దిన ఫలాలు 08-03-2024

దిన ఫలాలు 08-03-2024

మేషం:  చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాల సందర్శన.


వృషభం: దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.


మిథునం: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. నూతన అలవాట్లు ఏర్పరుచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అర్జిస్తారు.


కర్కాటకం: దూర ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.


సింహం: రుణ వత్తిడుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. విందు, వినోదాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.


కన్య: దూర ప్రాంతాల నుండి సమాచారం ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది.


తుల: ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు.


వృశ్చికం: పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.


ధనస్సు:  కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.


మకరం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.


కుంభం: ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు.


మీనం: ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కోపతాపాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121