దిన ఫలాలు 07-03-2024

దిన ఫలాలు 07-03-2024

మేషం:  వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు.


వృషభం: దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు లాభాలలో వుంటాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.


మిథునం: ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.


కర్కాటకం: ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. యత్న కార్యసిద్ధి.


సింహం: వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విద్యా, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి.


కన్య: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారించుకొంటారు.శ్రమకు తగిన ఫలితం దక్కదు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.


తుల: వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వస్తు లాభం.


వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలలో స్వల్ప ఒడిదుడుకులు. కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన అధిగమిస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు అందుకొంటారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు.


మకరం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సాంకేతిక విద్యావకాశాలు.


కుంభం: ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. పాతమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.


మీనం: బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి వివాదాలకు దూరంగా వుండండి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. వస్తు లాభం.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121