దిన ఫలాలు 12-01-2024

దిన ఫలాలు 12-01-2024

మేషం:  నూతన విద్యావకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.


వృషభం: అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.


మిథునం: గృహనిర్మాణ ఆలోచనలలో నిదానం అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల నుండి సాయం అందుకుంటారు. సోదరుల నుండి ధనలాభం.


కర్కాటకం: మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహనయోగం. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు లాభం.


సింహం: పాతమిత్రుల నుండి ధనలాభం పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. సోదరుల కలయిక.


కన్య: ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పనులలో ఆలస్యం జరిగినా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.


తుల: కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.


వృశ్చికం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందు, వినోదాలు కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు.


ధనస్సు:  నూతన వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. పెట్టుబడులు అధికం చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. వాహనయోగం.


మకరం: ఋణాలు కొంత వరకు తీరుస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి.


కుంభం: మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. వివాదాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలం.


మీనం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన, వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121