దిన ఫలాలు 11-01-2024

దిన ఫలాలు 11-01-2024

మేషం:  అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి మందుకు సాగుతారు. పనులలో వత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సన్నిహితుల నుండి సహాయం పొందుతారు.


వృషభం: కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


మిథునం: జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత వరకు బయటపడతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభం.


కర్కాటకం: దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు.ఋణాలు తీరుస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు.


సింహం: ఉద్యోగాలలో ఏర్పడిన ఒడిదుడుకులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. ప్రయాణాలు లాభిస్తాయి.


కన్య: సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.


తుల: లక్ష్యసాధన దిశగా ముందుకు సాగుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. కాంట్రాక్టులు దక్కుతాయి.


వృశ్చికం: అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకొండి పనులు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనూకూలం.


ధనస్సు:  మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదల పెరుగుతుంది.


మకరం: భూలాభం పొందుతారు. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.


కుంభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనసౌఖ్యం.


మీనం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. స్వల్ప ధన, వస్తు, లాభాలు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121