వార ఫలాలు 24-03-2024 నుండి 30-03-2024 వరకు

వార ఫలాలు 24-03-2024 నుండి 30-03-2024 వరకు

మేషం: వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభపడతారు.సంతాన పురోగతి జాగ్రత్తలు తీసుకుంటారు. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. కాంట్రాక్టులు, లీజులు ఎక్స్టెన్షన్ అవుతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కలిసివస్తాయి.


వృషభం: వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సంపాదన, జీవితభాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్థి, ధనం సంపాదిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కొంత అశాంతి ఏర్పడుతుంది.విద్యారంగంలో కృషి చేసే వారికి ఆ రంగంలోనే ఉద్యోగం వస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది. అంతేకాకుండా కళా, సాహిత్యరంగాలలో, క్రీడా రంగాలలో ఉన్న కుళ్ళు రాజకీయాలను అధిగమించి, మీకు రావలసిన గుర్తింపును మీరు పొంద గలుగుతారు.


మిథునం: వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఈ వారం సఫలీకృతం అవుతాయి.వివాహం విషయంలో మంచి సంబంధం కుదిరింది..సుబ్రమణ్య స్వామి స్తోత్రం ఎక్కువగా పఠించండి. ఉద్యోగ మీ స్థాయిని, స్థానాన్ని పెంచుకోవడానికి మీరు పడుతున్న కృషని, చేస్తున్న శ్రమను అందరూ మెచ్చుకుంటారు. అలాగే పేరుప్రఖ్యాతులు సాధంచగలుగుతారు. అవసరానికి మించి ధనం ఖర్చుచేయకండి. ఆరోగ్య పరంగా కీళ్ళనొప్పులు, ఎలర్జీ సమస్యలు కొద్దికాలం ఇబ్బంది పెడతాయి.


కర్కాటకం: వారికి ఈ వారం ఆర్ధికపరమైన పురోగతి బాగుంటుంది. స్థిరచరాస్తులు వృద్ధి చేస్తారు. పట్టుదలతో కృషిచేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మీరేంటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తిఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం కొంతకాలం చేయవలసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి.


సింహం: వారికి ఈవారం చాలా అనుకూలంగా ఉంది. పోటీ ప్రపంచంలో ఎక్కడ కూడా అవకాశాలు లేనిచోట కూడా మీరు అవకాశాలు సృష్టించుకుని మీరు సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ఓ కొలిక్కి వస్తాయి . కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం ద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. విదేశీ సంబందించిన వ్యాపారాలు, గ్రీన్‌కార్డు మొదలైనవి సానుకూలపడతాయి. మీ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వల్ల విమర్శలు చోటుచేసుకుంటాయి.


కన్య: వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నూతన పరిశ్రమను స్థాపించడానికి అనుమతి పత్రాలు లభిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయ వ్యవహారాలలో చాలా తీవ్రమైన మానసికమైన అశాంతి, బాధ కలుగుతుంది. వైవాహిక జీవితానికి సంబంధించి దోష నివారణ చేయించుకున్న తర్వాత వివాహం మంచి ఫలితాలను పొందగలుగుతారు , విదేశీయాన సంబంధ విషయాలు, అక్కడ ఉద్యోగం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌ పరంగా రావల్సిన బిల్లులు ఆలస్యం అవుతాయి.


తుల: వారికి ఈ వారం మానసికమైన ఆందోళన తగ్గిపోతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. ప్రతి విషయంలో కూడాను మీ ప్రతిభను రుజువు చేసుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. మానసికమైన ధైర్యంతో, మానసిక ఉత్సాహంతో, మీకు రావలసిన ధనం చేతికి రాకుండా ఇరుక్కు పోయి ఇబ్బందిపడే పరిస్థితి గోచరిస్తుంది. నూతన భాగస్వాములతో కలిసి వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రేమ వివాహాలు విషయంలో జాగర్తలు తీసుకోవాలి.


వృశ్చికం: వారికి ఈవారం అనుకూలంగా ఉంది. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, తక్కువ వ్యవధిలో సాగే వ్యాపారాలు చేసి లాభపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వారు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. దీర్హకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు.


ధనస్సు: వారికి ఈ వారం సరైన సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, పోటీపరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. అనుకున్న సమయానికి కాస్త అటు ఇటుగా చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితభాగస్వామితో ఉన్న కలహాలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు అనూకూలపడతాయి.


మకరం: ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్మరించుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు కూడా కాలం బాగుంది. స్థిరాస్తి ఒప్పందాలు ఓ కొలిక్కి వస్తాయి. బుణ ఒత్తిడిలు తలకు మించిన భారంగా పరిణమిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది, దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విందులు, వినోదాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆరోగ్య పరంగా జాగర్తలు తీసుకోవాలి.


కుంభం: వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. ఎంతో కాలంగా మీరు కలలు కన్నా విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందివస్తాయి.ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. అధికారులతో, పెద్దలతో ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, సినీ, టీ.వీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు వస్తాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుంది.


మీనం: వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. దీర్హకాలిక రుణాల నుండి విముక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా

గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోయి, మంచి సంబంధం కుదురుతుంది, శుభకార్యాలు ఘనంగా చేస్తారు,వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయికాంట్రాక్టులు, రాజకీయ సభలు, సమావేశాలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలుగుతారు.


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121