దిన ఫలాలు 06-02-2024

దిన ఫలాలు 06-02-2024

మేషం:  పట్టువిడుపు ధోరణి మంచిది. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు.భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు సేకరణ.


వృషభం: వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.


మిథునం: ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విందు, వినోదాలు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.


కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.


సింహం: చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. తగాదాలు, కోపతాపాలకు దూరంగా వుండండి. క్రయవిక్రయాలలో జాగ్రత్తలు పాటించండి.శుభవార్తలు వింటారు.


కన్య: మానసిక ప్రశాంతత పొందుతారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. స్వల్ప ధనలాభం.


తుల: దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వస్తులాభం గోచరిస్తుంది.


వృశ్చికం: బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. స్వల్ప ధనలాభం.


ధనస్సు:  ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. సంతానం నకు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు.


మకరం: ఆనారోగ్య సమస్యల నుండి బయటపడతారు.ఉద్యోగులకు బదిలీలు వుంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు.


కుంభం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. రుణ వత్తిడులు తొలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


మీనం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121