గ్రహాలు వాటి అనుగ్రహం పొందడానికి

గ్రహాలు వాటి అనుగ్రహం పొందడానికి


జాతక రీత్యా ఏ గ్రహం అనుగ్రహం కావాలో ఆగ్రహనికి ఎంతో భక్తి శ్రద్ధలతో దీపారాధన, అర్చన చేయడం ఉత్తమమైన పద్ధతి. 

ఇది దేవాలయంలో ఉండే నవగ్రహా మండపం లో చేయాలి,  వీలుకాని వారు ఏ దేవతాస్వరూపమునకు దీపారాధన చేస్తే ఏ గ్రహం అనుగ్రహం ఇస్తుందో  తాళపత్ర గ్రంధాలలో వివరించబడింది, 

సూర్యగ్రహ అనుగ్రహం కి శివాలయంలో లేదా మీ గృహంలో శివుని చిత్రపటం ముందు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన, సంపూర్ణ ఆరోగ్యం, సంగం లో గౌరవం, తండ్రి అనుకూలత, రాజకీయం, ప్రభుత్వ ఉద్యోగం, వంటి శుభ ఫలితాలు రవిగ్రహ అనుగ్రహం వలన కలుగుతాయి.


 చంద్ర గ్రహం అనుగ్రహానికి పార్వతి దేవి చిత్రపటం, లేదా లక్ష్మీదేవి ముందు దీపారాధనచేసి పంచ ఉపచార పూజ చేయడం వలన మనశ్శాంతి, మంచినిర్ణయాలు తీసుకోవడం, ఆందోళన లేకుండా ఉండుట, మాతృ సౌఖ్యం, వంటి శుభ ఫలితాలు కలుగుతాయి.కుజ గ్రహం అనుగ్రహానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నరసింహ స్వామి,  యొక్క చిత్రపటం ముందు దీపారాధన చేయడం ద్వారా అధిక కోపం తగ్గడం, శత్రువులు నసించుట, రుణ బాధలు తగ్గడం, బీపీ, మెదడులో రక్తం గడ్డ కట్టకుండా ఉండుట, పైల్స్ సమస్యలు లేకుండా ఉండుట వంటి పలితాలు కలుగును.


 బుధగ్రహ అనుగ్రహానికి మహావిష్ణువు ముందు గణపతి ముందు దీపారాధన చేసి పంచ ఉపచారా పూజ చేయడం వలన, జ్ఞాపకశక్తి పెరుగుతంది, విద్యలో అనుకూలతలు, వ్యాపార అభివృధి, మంచి తెలివితేటలు, కలగడం, బ్యాంక్ ఉద్యోగాలు, రావడం, వంటి శుభ ఫలితాలు కలుగుతాయి,గురు గ్రహం అనుగ్రహానికి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి యందు దీపారాధన చేసి పంచ ఉపచరా పూజ చేయడం వలన, ధనం అనుకూలత, పుత్ర సంతానం అభివృద్ధి, సంపూర్ణ దైవ అనుగ్రహం, ఉన్నత చదువులు, శకల శాస్త్ర ప్రావీణ్యం, వంటి శుభ ఫలితాలు కలుగును,

శుక్ర గ్రహం అనుగ్రహానికి లక్ష్మీదేవి లేదా లలిత గాయత్రీ దేవతల ముందు దీపారాధన చేయడం వలన, ఆర్ధిక సమస్యలు లేకుండా ఉండుట, భార్య భర్త మధ్య కలహాలు లేకుండా ఉండుట, నూతన వస్తు,ఆభరణాలు కొనుగోలు, వాహన సౌఖ్యం, వంటి శుభ ఫలితాలు కలుగును,


 శనిగ్రహం అనుగ్రహానికి పరమేశ్వరుడు,లేదా హనుమంతుడు,లేదా కాలభైరవ స్వామి చిత్రపటాల యందు దీపారాధన  చేసి అర్చన చేయడం వలన అనారోగ్య బాధలు, ఏలినాటి శని బాధలు, ఆకస్మిక ప్రమాదాలు నివారణ నివారణ అవుతాయి,రాహుగ్రహం అనుగ్రహానికి సరస్వతి దేవి, దుర్గా, కాలభైరవస్వామి, చిత్ర పటాల యందు దీపారాధన చేసి అర్చన చేయడం వలన, వ్యసనాలు తగ్గడం, పర ప్రయోగ బాధలు నివారణ అవడం, పితృ సంబంధ దోష తీవ్రత తగ్గడం, విష కీటకాల వలన ప్రమాదాలు తోలగడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి, 


కేతు గ్రహం అనుగ్రహానికి గణపతి,కాలభైరవ, చిత్రగుప్త, స్వామి చిత్రపటాలకు దీపారాధన చేసి  ఆరాధన చేయడం వలన పిచాచ బాధలు తొలగి,మనశ్శాంతి కలగడం, మంచి నడవడిక, పెద్దల యందు గౌరవం, భగవంతుడి ఆరాధన చేయాలి అనే ఆలోచన రావడం, తల్లి తండ్రి, యందు భక్తి,శ్రద్ధ లతో ఉండాలి అనే ఆలోచన రావడం, జాతకం లో మాతృ పరంపరాది దోష నివృత్తి, వంటి శుభ ఫలితాలు కలుగును..కాలసర్ప దోషం ఉన్నవారు ప్రతినిత్యం ఆవునెయ్యితో దీపం వెలిగించి రాహు కేతువులను స్తుతించండి, కాలసర్ప దోషం వల్ల కలిగే దుష్ఫలితాలు కొంతవరకు నివారణ అవుతాయి.

 ప్రతి రోజు సాయంత్రం మీ గృహంలో దీపారాధన చేసే శ్రీ మహా లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల కూడా మీ ఇంట భోగభాగ్యాలు కలుగుతాయి....