దిన ఫలాలు 11-03-2024

దిన ఫలాలు 11-03-2024

మేషం:  ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. స్వల్ప ధన లాభం.


వృషభం: పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి.బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు.


మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.


కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.


సింహం: మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుంటుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దైవ చింతన కలిగి ఉంటారు.


కన్య: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలం. విందు, వినోదాలు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సాంకేతిక విద్యావకాశాలు.


తుల: బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.ఆర్థిక ఇబ్బందుల తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మానసిక ఉల్లాసం పెంపొందించుకుంటారు.


వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభం.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. కొంత ధన నష్టం.


మకరం: ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పోటి పరీక్షలకు సన్నద్ధం అవుతారు. రాబడి పెరుగుతుంది ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది.


కుంభం: వృత్తి, వ్యాపారాలలో పరిస్థితులు బాగుంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.


మీనం: ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. సమయానికి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121