహారముల విషయంలో చిక్కులు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించండి. ముఖ్యమైన డాకుమెంట్స్ విషయంలో జాగర్తలు తీసుకోవాలి. మీ వుండే  టెన్షన్లలో  ఎదుటి వారిని ఇబ్బంది పెట్టె మాటలు మాట్లాడడం మంచిది కాదు. దాని వలన కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి. మీ యొక్క శక్తి సామర్ధాలతో ముందు పదంలో వుంటారు. సాఫ్ట్ వేర్ రంగం వారికి గడ్డు కలం నడుస్తోంది. ఉద్యోగ లో జాగర్తలు తీసుకోవాలి. అనుకున్న సమయానికి ఉద్యోగ రాక నిరాశ చెందుతారు.


సింహం: వారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. బంధు మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. చర్చలు ఫలిస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల ఫలిస్తాయి . జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. భగవంతుని దయవల్ల ఆత్మీయ వర్గంలో అసమర్భులు ఉండవచ్చుకానీ నమ్మక ద్రోహులు ఉండరు. సన్నిహిత సహచర వర్గానికి, సహోదర వర్గానికి మీరు గోప్యంగా సహాయం చేస్తారు. రాజకీయ రంగం మీద మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది, మీరు ఊహించిందే జరుగుతుంది కానీ వేరేది జరుగదు. ప్రతి విషయంలో ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా జాగర్తలు తీసుకోవాలి. 

జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోవాలి, స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి లాభనష్టాలు, కోర్టుతీర్చులు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్తులకు కొంత వ్యయ ప్రయాసలు పడినప్పటికీ ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. శత్రువర్గం నుండి ఏదైనా సమస్యలు ఉన్నట్లైతే కొంత సానుకూలత ఏర్పడే అవకాశములు గోచరిస్తున్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. సంతానం విషయంలో మంచి నిరయములు తీసుకోవడం, వారి అభివృద్ధి  మీ  సంతోషానికి కారణమవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి మంచి ఫలితాలుండే అవకాశాలు గోచరిస్తున్నాయి.  అయితే ప్రయాణములు విషయంలో జాగ్రత్త  వహించడం మంచిది. కొంత అలసటకు గురి అవుతారు.  వివాహ విషయ వ్యవహారాలలో  చేసే ప్రయత్నములు  అనుకూలమైన ఫలితాలనిస్తాయి.   కుటుంబ శుభ కార్యముల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ఏది ఏమైనప్పటికీ మీ ఆలోచనలు వేగంగా ఉంటాయి.


కన్య: వారికి అప్రయత్న కార్యసిద్ధి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహా నిర్మాణ ఆలోచనలు కలిని వస్తాయి. మీ ఊహలు నిజమవుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. బుణ బాధలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. బంధుమిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. అనాలోచిత ఖర్చులు ఉంటాయి. స్నేహితుల విషయంలో, కొత్తగా పరిచయమైన స్నేహాలు విషయంలో జాగ్రత్త వహించండి. హామీలు, సంతకాలు వంటివి చేయవద్దు. ఉద్యోగస్తులకు వ్యయ ప్రయాసలు తప్పవు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిషత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. మొదలు పెట్టిన పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మధ్యలో ఆటంకాలు వున్నాయి మీ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి. 

వ్యాపారస్తులకు ఈవారం వ్యాపారం బాగుంది అని చెప్పవచ్చు. చేపట్టిన పనులు కొంత మేర పూర్తవుతాయి.  భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.  పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శుభకార్యాలను పూర్తి చేస్తారు. మీ స్థాయిని, మీ సత్తాని నిరూపించుకుంటారు. సంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. రియల్‌ ఎస్టేట్,  కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే చేసిన పనికి బిల్లులు వెంటనే రావు. అప్పు చేయాల్సి వస్తుంది. వచ్చిన డబ్బు కన్స్ట్రక్షన్ కి మిగిలిన డబ్బులు వడ్డీలకు సరిపోతాయి. ఏం చేయాలి ? పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము రూపాయి చేతిలో నిలవడం లేదు, దీనికి పరిష్కారం ఏమిటని పదే పదే ఆలోచిస్తారు. కాలమే పరిష్కారం చెబుతుందని మీ అంతరాత్మ చెబుతుంది. దాని గురించి మీరు పెద్దగా ఆందోళన పడకుండా మీ పని మీరు చేసుకుంటారు. ఇబ్బందిలేనటువంటి వాతావరణంలోసానుకూలమైన ఫలితాలను సాధించడానికి కష్టపడతారు, వారాంతంలో బాగుంది అని  చెప్పవచ్చు.


