కార్తీకమాసం విశిష్టత

కార్తీకమాసం విశిష్టత

కార్తీకమాసం విశిష్టత  : 

ప్రాతఃకాల స్నానదానాదులతో - కార్తీక స్నానాలు ప్రారంభం♪.

 కార్తీకమాసం అత్యంత పవిత్రమైంది♪. ఈ మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం♪.

ఈ మాసంలో వచ్చే... ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి, పుణ్యఫలం చేకూరుతుంది♪.

 కార్తీక మాసం మొత్తం మీద - కార్తీక ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది♪. అందుకే ఈ రెండు తిథుల్లో, వైష్ణవ సంబంధమైన పూజలు ఎక్కువ చేస్తుంటారు♪. కార్తీకమాసం అంటేనే సాధారణంగా శివప్రధానమైన పూజలు నిర్వహించడం కనిపిస్తుంటే.. వీటితో పాటు జరిగే విష్ణుపూజలు.. మనకు శైవ, వైష్ణవ భేదాలు పాటించకూడదనే విషయాన్ని ప్రభోదిస్తాయి♪.

 కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశిని "ప్రబోధ ఏకదాశి" అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది♪. ఆషాఢ ఏకాదశి (శయనైకాదశి) నాడు శయనించిన స్వామి (యోగనిద్ర) నుంచి ఈ రోజు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి♪. అందుచేత,

ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద త్యజనిద్రాం జగత్పతే, త్వయిస్తుపే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్" 

 

 అనే ప్రబోధన మంత్రంతో ప్రార్థనచేసి, శ్రీమహావిష్ణువును అర్చించి, ఉపవసించాలి♪.

 ఈ రోజున భాగవతంలో "అంబరిషోపాఖ్యానం" చదివినా, విన్నా మేలు జరుగుతుంది♪.

 అలాగే, ఏకాదశి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని, క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి, క్షీరసాగరం నుంచి బయలుదేరి వచ్చి, తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో, ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు♪. ఆ కారణం చేతనే ఈ రోజున తులసి దగ్గర విశేష పూజలు జరుపుతుండటం ఆచారంగా వస్తోంది♪.

 ఈ ద్వాదశినే "మధన ద్వాదశి" అని కూడా అంటారు♪. దేవ దానవులు సముద్రాన్ని మధించింది.. కార్తీక శుద్ధ ద్వాదశి నాడని, దానికి గుర్తుగానే ఈ ద్వాదశిని జరుపుకోవడం ఆచారమైందని పెద్దలంటారు♪. ఈ రోజున కడలిలో శయనించిన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు, లక్ష్మీ, బ్రహ్మ లాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు♪.

 

 ఆ రోజున సూర్యాస్తమయం తర్వాత తులసిని, విష్ణువును పూజించి, దానాది కార్యక్రమాలు చేసే వారికి, కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం♪. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి♪.

 ఇంకా, కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా, ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది♪. అందుచేత,  కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసికోటను కూడా పూజించేవారికి, ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం♪.

ఇంకా, ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి♪.

❀┉┅━❀

Products related to this article

Karthika Masam Special 365 Wicks

Karthika Masam Special 365 Wicks

Karthika Masam Special 365 Wicks  Product Descoription:1). One 365 cotton wicks which is dipped in gingerly Oil.2). One Mud Diya 3). One tissue Paper...

$26.50

Rudrabhishekam (For 1 Month)

Rudrabhishekam (For 1 Month)

Rudrabhishekam (For 1 Month)Benefits: 1). Happiness at Home 2). Success in career and job 3). Harmony in relationship 4). Removes planetary dosh 5). Eliminates Financial problems Prasadam:Af..

$81.00