వార ఫలాలు 31-03-2024 నుండి 06-04-2024 వరకు

వార ఫలాలు 31-03-2024 నుండి 06-04-2024 వరకు

మేషం: వారికి ఈ వారం ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. స్థిరాస్థులు కొనుగోలు చేస్తారు. గతంలో కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. విద్యాసంబంధమైన విషయాలకు అధికంగా ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. వాహనయోగం, గృహయోగం అనుకూలపడతాయి. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. బరువు బాధ్యతలు తీర్చుకోగలిగామని సంతృప్తి కలుగుతుంది. స్నేహితులు, బంధువులలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు.


వృషభం: వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు సంబందించిన విషయాలు సానుకూలపడతాయి.సంతానాన్ని అతిగారాబం చేయడం వల్ల ఏర్పడిన పరిస్థితులు మీకు ఆగ్రహం తెప్పిస్తాయి. సంతాన విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారు.ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణమవు తుంది. విద్యాసంస్థలకు సంబంధించిన విషయాలు, సినిమారంగాల వారికి అన్నివిధాలా కష్టకాలం.స్నేహం బంధుత్వంగా మారే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి.


మిథునం: వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలలో అఖండకీర్తి లభిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. స్త్రీలతో వివాదస్పద అంశాల సర్దుబాటుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. చేతివృత్తి పనివారికి హోల్‌సేల్‌ వ్యాపారం చేసేవారికి, నిర్మాణరంగ పనులు చేసేవారికి కాలం కొద్దిపాటి అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో బదిలీ మీ అభిష్టానికి వ్యతిరేకంగా జరుగదు. ముఖ్యమైన బాధ్యతలను స్వీకరిస్తారు. వివాహం కానీ వారికి వివాహం కుదురుతుంది.ఇష్ట దైవారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.


కర్కాటకం: వారికి ఈ వారం ముఖ్యమైన విషయాలు ముడిపడతాయి. ఆర్థికపరిస్థితి బాగుంటుంది. ఉద్యోగపరంగా స్థిరత్వం వస్తుంది. కుటుంబ విషయాలు, సంతాన విషయాలు బాగున్నాయి. విద్యాసంబంధమైన విషయాలు ఒక దారికి వస్తాయి. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. అవివాహితులైన వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం జరుగుతుంది. సహోదరసహోదరీ వర్గంతో నిష్కారణ విభేదాలు ఏర్పడతాయి. శాస్త్ర సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు. స్త్రీల సహాయసహకారాలు లభిస్తాయి. భూమి సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. ఎక్కువమంది సలహాలు తీసుకోరు. విదేశాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. క్రీడారంగంలో ఉన్న వారికి అవార్డులు లభిస్తాయి.


సింహం: వారికి ఈవారం సంతృప్తికరంగా ఉంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త మంచిది కాదు. చదివిన చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ వస్తుంది. గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం గ్రీన్‌కార్డు తప్పక లభిస్తుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక సహాయం అందుతుంది. వాతావరణ పరిస్థితుల వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. విద్యార్థినీవిద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. మొండి దైర్యంతో మీ పని మీరు చేసుకుపోతారు.


కన్య: వారికి ఈ వారం ఆర్థిక సంబంధిత విషయాలలో పురోగతి బాగుంటుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితులు, సన్నిహితులు ప్రతి విషయంలో అండగా ఉంటారు. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద సజావుగానే సాగుతుంది. సంతాన పురోగతికి కష్టపడతారు. వివాహాది శుభకార్యాలు చేస్తారు. సువర్ణలాభం, భూలాభం కలుగుతుంది. బలగం, రాజకీయ పలుకుబడి ఉపయోగపడతాయి. మీ గుడ్‌విల్‌ మిమ్మల్ని కాపాడుతుంది. న్యాయస్థానాలలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి.మాతృవర్గం వైపు బంధువులకు సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.