తుల: ఉద్యోగస్తులకు సానుకూలంగా వుంది అని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు , ట్రాన్స్ఫర్ కోసం చేసే  ప్రయ్నత్నాలకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. కొంత ఆశాంతి, అలసట చోటు చేసుకునే అవకాశములు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. ఏదైనా పని, వ్యవహారములకు వెళ్లే ముందు పెద్దవారి ఆశీస్సులు తీసుకుని వెళ్లడం మంచిది. వ్యాపారస్తులకు పలుకుబడి బాగుంటుంది. లాభాలతో పాటు పెట్టుబడులు కూడా ఎక్కువ పెట్టె అవకాశాలున్నాయి. జాగర్త వహించండి. అయితే అవసరముల మేరకు లోటు ఉండదు. అయితే శత్రువర్గం ఉన్నట్లైతే వారితో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది, ఎదో ఒకరకంగా ఇబ్బందులు ఉండే అవకాశములు ఉన్నాయి. 

అలాగే నూతన  ఉద్యోగ  ప్రయత్నాలు చేసే వారికి, విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ స్థానం చలనం కొరకు ఎదురు చూసే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. చిన్న విషయాన్నీ కూడా నిర్లక్ష్యం చేయకండి. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వివాహాది శుభకార్యాలు చేస్తారు, బంధు మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. కళారంగం వారికి, సాంకేతిక రంగం వారికి, టివి, సినిమా రంగాల వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు శ్రమకు తగిన పదవులు అందకపోవచ్చు. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించండి, వారం చివరిలో  కృషి ఫలించే అవకాశాలు వున్నాయి. విద్యార్థిని విద్యార్థులు కృషితో, పట్టుదలతో ముందుకు సాగండి మంచి ఫలితాలుంటాయి.


వృశ్చికం: వారికి ఈవారం కొంత ప్రతికూలమైన  పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు  పని భారం  పెరిగే అవకాశాలు ఉన్నాయి.  పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే  ఆదాయంలో పెద్దగా మార్పులేకపోవడం వలన కొంత అసహనానికి గురి అవుతారు. వ్యాపారస్తులకు కొంత ఆర్ధిక పరమైన నష్టం సూచిస్తోంది. చంచలత్వమైన నిర్ణయాలు తీసుకోకండి. ఆ నిర్ణయాలే మీ ఉన్నతికి ఆటంకాలు ఏర్పరుస్తాయి. కావున ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకూలమైన ఫలితాలు కొంత ఆలస్యంగా అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల విషయంలో వాయిదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సొంత వారే విరోధులుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి.

విద్యార్థిని విద్యార్థులకు  కష్టపడి చదుకోవడం చెప్పదగ్గ సూచన. విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం. విదేశాలలో ఉంటున్న వారికీ ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానీ వారికి వివాహ ప్రయత్నాలకు మంచి సమయం, గురుబలం బాగుంది కాబట్టి ఈ సంవత్సరంలో వివాహానికి మంచి సమయం అని చెప్పవచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి తప్పకుండా సానుకూల ఫలితాలు ఏర్పడుతాయి. రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. మీరు చేరాలని అనుకున్న గమ్యానికి అడుగులు పడతాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కష్టమైన పరిస్థితులు ఏర్పడిన ముందుకు సాగుతారు.


