దిన ఫలాలు 10-02-2024

దిన ఫలాలు 10-02-2024

మేషం:  ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహాకారాలు అందుతాయి.


వృషభం: సంఘంలో గౌరవం పొందుతారు. సంతానంనాకు నూతన ప్రయత్నాలు అనుకులం. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.


మిథునం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి.


కర్కాటకం: బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.


సింహం: భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. ఉద్యోగులకు స్థానమార్పులు వుంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.


కన్య: సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. రాజకీయ, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. బంధువుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి.


తుల: వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ.


వృశ్చికం: వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు.


ధనస్సు:  ఉద్యోగాలలో స్థానమార్పులు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోటులను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.


మకరం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాతమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.


కుంభం: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలం.


మీనం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121