తుల: వారికి ఈ వారం ఆర్థిక సంబంధమైన విషయాలు కలిసి వస్తాయి. బంధువులతో ఉన్న విభేదాలను పరిష్కరించి ఒక శుభకార్యం జరగడానికి మీరు కారకులు అవుతారు.పెరుగుతున్న ధరలు, అవసరాలు, సామాజిక అంశాలు ఆలోచింపజేస్తాయి. కఠినమైన బాధ్యతలు కూడా విజయవంతంగా నిర్వహిస్తారు. పొదుపు పథకాలను ప్రారంభిస్తారు. ధనాన్ని ఆచితూచి ఖర్చుపెడతారు.సహోదర, సహోదరీ వర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు. విదేశీ వస్తువులు అమితంగ ఆకర్పిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులు మంచి ఉద్యోగం సాధిస్తారు. విలువైన కాలాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు.


వృశ్చికం: వారికి ఈవారం ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో మరో కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. దైవానుగ్రహం చాలా విషయాలలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. కళాసాంస్కృతిక రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వివావాలు ప్రధాన చర్చనీయాంశాలవుతాయి. జీవితంలో కొంతమంది వ్యక్తులు దూరమవుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారపరంగా వచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గ్రీన్‌కార్డు, h1b కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన సందర్భాలలో మీ జీవితభాగస్వామి సలహాలు పెడచెవిని పెట్టి ఇతరుల మాటకు విలువ ఇస్తారు. మీకు సంబంధంలేని సమస్యలలో చిక్కుకుంటారు.


ధనస్సు: వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అధికారంలో ఉన్న స్రీలకు మంచి అడ్మినిస్టేటర్‌గా పేరు వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మందికి ఉద్యోగపరంగా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయరంగంలో రాణిస్తారు. ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌ సంస్థలపరంగా రావాల్సిన ధనం అతికష్టం మీద చేతికి వస్తుంది. రహస్యంగా కొంతమందికి ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్రశాంతంగా జరుగుతున్న మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కొన్ని మార్పులకు దారితీస్తుంది.సంతాన సంబంధమైన విషయాలు బాగున్నప్పటికీ వాళ్ళు చేస్తున్న పనుల మీద దృష్టి పెట్టడం, ఉద్యోగపరంగా పదోన్నతులు పొందుతారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం విషయమై అధిక శ్రద్ధ అవసరమవుతుంది.


మకరం: వారికి ఈ వారం అనేక బరువుబాధ్యతలను మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరిస్థితి బాగుంటుంది. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. మీరు కోరుకున్న సీటు లభిస్తుంది. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్వగృహం కోణాలనే మీ కల నెరవేరుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. కుటుంబానికి బరువు కారాదని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ పేరుమీద ఉన్న స్తిరాస్తుల విలువ పెరుగుతుంది. దాంతోపాటు మీ విలువ పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. భాగస్వామి వ్యాపారాలు కలసివస్తాయి.రాజకీయ రంగంలో ఓర్పు సహనం చాల అవసరం.


కుంభం: వారికి ఈ వారం ఆర్థికపురోగతి బాగుంటుంది. స్వయం సంపాదన కొండంత అండగా నిలుస్తుంది. యోగా, మెడిటేషన్‌ వల్ల లాభపడతారు. ఆప్యాయతలకు, అన్యోన్యతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. చాలా విషయాలలో ఓర్పు, సహనం కనబరుస్తారు.శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. వివాహం జరుగుతుంది. మీరు వేసే ప్రతి అడుగు అభివృద్ధికి సోపానం కావాలని చాలామంది కోరుకుంటారు.వీసా, పాస్‌పోర్టు వంటి అంశాలు అనుకూలిస్తాయి. గ్రీన్‌కార్డు కోసం చాలా టెన్షన్‌కు లోనవుతారు.ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తిప్రతిష్టలు గడిస్తారు.


మీనం: వారికి ఈ వారం సమాజంలో మీ న్థాయి, స్థానాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. చాలా సందర్భాలలో మానసిక సంతోషం కలుగుతుంది. మీ పేరు మీద జరిగే వ్యాపారవ్యవహారాలు లాభిస్తాయి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహ విషయంలో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు మానసిక వేదన కలుగుతుంది. సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. విద్యా సంబంధ విషయాలు, విదేశీయాన సంబంధ విషయాలు లభిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121