ధనస్సు: ఈ వారం  సర్వత్రా శుభ ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి.  ఉద్యోగ పరంగా ప్రమోషన్లు వంటివి కానీ అభివృద్ధి వంటివి అనుకూలమైన ఫలితములను ఇస్తాయి. వ్యవసాయ రంగం, కళారంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు  సాఫ్ట్ వేర్, టెక్నీకల్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. అనుకున్న అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారములు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నములు చేయు వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కార్యానుకూలత ఏర్పడుతుంది. అయితే ఎవరో అన్న మాటలు పట్టుకుని మానసిక ఆందోళనలకు గురి అవుతారు. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. 

కుటుంబంలో కంటే ప్రజాభిమానం పొందగలుగుతారు. సర్వ దుఃఖములు తగ్గినట్టుగా అనిపిస్తుంది. సంతోషం ఏర్పడుతుంది. ఆర్ధికంగా అనుకున్న ప్రకారం అభివృద్ధి ఏర్పడుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగర్త వహించండి. ఈ వారం రాజకీయ నాయకులు, అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. స్రీలతో ఏర్పడినటువంటి విభేదాలు సమసిపోతాయి. బంధువులలో బంధుత్వాన్ని కలుపు కోవడానికి మీరు చేసే యత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితి గోచరిస్తుంది. చాలాకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఈ వారం పరిష్కారమవుతాయి. వాక్‌చాతుర్యంతో కొంతమంది వ్యక్తులను మీరు ఆకట్టుకున్నా వాళ్ళద్వారా వచ్చే ప్రయోజనాలు నామమాత్రమే. ఏది ఏమైనప్పటికీ మీకు మీరుగా ప్రయత్నాలు చేసుకోవడం, ఆ దిశగా మీరు కష్టపడడం భవిష్యత్తులో మంచి పరిణామాలకు దారితీస్తుంది.


మకరం: వారికి ఆర్ధిక పరమైన లాభములు గోచరిసున్నాయి. కుటుంబ పరముగా సౌఖ్యం, వృద్ధి ఉంటుంది. అయితే బంధువర్గం లో కొద్దిపాటి తగాదాలు, మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. మనసులో తెలియని ఆందోళనలు టెన్సన్స్ వంటివి ఏర్పడతాయి. ఋణాలు, లోన్లు వంటి వాటి  విషయంలో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితములుంటాయి. చిన్న చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. మానసిక ప్రశాంతత కోల్పోకుండా జాగర్త వహించండి. విదేశీయానమునకు ప్రయత్నములు చేసే వారికి కూడా మంచి సమయం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి అన్ని విధముల బాగుంటుందని చెప్పవచ్చు,  ఎప్పటి నుండో ఉంది పోయిన స్థిరాస్తి తగాదాలు ఏమైనా ఉన్నవారికి ఇబ్బందులు తొలగి పోతాయి. అయితే నిర్లక్ష్యం, అశ్రద్ధ చేయకుండా కార్యసిద్ధి శ్రమించండి. వ్యాపారస్తులకు అనుకూలమైన  సమయం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి స్థిరాస్తి వృద్ధి అవుతుంది, అమ్మకాలు కంటే కొనుగోలు విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అన్ని పత్రాలు జాగర్తగా చూసుకుని ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు మాత్రం కొంత  అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు.  బయట జరిగే చికాకులకు ఇంట్లో కుటుంబం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. 

