Panchakshari Mantra Significance and explanation

Panchakshari Mantra Significance and explanation

 

పంచాక్షరి మంత్రం ప్రాముఖ్యత?

 

శివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు '--శి-వా-' లో నుండి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలలో తెలియజేయడమైంది.

 

దిశ పేరు మండలం బీజాక్షరం నిర్వహణ

 

శివుని ఊర్ధ్వముఖం ఈశానం ఆకాశమండలం మోక్షం

శివుని పూర్వముఖం తత్పురుష వాయుమండలం విరక్తి

శివుని దక్షిణముఖం అఘోర అగ్నిమండలం సంహారం

శివుని ఉత్తరముఖం వామదేవ ఉడక మండలం వా పాలన

శివుని పశ్చిమ ముఖం సద్యోజాత భూమండలం శి సృష్టి

 

ఓంకారవదనే దేవీ ', '' కార భుజద్వయీ 'శి' కార దేహమధ్యాచ '', '' కార పదద్వయీ పంచాక్షరీ మంత్రానికి ముఖం వంటిది. ''కార, '' కారాలు బాహువులు, 'శి' కారం నడుము అయితే '', '' కారాలు పాదయుగ్మములు.

 

నమశ్శంభవే చ మయోభవేచ నమశ్శంకరాయ చ

మయస్కరాయ చ నమశ్శివాయ చ శివ తరాయచ

 

అంటూ నమకంలో శంభు - శంకర - శివ అంటూ మూడు దివ్యనామాలాతో, ఆ పరాత్పరుని కీర్తించాయి. శివ శబ్దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. 'శుభం, క్షేమం, శ్రేయం, మంగళం' అని కొన్ని అర్థాలు మరియు 'జాగ్రత్, స్వప్న, సుషుప్తి' అవస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తురీయతట్ట్వమే శివుడు. అదే శివతత్త్వం.

 

అన్నింటినీ ప్రకాశవంతం చేసే మూల చైతన్యమే శివుడు. వశి - శివ సమస్తాన్నీ తన వశంలో ఉంచుకున్న వాడే సర్వేశ్వరుడు, అతడే ఇచ్చా -జ్ఞాన-క్రియా శక్తులతో కూడిన పరమేశ్వరుడు, సర్వజగత్కారుడు, ఆ తత్త్వమే ఆయన పంచముఖాలలో గోచరిస్తూ ఉంటుంది

0 Comments To "Panchakshari Mantra Significance and explanation"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!