దిన ఫలాలు 10-01-2024

దిన ఫలాలు 10-01-2024

మేషం:  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానమునకు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. వాహనయోగం ప్రముఖుల కలయిక.


వృషభం: బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురై అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. నూతన వస్తు కొనుగోలు.


మిథునం: ఋణవత్తిడుల నుండి బయటపడతారు. ధన, వస్తు, లాభాలు. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు.


కర్కాటకం: శ్రమాధికం పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందుకుంటారు.


సింహం: పూర్వపూ మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు, వినోదాలు.


కన్య: ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు.


తుల: కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. స్వల్ప ధన వస్తు లాభాలు.


వృశ్చికం: కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప స్థానమార్పులు.


ధనస్సు:  కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.


మకరం: విందు, వినోధాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వాహనయోగం. వివాదాలు తీరుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తులాభం.


కుంభం: మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. చర్చలలో పాల్గొంటారు.


మీనం: అనుకోని పనులలో ప్రతి బంధకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందును.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121