ఆర్ధిక  ఇబ్బందులు కంటే మానసిక ఆందోళనలు ఇబ్బంది పెట్టె అవకాశములు ఉన్నాయి. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని ఆందోళనలు  పెట్టుకోవద్డు. గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడిన దాని కంటే తక్కువ ఫలితాలుండే అవకాశములు గోచరిస్తున్నాయి. పట్టుదలతో ముందుకు సాగడం చెప్పదగ్గ సూచన. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. రాజకీయ కళా పారిశ్రామిక రంగాల వారికి సన్మాన సత్మారాలు పొందుతారు. శత్రువులు,  మిత్రులుగా మారి మాట సహాయం అందిస్తారు. విందు,వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాలలో నడుస్తాయి. సంతాన విద్యా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొంతమంది వ్యక్తులతో కొంతకాలం సర్దుకుపోవాలని తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించుకుంటారు. ఇబ్బందిలేని సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ కొద్దో గొప్పో ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యమైన విషయాలలో ఎవరితో రాజీపడకుండా మీరు కష్టపడతారు. ఎదుటివాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా, సమాజం విమర్శించని విధంగా మీ నిర్ణయాలు ఉంటాయి. శుభకార్యాల విషయంలో పురోగతి బాగుంటుంది.


కుంభం: వారికి రాబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. బుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. జీవిత భాగస్వామి నుండి ధన, ఆస్తి లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. గృహం, వాహనాలు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. బుణ వత్తిడిలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరి మాటలు వివాదానికి దారితీస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఎంతోకాలంగా ప్రయత్నం చేస్తున్న శుభకార్యాలు ఈ వారం ముడిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలు బలపడతాయి.  ఉద్యోగ ప్రయత్నాలు చేసే నిరుద్యోగలు శుభవార్తలు అందుకుంటారు. కీలక నిర్ణయాలలో తొందరపడి కాకుండా, బాగా ఆలోచించి, కొంత సమయం వెచ్చించి నిర్ణయం తీసుకుని అమలు చేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇతరులపై వెంటనే ఓ నిర్ణయానికి రావడం అంత శ్రేయస్మరం కాదు. సన్నిహితులతో, మీకు అనుకూలమైన వ్యక్తుల మధ్య మీరు అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులను బంధుత్వంగా కలుపుకుంటారు. సహోదరసహోదరీ వర్గానికి ఆర్థికంగా సహాయం చేస్తారు, ఆ విషయాన్ని కుటుంబ సభ్యుల గోప్యంగా ఉంచుతారు. 


మీనం: వారికి ఆర్థికపరమైన లావాదేవీలు నిరాశకు గురి చేస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాలలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ పర్యటనలు లాభిస్తాయి. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలం సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. గృహంలో సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. అప్రయత్నం కొన్ని పనులు పూర్తి అవుతాయి. దైవం వెన్నంటి ఉన్నట్లుగా భావిస్తారు. ప్రతి విషయంలో మీకుంటూ ఒక ప్రత్యేకతను సాధించుకునేందుకు మీరు పడే కష్టం ఫలిస్తుంది.  కొంతమందికి వైద్యవృత్తిలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు ఫోకస్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు, అవి ఫలిస్తాయి. 

మీరు చేస్తున్నటువంటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో చెప్పుకోదగిన స్థాయిలో ప్రయోజనాలు కలుగవు. కొంతకాలం వేచి ఉండాలని భావిస్తారు. మీ మాట విని పొలాలు, స్థలాలు అమ్మకుండగా ఇంకా మంచి రేటు వస్తుందని దురాశతో వేచి ఉన్నటువంటి మీ సన్నిహిత వ్యాపారస్థులకి నష్టం వస్తుంది. మీ మాట వింటే బాగుందేది అని బావిస్తారు. ఏ కోణంలో చూసినా కానీ మీకు ఎదురు లేనటువంటి విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి, ప్రస్తుతం ఏలిననాటి శని నడుస్తున్న కారణం చేత పనులు కొంత ఆలస్యం అవుతాయి. మీ జీవితభాగస్వామి చెప్పిన విధంగా కార్యక్రమాలు చేయగలుగుతారు. అందరిని మెప్పించగలుగుతారు. శుభకార్యాలు బాగాచేశారని, పెళ్ళిలో వడ్డించిన పదార్థాలు బాగున్నాయని, మర్యాదలు బాగున్నాయని అనుకోవడం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. సంతానం విషయంలో ఎలాంటి దిగులు లేకపోయినా, మనం అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయాలని ధనాదాయం మీద దృష్టి పెడతారు.


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121