Dhanur Masam

Dhanur Masam

తిరుప్పావై పాశురము - 11 

 

ఓ గోపికామణీ! ఒకవైపు దూడలతో గూడియుండు ఆవుల బరువైన పోదుగులనుండి పాలుపితుకుతూ, మరోవైపు శత్రువుల బలాన్ని నశింపచేసే ధైర్యసాహసాలతో విలసిల్లుతూ, దోషరహితులైన యదువీరుల ఇంటిలో పుట్టిన బంగారుతీగవు నీవు ! పుట్టనుండి వెడలు పాముపడగవంటి జఘనభాగము కలిగిన అందాలభరణివే నీవు!

తిరుప్పావై పాశురము - 10

 

ఓ చెలీ! మంచి నోము నోచి స్వర్గసుఖాలు అనుభవించుచున్నదానా! తలుపు బిగించి పడుకొంటివేమే? తలుపు తీయవే? పోనీలే తలుపు తియ్యకున్నా ఫరవాలేదు. ఒక్క మాటైనా నోటితో పలుకరాదా! నీతోడి ఒక్కమాటకైనా మేము నోచుకోలేదా! కుంభకర్ణుడు నీతో ఓడిపోయి తన నిద్రను నీకిచ్చి వెళ్ళాడేమోకదా!

తిరుప్పావై పాశురము - 9

 

ఓ మామ కూతురా! నిదురలేవమ్మా! మాణిక్య భవనంలో మాణిక్య దీపాల వింతవింత కాంతుల్లో కమ్మని ధూపసువాసనలమధ్య సుతిమెత్తని పడకపై నిద్రిస్తున్నదానా! నిద్ర లేవరాదటే! మణిగాకిలి గడియ తియ్యరాదాటే! అత్తా! నీ బిడ్డను నీవైనా నిద్రలేపు. మా మాటలు వినబడినట్లులేదు. చెవిటిదా? ఏమి మాట్లాడటం లేదు మూగదా?

తిరుప్పావై పాశురము - 8

 

ఓ యువతీ! మేల్కొనవే! తూర్పున ఆకాశం తెల్లబడింది. పచ్చికబయళ్ళలో మంచుచే కప్పబడిన పచ్చికను మేస్తూ పశువులు స్వేచ్చగా తిరుగాడుతున్నాయి. స్వామివారిని దర్శించే కోరికతో నిన్ను లేపకుండానే వెళ్ళేవారిని దారిలోనే ఆపివుంచి నిన్ను పిలుచుటకై మేము వచ్చి నిలిచివున్నాము. శ్రీ కృష్ణుని సేవయందు ఆసక్తికల ఓ సుందరాంగీ మేలుకో! మేలుకొని మాతో కలిసి పూజకు రావలసినది. దాణూర ముష్టికులనే పేరుగల మల్లవీరులను మట్టుపెట్టి విలసిల్లు విష్ణుమూర్తిని

తిరుప్పావై పాశురము - 7

 

ఓ యువతీ! మాకు నాయకివై, నోము నోచు విషయం అంతా తెలిసీ ఇంకా నిద్రిస్తున్నావా? ఎంత విడ్డూరం! ఇంకా తెల్లవారనే లేదంటావా! భలేదానివే! అదిగో భరద్వాజ జంటపక్షులు రాత్రి అంతా కలిసివుండి ఆహారం కొరకు విడిపోతూ కీచుకీచుమని రోదచేయడం నీకు వినపడలేదా! పోనీలే, ఓ చిన్నదానా! గోపికలు వేకువనే లేచి పెరుగు చిలుకుట

తిరుప్పావై పాశురము - 6

 

ఓ చెలీ! ఇంకనూ నిద్రమత్తులో జోగుతున్నావా! లెమ్ము త్వరత్వరగా లెమ్ము. మేల్కొనుము. ఈ వేకువజామున పక్షిజాలమంతా కూతలు పెడుతూ తమ గూళ్ళను వదిలిపెట్టి పోతున్నాయి. ఈ ప్రశాంత సమయంలో గరుడవాహనుడైన శ్రీస్వామివారిని మ్కేల్కొల్పే ఆలయ శంఖద్వని నీ చెవులకు వినపడనే లేదా! ఓ చినదానా మేల్కొనుము.

తిరుప్పావై పాశురము - 5

 

మాయగాడై తిరుగుతూ ఉత్తరమధురను కాచునట్టి వాడూ, గోపికలతోగూడి యమునాతీరంలో విహరించేవాడూ, గోకులంలో జన్మించి తల్లి కడుపును పండించినవాడూ, అయిన గోపాలకృష్ణుని మనమందరం మంచి మనస్సుతో సమీపించి, దాసానుదాసులమై పూలతో పూజించుదాం. నోరారా గానంచేస్తూ భక్తిభావంతో ధ్యానిస్తే, ఇటు తటంలో చేసిన పాపాలూ,

తిరుప్పావై పాశురము 4

 

వర్షం కోసం మేఖునికి విన్నపం: ఓ వానదేవుడా! మేము చేయబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం. ఆ నీటిని నీవు సమృద్ధిగా కురిపించవలసింది. మరి నీళ్ళు నీక్కెక్కడివంటావా! సముద్రానికి వెళ్ళు. వెళ్ళి సముద్రంలోని నీళ్ళను గొంతువరకూ తృప్తిగా తాగి గర్జిస్తూ నింగికెగురు. విష్ణువు యొక్క నల్లని శరీరంవలె నీవునూ నల్లని ఛాయను పొందు. జలధిశాయి ధరించిన

తిరుప్పావై పాశురము - 3

 

మూడు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన పురుషోత్తముని నోరారా కీర్తిస్తూ సంకల్పం చెప్పుకొని, నోముపట్టి చన్నీట స్నానం చేస్తే శుభాలు కలుగుతాయి, పాపాలు తొలగుతాయి. రోగాలు, దుర్భిక్ష తస్కరాది భయాలు ఉండవు. దేశమంతా నెలకు మూడువానలు కురిసి పచ్చని పైర్లు ఏపుగా పెరిగి సమృద్ధిగా పండుతాయి.

గోదా కల్యాణం

సుమారు ఎనిమిదవ శతాబ్దపు కాలంలో శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో రంగనాథస్వామి దేవాలయం ప్రధాన అర్చకుడిగా ఉన్న విష్ణుచిత్తుడికి పూలతోటలో ఒక పసిపాప దొరికిందట. పిల్లలు లేని విష్ణుచిత్తుడు ఆ పసిపాపకు కోదై అనే పేరుతొ పిలుచుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కాలక్రమంలో కోదై గోదా అనే నామంగా వ్యవహారంలోకి వచ్చింది.

Showing 21 to 30 of 35 (4 Pages)