దిన ఫలాలు 04-02-2024

దిన ఫలాలు 04-02-2024

మేషం:  ఎంత కష్టించినా ఫలితం కష్టమే. నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం.


వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహన సౌఖ్యం.


మిథునం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. ప్రముఖుల కలయిక మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది.


కర్కాటకం: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు లభిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంటా బయట మంచి ఆహ్లదకరమయిన వాతావరణం.


సింహం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. నూతన వాహన కొనుగోలు సూచన.


కన్య: కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. భూతగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ఆహ్వానాలు.


తుల: ప్రయాణాలు లాభిస్తాయి. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు.


వృశ్చికం: బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.


ధనస్సు:  సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. శ్రమ అధికం. విలువైన వస్తు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


మకరం: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. రుణాలు తీరుతాయి. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు.


కుంభం: మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు, వినోదాలు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన సాంకేతిక విద్యావకాశాలు.


మీనం: గృహ, వాహన యోగాలు పొందుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి అతిముఖ్యమైన సమాచారం అందుతుంది. విందు, వినోదాలు.ప్రముఖులతో పరిచయాలు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121