దిన ఫలాలు 03-12-2023

దిన ఫలాలు 03-12-2023

మేషం:  ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వాహన సౌఖ్యం.శుభ వార్తలను వింటారు. పెట్టుబడులకు అనుకూలం.


వృషభం: ప్రయాణాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. శుభ ఫలితాలను అందుకుంటారు.


మిథునం: ఆశించిన విధంగా ఫలితాలు వుండవు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.


కర్కాటకం: భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. రెట్టించిన ఉత్సాహంతో ఉంటారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు లాభాలు.


సింహం: కృషి ఫలిస్తుంది.సానుకూలమైన ఫలితాలను పొందుతారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం. అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభం.


కన్య: బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ముఖ్యమైన పనులో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఊహించిన ఫలితాలు అందకపొవచ్చు.


తుల: దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు.అన్నింటా మీదే విజయం అనేల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.


వృశ్చికం: వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


ధనస్సు:  ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి, వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. సంతానం చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.


మకరం: అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలు పొందుతారు. రుణాలు తీరుస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. సోదరుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది . వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విందు, వినోదాలు. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు చేస్తారు.


కుంభం: ఫలితాలు మీరు అనుకున్న విధంగా వస్తాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వస్తు లాభాలు.


మీనం: ఊహించిన ఫలితాలు తారుమారు అవుతాయి. కొంత నిరాశ ఏర్పడుతుంది.చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. తగాదాలకు దూరంగా వుండండి. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121