దిన ఫలాలు 02-04-2024

దిన ఫలాలు 02-04-2024

మేషం:  ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. అనుకోని వ్యక్తులు తారసపడతారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.


వృషభం: వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. స్వల్ప ధన లాభం.


మిథునం: రాబడి పెరుగుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతానం నాకు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. శుభవార్తలు.


కర్కాటకం: వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. దైవ చింతన కలిగి ఉంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.


సింహం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. రుణ వత్తిడులు తొలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


కన్య: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగులకు బదిలీలు వుంటాయి.


తుల: కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. శ్రమకు తగిన లాభం పొందుతారు. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి.


వృశ్చికం: నూతన ఆదాయం మార్గాలను అన్వేషిస్తారు. సాహసోపితమైన నిర్ణయాలు తీసుకుంటారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.


ధనస్సు:  నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయకండి. మొండి బాకీలు వసూలు అవుతాయి.


మకరం: నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి.


కుంభం: దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


మీనం: ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అనుకోని వ్యక్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. మీపై చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తులు అధికమవుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121