దిన ఫలాలు 09-03-2024

దిన ఫలాలు 09-03-2024

మేషం:  ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.మానసిక ప్రశాంతత పొందుతారు.


వృషభం: సంతానంనకు నూతన ప్రయత్నాలు అనుకులం. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు.


మిథునం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి.ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది.


కర్కాటకం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యుల నుండి సహాయం అందుతుంది.


సింహం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. ఉద్యోగులకు స్థానమార్పులు వుంటాయి. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.


కన్య: రాజకీయ, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. బంధువుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


తుల: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది.


వృశ్చికం: ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోటులను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది.


మకరం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహాకారాలు అందుతాయి.


కుంభం: పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.


మీనం: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వస్తు సేకరణ.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121